Honda CB350 Price, Mileage And Features Telugu: హోండా CB350 సిరీస్‌లో కొత్త అప్‌డేట్ వచ్చింది. మూడు మోడళ్లను సరికొత్త ధరలతో సంస్థ మార్కెట్లోకి తీసుకొచ్చింది. వీటిలో CB350, CB350C & CB350 RS ఉన్నాయి. అయితే మూడు మోడళ్లలో మెకానికల్‌గా ఎలాంటి మార్పులు చేయలేదు. ఫీచర్ల విషయంలోనూ పెద్దగా మార్పులు లేవు.

Continues below advertisement

కొత్త లైనప్‌లో ధరలను మాత్రం హోండా కంపెనీ సవరించింది. కొత్తగా CB350 STD వేరియంట్‌ను తీసుకురావడంతో ప్రారంభ ధర రూ.2.02 లక్షల నుంచి రూ.1.95 లక్షలకు తగ్గింది. దీంతో CB350 సిరీస్‌లోకి ఎంట్రీ ధర రూ.2,000 మేర తగ్గినట్లయింది.

ప్రస్తుతం CB350 RS మాత్రమే అందుబాటులో ఉంది. CB350 & CB350C మోడళ్లను అక్టోబర్ నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మూడు మోడళ్ల కోసం బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. హోండా వెబ్‌సైట్ లేదా సమీపంలోని BigWing డీలర్‌షిప్‌లో రూ.5,000 చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు.

Continues below advertisement

CB350 ధరలు

CB350 సిరీస్‌లో బేస్ వేరియంట్‌గా కొత్తగా STD మోడల్ వచ్చింది. దీని ధర రూ.1,95,200. ఆ తర్వాత DLX వేరియంట్ ధర రూ.1,97,900గా ఉంది. గతంలో H’ness పేరుతో ఉన్న టాప్ వేరియంట్‌ను ఇప్పుడు CB350 Chrome పేరుతో తీసుకొచ్చారు. దీని ధర రూ.1,99,900.

అంటే CB350 మోడల్ ధర రూ.1.95 లక్షల నుంచి రూ.1.99 లక్షల మధ్య ఉంటుంది. వేరియంట్ల పేర్లను సులభంగా గుర్తుంచుకునేలా హోండా ఈ మార్పు చేసింది.

CB350C ధరలు

CB350C సిరీస్‌లో మూడు వేరియంట్లు ఉన్నాయి. STD వేరియంట్ ధర రూ.2,00,300. DLX వేరియంట్ ధర రూ.2,02,700. టాప్ వేరియంట్ అయిన Special Edition ధర రూ.2,04,700గా ఉంది.

ఈ మోడల్‌లో గతంతో పోలిస్తే వేరియంట్‌ల ధరలు సుమారు రూ.2,061 వరకు పెరిగాయి.

ఇది కూడా చదవండి: రూ. 2.92 లక్షల RE హిమాలయన్ 440ని కేవలం రూ.30,000 కే ఇంటికి తెచ్చుకోండి! తక్కువ వడ్డీతో EMI లెక్కలు

CB350 RS ధరలు

స్పోర్టీ డిజైన్‌తో వచ్చే CB350 RS ధర రూ.1,99,900 నుంచి ప్రారంభమవుతుంది. దీని టాప్ వేరియంట్ DLX ధర రూ.2,02,500గా ఉంది. గత ధరతో పోలిస్తే ఈ వేరియంట్ ధర సుమారు రూ.2,000 మేర పెరిగింది.

CB350 RS DLXలో కొత్తగా Pearl Siren Blue రంగును హోండా అందిస్తోంది. ఇప్పటికే ఉన్న ఆరు రంగుల్లో స్టిక్కరింగ్‌ను కూడా స్వల్పంగా మార్చింది.

ఇంజిన్‌లో మార్పులు లేవు

కొత్త అప్‌డేట్‌లో భాగంగా ధరలు & వేరియంట్ పేర్లలో మార్పులు చేసినప్పటికీ, ఈ బైకుల ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. మూడు మోడళ్లలోనూ 348.36cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కొనసాగుతుంది. ఈ ఇంజిన్ 20.7hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. గరిష్ఠంగా 30Nm టార్క్‌ను అందిస్తుంది. 

ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్ ఛానల్ ABS, స్లిప్ & అసిస్ట్ క్లచ్ వంటి ఫీచర్లు స్టాండర్డ్‌గా ఉంటాయి. హోండా RoadSync స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ కూడా అన్ని మోడళ్లలో అందుబాటులో ఉంటుంది. 

మొత్తంగా చూస్తే, హోండా CB350 సిరీస్‌లో ప్రధానంగా ధరలు, వేరియంట్ పేర్లు & రంగుల్లో మార్పులు చేసింది. యాంత్రిక పనితీరు & ప్రధాన ఫీచర్లలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.

గమనిక: అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ధరలు.

ఇది కూడా చదవండి: రూ.35,000 డౌన్‌పేమెంట్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 రోడ్‌స్టర్ బైక్‌ను సొంత చేసుకోవచ్చు! EMI ఎంతంటే?

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.