Honda Dio 125 Price, Variants, Specifications: హోండా డియో 125 స్కూటర్, యువత కోసం రూపొందించిన Activa 125 కాంపానియన్. ఈ స్కూటర్, Activa 125లో ఉన్న అదే 124cc ఇంజిన్‌తో నడుస్తుంది. కానీ.. స్పోర్టియర్ స్టైలింగ్, బ్రైట్ కలర్స్, ఫంకీ గ్రాఫిక్స్‌తో ఫంక్షనల్ అట్రాక్షన్ ఇస్తుంది. GST 2.0 తర్వాత Honda Dio 125 ధరలు 8,000 రూపాయల వరకు తగ్గాయి. దీని వల్ల, ఖరీదైన స్కూటర్‌ల మార్కెట్‌లో ఇది మరింత ఆకర్షణీయంగా మారింది.
Honda Dio 125 గురించి తెలుసుకోవాల్సిన 7 విషయాలు
1. ట్యూబ్‌లెస్ టైర్లుDio 125 లో 12 అంగుళాల ముందు చక్రం, 10 అంగుళాల వెనుక చక్రం ఉన్నాయి, ఇవి ట్యూబ్‌లెస్ టైర్లతో వచ్చాయి. ఈ టైర్ల కాంబినేషన్ రైడింగ్ సేఫ్టీని పెంచుతుంది & ట్యూబ్‌లెస్ కారణంగా పంక్చర్ సమస్యలు తగ్గుతాయి.
2. ఇంజిన్ ఆటో స్టార్ట్/స్టాప్ సిస్టమ్ఇంధన సామర్థ్యం మెరుగుపరచడానికి ఈ టూవీలర్‌లో ఆటో స్టార్ట్/స్టాప్ సిస్టమ్ ఉంది. ఇది, మీరు బండిని ట్రాఫిక్ లేదా ఎక్కడైనా ఆపినప్పుడు ఇంధనాన్ని సేవ్ చేస్తుంది.
3. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్సైడ్ స్టాండ్ డౌన్‌లో ఉన్నపుడు ఈ వ్యవస్థ స్కూటర్ ఇంజిన్‌ను ఆపేస్తుంది & స్టార్ట్ కాకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల రైడర్ సేఫ్టీని మెరుగు పడుతుంది.
4. TFT డాష్4.2 అంగుళాల బ్లూటూత్ TFT డాష్‌ను ఈ స్కూటర్ ఇస్తుంది. దీనిలో.. కాల్స్, మ్యూజిక్, నావిగేషన్ సమాచారాన్ని చూపిస్తుంది. ఇది మోడ్రన్ & స్మార్ట్ ఫీచర్‌గా యువతకు ఆకర్షణీయంగా ఉంటుంది.
5. అందుబాటులో ఉన్న రంగులు Honda Dio 125 - రెడ్, బ్లూ, గ్రే, గ్రే-బ్లాక్, యెలో, బ్లాక్-నియన్ గ్రీన్ కలర్స్‌లో లభిస్తుంది. ప్రతి కలర్ ఫంకీ, ట్రెండీ & స్మార్ట్ లుక్స్ ఇస్తుంది.
6. పవర్ ఔట్‌పుట్ Honda Dio 125 స్కూటర్ 123.9cc సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో పరుగులు తీస్తుంది. ఈ ఇంజిన్ 8.3hp పవర్ & 10.5Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని వల్ల సిటీ రైడ్స్‌లో ఫాస్ట్‌గా దూసుకెళ్లడంతో పాటు స్మూత్ యాక్సెలరేషన్ అందుతుంది.
7. GST 2.0 తరువాత ధర Honda Dio 125 రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది, అవి: Standard &H-Smart. Standard వేరియంట్ (124 cc | Petrol | Automatic | కిక్ & సెల్ఫ్ స్టార్ట్) ఎక్స్-షోరూమ్ ధర ₹84,620. H-Smart (124 cc | Petrol | Automatic | సెల్ఫ్ స్టార్ట్ మాత్రమే) వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర ₹89,570. ధర తగ్గింపు తర్వాత ఇది యంగ్ జెనరేషన్‌ను మరింత ఆకట్టుకుంటోంది.
అదనపు ఫీచర్స్ Dio 125 లో LED హెడ్‌లైట్స్, డే-టైమ్ రన్నింగ్ లైట్స్ (DRLs), స్పోర్ట్ స్టైలింగ్ ఎలిమెంట్స్, ఫ్యాక్షనల్ గ్రాఫిక్స్ ఉన్నాయి. వీటితో పాటు... ఎర్గోనామిక్ సీటింగ్, స్టైలిష్ హ్యాండిల్ లైనింగ్, సేఫ్టీ ఫీచర్స్ డబుల్ బ్రేక్ సిస్టమ్‌తో ఇది యువత కోసం పర్ఫెక్ట్ డైలీ రైడ్‌గా నిలుస్తుంది. మోడ్రన్ డిజైన్ & బ్రైట్ కలర్స్ ప్రతి రైడ్‌ని ఫన్ & ట్రెండీగా మారుస్తాయి.