Honda Activa e vs Bajaj Chetak: భారతీయ టూ-వీలర్ మార్కెట్లో దశాబ్దాలుగా తిరుగులేని సామ్రాజ్యాన్ని నడిపిన రెండు లెజెండరీ బ్రాండ్లు ఇప్పుడు సరికొత్త విప్లవానికి తెరలేపాయి. ఒకప్పుడు భారతీయ కుటుంబాల ఇళ్ల ముందు హమారా బజాజ్ అంటూ గర్వంగా నిలిచిన చేతక్, ఇప్పుడు సరికొత్త ఎలక్ట్రిక్ అవతార్ లో దూసుకుపోతోంది. మరోవైపు, ఇండియన్ స్కూటర్ మార్కెట్ హిస్టరీని తిరగరాసి, ప్రతి ఇంట్లోనూ ఒక భాగమైపోయిన అన్‌డిస్ప్యూటెడ్ కింగ్ హోండా యాక్టివా, తన మోస్ట్ అవేటెడ్ హోండా యాక్టివా ఇ రూపంలో డిజిటల్ పవర్ ప్యాక్డ్‌గా ఎంట్రీ ఇచ్చింది.
నేటి జెన్-జీ, ఆల్ఫా తరం ఆటోమొబైల్ కస్టమర్లు కేవలం లూక్స్ చూసి మోసపోవడం లేదు. వారికి కావాల్సింది అల్ట్రా-మోడరన్ టెక్నాలజీ, మైండ్-బ్లోయింగ్ రేంజ్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, అన్నింటికంటే ముఖ్యంగా వ్యాల్యూ ఫర్ మనీ! మీ పాత పెట్రోల్ స్కూటర్‌ను వదిలించుకుని ఒక సూపర్ స్టైలిష్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇంటికి తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ రెండు దిగ్గజ ఈవీ స్కూటర్లలో మీ బడ్జెట్‌కు, మీ లైఫ్‌స్టైల్‌కు ఏది పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుందో ఈ ఇన్-డెప్త్ విశ్లేషణలో చూద్దాం.
ఐకానిక్ బ్రాండ్ల సరికొత్త ఈవీ వార్
దేశంలో బజాజ్ చేతక్ అంటే మన తాతలు, తండ్రుల కాలంలో చాలా నమ్మకం ఉండేది. అదే నమ్మకాన్ని సరికొత్త ప్రీమియం మెటల్ బాడీ, లగ్జరీ పెయింట్ ఫినిషింగ్‌తో రీ-బ్రాండింగ్ చేసి సరికొత్త ఈవీగా మార్కెట్లోకి తెచ్చింది బజాజ్. దీనికి భిన్నంగా హోండా తన సరికొత్త ఎలక్ట్రిక్ వేరియంట్‌కు అదే ఐకానిక్ యాక్టివా డిజైన్ లాంగ్వేజ్‌ను కొనసాగిస్తూనే, లోపల మాత్రం స్వాపబుల్ బ్యాటరీ టెక్నాలజీని అమర్చింది. చేతక్ క్లాసిక్ లగ్జరీని ఇష్టపడేవారిని టార్గెట్ చేస్తే, హోండా యాక్టివా ఇ నిత్యం సిటీ ట్రాఫిక్‌లో తిరిగే ప్రాక్టికల్ రైడర్లను లక్ష్యంగా చేసుకుంది.
మెటల్ బాడీ వర్సెస్ మోడరన్ స్టైల్
డిజైన్ పరంగా బజాజ్ చేతక్ తన సిగ్నేచర్ సాలిడ్ స్టీల్ బాడీతో వస్తుంది. మార్కెట్లో దొరికే చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ప్లాస్టిక్ లేదా ఫైబర్ బాడీతో వస్తుంటే, చేతక్ మాత్రం పాతకాలపు గట్టిదనాన్ని నిలబెట్టుకుంది. దీని రౌండ్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, సీక్వెన్షియల్ బ్లింకర్స్ దీనికి ఒక రాయల్ లుక్‌ను ఇస్తాయి. హోండా యాక్టివా ఇ మోడరన్ ఫ్యూచరిస్టిక్ లుక్‌తో, తేలికపాటి హై-గ్రేడ్ కాంపోజిట్ మెటీరియల్స్‌తో తయారైంది. ఇది స్కూటర్ బరువును తగ్గించి ఎఫిషియన్సీని పెంచడానికి సహాయపడుతుంది.
స్వాపబుల్ పవర్ వర్సెస్ ఫిక్స్‌డ్ బ్యాటరీ
ఇక్కడే అసలైన యుద్ధం నడుస్తోంది. హోండా యాక్టివా ఇ లో విప్లవాత్మకమైన హోండా మొబైల్ పవర్ ప్యాక్ ఇ సిస్టమ్‌ను ఉపయోగించింది. ఇందులో రెండు డిటాచబుల్ బ్యాటరీలు ఉంటాయి, వీటిని మీరు మీ ఫ్లాట్‌లోకి తీసుకెళ్లి ఛార్జ్ చేసుకోవచ్చు లేదా స్వాపింగ్ స్టేషన్లలో కేవలం 2 నిమిషాల్లో మార్చుకోవచ్చు. దీనికి భిన్నంగా బజాజ్ చేతక్ 3.2 kWh సామర్థ్యం గల ఫిక్స్‌డ్ లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తుంది. దీనిని స్కూటర్ నుంచి బయటకు తీయలేం, కాబట్టి మీ పార్కింగ్ ఏరియాలో ఛార్జింగ్ పాయింట్ ఉండటం తప్పనిసరి.
రేంజ్ ,పర్ఫార్మెన్స్‌లో ఎవరు టాప్?
రేంజ్ విషయానికి వస్తే, బజాజ్ చేతక్ ఒక అడుగు ముందే ఉంది. ఇది సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 127 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్‌ను ఇస్తుంది. అదే సమయంలో హోండా యాక్టివా ఇ 102 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తోంది. అయితే పర్ఫార్మెన్స్‌లో హోండా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. యాక్టివా ఇ టాప్ స్పీడ్ 80 కిమీ/గంట ఉండగా, చేతక్ గరిష్టంగా 70-73 కిమీ/గంట వేగాన్ని అందుకుంటుంది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఇన్‌స్టంట్ టార్క్‌తో దూసుకుపోవడానికి యాక్టివా ఇ లోని 6 kW మోటార్ అద్భుతంగా పనిచేస్తుంది.
టెక్నాలజీలో ఎవరిది పైచేయి?
బజాజ్ చేతక్ ప్రీమియం వేరియంట్లో 5-ఇంచ్ టిఎఫ్‌టి డిస్‌ప్లే ఉంది, ఇది బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీని అందిస్తుంది. టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్/మెసేజ్ అలర్ట్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. హోండా యాక్టివా ఇ లో హోండా రోడ్‌సింక్ ఆర్కిటెక్చర్‌తో కూడిన డిజిటల్ నెగటివ్ ఎల్‌సిడీ క్లస్టర్ ఉంది, ఇది వాయిస్ కంట్రోల్ సపోర్ట్ ను కూడా అందిస్తుంది. రెండు స్కూటర్లలోనూ రివర్స్ అసిస్ట్, రైడింగ్ మోడ్స్, ఎల్‌ఈడీ లైటింగ్ కామన్‌గా ఉన్నాయి.హోండా యాక్టివా ఇ ఎక్స్-షోరూమ్ ధర 1,18,147 రూపాయలు ఉంటే బజాజ్ చేతక్ 1,11,006రూపాయలుగా ఉంది.
