Honda CB125 Hornet Mileage Test Specifications: హోండా కంపెనీ, 125cc సెగ్మెంట్‌లో కొత్తగా తీసుకువచ్చిన బైక్‌ CB125 Hornet మైలేజ్‌ టెస్ట్‌ ఫలితాలు బయటకొచ్చాయి. యంగ్‌ & డైనమిక్‌ రైడర్లను దృష్టిలో పెట్టుకుని ఈ బైక్‌ను డిజైన్‌ చేశారు. కంఫర్ట్‌, పనితీరు, ఫ్యూయల్‌ ఎఫిషియెన్సీ మూడు అంశాల్లోనూ ఈ బైక్‌ హోండా స్టాండర్డ్స్‌కి తగ్గట్టు నిలిచింది.

Continues below advertisement

ఇంజిన్‌ వివరాలుHonda CB125 Hornet బైక్‌లో 123.94cc సింగిల్‌ సిలిండర్‌, ఎయిర్‌ కూల్డ్‌ ఇంజిన్‌ ఉంది. ఇది 7,500rpm వద్ద 11.1 hp పవర్‌, 6,000rpm వద్ద 11.2 Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్‌ గేర్‌బాక్స్‌ కలిగిన ఈ బైక్‌లో TFT డిస్‌ప్లే కూడా ఉంది. ఇందులోని ఎకో ఇండికేటర్‌ ఫీచర్‌, రైడర్‌ ఈ బైక్‌ను ఎఫిషియెంట్‌గా రైడ్‌ చేయడంలో ఉపయోగపడుతుంది.

మైలేజ్‌ టెస్ట్‌ ఫలితాలుటెస్ట్‌ రన్‌లో హోండా CB125 హార్నెట్‌ సిటీ రైడ్‌లో లీటరుకు 59.8 km, హైవే రైడ్‌లో లీటరుకు 69.3 km మైలేజ్‌ ఇచ్చింది. సగటు చూస్తే దాదాపు 63.5 km/l వచ్చింది. ఈ ఫలితాలు 125cc బైక్‌లలో చాలా అద్భుతమని చెప్పాలి.

Continues below advertisement

టెస్టింగ్‌ సమయంలో, ఈ మోటార్‌ సైకిల్‌ను హైవే మీద గంటకు 60-70 km స్పీడ్‌లో ఎక్కువ సేపు నడిపారు. 75 km/h దాటగానే ఇంజిన్‌లో కొంచెం వైబ్రేషన్స్‌ వచ్చాయని టెస్ట్‌ రైడర్స్‌ వెల్లడించారు. అయినప్పటికీ, ఎకానమి రైడ్‌ రేంజ్‌లో ఈ చాలా బైక్‌ స్మూత్‌గా నడిచింది.

సిటీ రైడ్‌ అనుభవంసిటీలో ట్రాఫిక్‌ పరిస్థితుల్లో కూడా ఈ బైక్‌ ఫర్‌ఫార్మెన్స్‌ చాలా బాగుంది. తేలికైన క్లచ్‌, సాఫ్ట్‌ గేర్‌ షిఫ్టింగ్‌ వంటివి ఈ బండిని హ్యాండిల్‌ చేయడం సింపుల్‌గా మార్చాయి. ఎకో ఇండికేటర్‌ సాయంతో సరిగా గేర్‌ మార్చుకుంటూ నడిపితే ఈ బైక్‌ అద్భుతమైన మైలేజ్‌ ఇస్తుంది.

టెస్టింగ్‌ ఎలా చేశారు?ఫ్యూయల్‌ ఎఫిషియెన్సీ టెస్టింగ్‌లో, టెస్ట్‌ రైడర్లు ఈ బండి ఫ్యూయల్‌ ట్యాంక్‌ను ఫుల్‌ చేశారు. కంపెనీ సిఫారసు చేసిన టైర్‌ ప్రెజర్‌ సెట్‌ చేశారు. ఆ తర్వాత సిటీ, హైవే రెండు మార్గాల్లో స్థిరమైన స్పీడ్‌లతో బైక్‌ను నడిపారు. చివరగా ట్యాంక్‌ను మళ్లీ నింపి, ప్రయాణ దూరాన్ని లీటర్లతో పోల్చి ఖచ్చితమైన మైలేజ్‌ లెక్కలు తీసుకున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ధరఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణలో, హోండా CB125 హార్నెట్‌ ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 1,02,770. అన్ని పన్నులతో కలుపుకుని దీని ఆన్‌-రోడ్‌ రేటు దాదాపు రూ. 1.30 లక్షలు. నగరం & డీలప్‌షిప్‌ను బట్టి ఈ రేటు కాస్త మారవచ్చు.

హోండా CB125 హార్నెట్‌.. లుక్స్‌లో, మైలేజ్‌లో, రైడింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌లోనూ యువ రైడర్ల అంచనాలకు సరిపోయేలా ఉంది. రోజువారీ ప్రయాణాలకు తక్కువ ఖర్చుతో కంఫర్ట్‌గా నడిపే బైక్‌ కావాలనుకునేవారికి కూడా ఇది ఒక మంచి ఆప్షన్‌.