Honda Amaze GST Price Cut: మన మార్కెట్‌లో, ADAS టెక్నాలజీతో వచ్చిన అత్యంత అందుబాటు ధర కారు 'హోండా అమేజ్', ఇప్పుడు ఇంకా అందుబాటులోకి వచ్చింది. కొత్త GST 2.0 రేట్లు అమలులోకి వచ్చిన తర్వాత దీని ధరలు ₹1,20,000 వరకు తగ్గాయి. గతంలో ₹7,62,800 కి రిటైల్ జరిగిన బేస్ వేరియంట్ S MT (Old Gen) ఎక్స్-షోరూమ్ ధర ఇప్పుడు కేవలం ₹6,97,700 మాత్రమే. ఈ కారు, మునుపటి ధరతో పోలిస్తే ఇప్పుడు నేరుగా ₹65,100 పొదుపు చేస్తుంది. 

ఇంటీరియర్‌లో ప్రీమియం & మోడ్రన్‌ టచ్హోండా అమేజ్ క్యాబిన్ ఇప్పుడు ఎక్కువ ప్రీమియంగా అనిపిస్తుంది, మెరుగైన నాణ్యత ఉన్న విడిభాగాలను ఉపయోగించారు. కారు లోపలికి ఎక్కి కూర్చోగానే, ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేకు మద్దతు ఇచ్చే 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మన దృష్టిని ఆకర్షిస్తుంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ & పుష్-బటన్ స్టార్ట్ వంటి ఫీచర్లను కూడా చూడవచ్చు, ఇవి కారును ఆధునికంగా & సౌకర్యవంతంగా ఉంచుతాయి. ఈ కారులో పెద్ద 420-లీటర్ బూట్ స్పేస్‌ ఉంది, తగినంత సామాను పెట్టుకోవచ్చు.

సేఫ్టీ ఫీచర్లుభారతదేశంలో, ADAS (హోండా సెన్సింగ్) సూట్‌తో వచ్చిన అత్యంత తక్కువ ధర కారు హోండా అమేజ్ అని చెప్పవచ్చు. లేన్-కీపింగ్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ & కొలిషన్ మిటిగేషన్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లను ఇది అందిస్తుంది. అదనంగా, ఈ కారులో ఆరు ఎయిర్‌బ్యాగులు, EBD తో ABS, రియర్ పార్కింగ్ సెన్సార్లు, రియర్‌వ్యూ కెమెరా & ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్‌ ఉన్నాయి. ఇది, అత్యంత సురక్షితమైన సెడాన్‌లలో ఒకటి.

ఇంజిన్ & పెర్ఫార్మెన్స్‌కొత్త హోండా అమేజ్ 1.2-లీటర్ i-VTEC పెట్రోల్ ఇంజిన్‌తో పవర్‌ తీసుకుంటుంది, ఇది 89 bhp & 110 Nm టార్క్ జనరేట్‌ చేస్తుంది. ఈ ఇంజిన్ ఇప్పుడు E20 ఇంధన ప్రమాణాలకు అనుగుణంగా ఉంది. కస్టమర్లు 5-స్పీడ్ మాన్యువల్ & 7-స్టెప్ CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మధ్య ఒకదానిని ఎంచుకోవచ్చు. కొన్ని వేరియంట్‌లు ఇప్పటికీ 1.5-లీటర్ i-DTEC డీజిల్ ఇంజిన్‌ను అందిస్తున్నాయి, ఈ ఇంజిన్‌ 100 PS పవర్ & 200 Nm టార్క్‌ను ఇస్తుంది.

మైలేజ్హోండా అమేజ్ మంచి మైలేజ్ రేటింగ్‌ సాధించింది. దీని పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ లీటరుకు 18 నుంచి 19 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుంది. పెట్రోల్ CVT వేరియంట్ లీటరుకు 18 నుంచి 24 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. డీజిల్ వేరియంట్ 24.7 కిలోమీటర్ల అత్యధిక మైలేజీని అందిస్తుంది. 

హోండా అమేజ్ పోటీ కార్లుMaruti Dzire, Hyundai Aura & Tata Tigor వంటి కాంపాక్ట్ సెడాన్‌లతో హోండా అమేజ్ పోటీ పడుతుంది. ముఖ్యంగా, మారుతి డిజైర్ ధర ఇప్పుడు ₹87,700 వరకు తగ్గింది, దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర ₹6.25 లక్షలకు చేరుకుంది. ఈ రెండు కార్లు ఇప్పుడు డబ్బుకు తగిన విలువను అందిస్తున్నాయి. తత్ఫలితంగా, కాంపాక్ట్ సెడాన్ విభాగంలో కస్టమర్లకు ఇప్పుడు మరింత మెరుగైన ఎంపికలు అందుబాటులోకి వచ్చాయి.