భారత మార్కెట్‌లో టూవీలర్ సెగ్మెంట్లో హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ అధికంగా విక్రయాలు జరుపుకుంటున్నాయి. ముఖ్యంగా యువత వీటిని బాగా ఇష్టపడుతున్నారు. ఈ రెండు టూవీలర్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. యాక్టివా, జూపిటర్ దాదాపు ఒకే ధర పరిధిలో వస్తాయి. ఈ రెండు స్కూటర్ల ప్రారంభ ధర 75 వేల రూపాయలుగా ఉంది. ఈ రెండు టూ-వీలర్ల పవ, మైలేజ్, ఫీచర్ల గురించి ఇక్కడ తెలుసుకోండి. 

Continues below advertisement

హోండా యాక్టివా (Honda Activa)

హోండా యాక్టివా 6 రంగుల వేరియంట్‌లలో భారత మార్కెట్‌లో అందుబాటులో ఉంది. హోండాకు చెందిన ఈ స్కూటర్ స్టాండర్డ్, DLX, స్మార్ట్ మూడు వేరియంట్‌లలో మార్కెట్‌లో ఉంది. ఈ స్కూటర్ స్టాండర్డ్ మోడల్లో హలోజన్ హెడ్‌లైట్స్, DLX, స్మార్ట్ మోడల్లో LED హెడ్‌లైంప్లు ఉన్నాయి. ఈ టూ వీలర్ స్మార్ట్ వేరియంట్‌లో మాత్రమే బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ ఫీచర్ ఇచ్చారు. 

హోండా యాక్టివాలో స్టాండర్డ్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర 74,619 రూపాయలు, DLX మోడల్ ఎక్స్-షోరూమ్ ధర 84,272 రూపాయలుగా ఉంది. ఇక స్మార్ట్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర 87,944 రూపాయలు అని కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్లో 4-స్ట్రోక్, SI ఇంజిన్ ఉంటుంది. హోండా యాక్టివా రోడ్లు, ఏరియాను బట్టి 60 kmpl మైలేజ్ ఇస్తుందని పేర్కొంది.

Continues below advertisement

టీవీఎస్ జూపిటర్ (TVS Jupiter)

టీవీఎస్ జూపిటర్ 4 వేరియంట్‌లలో భారత మార్కెట్‌లో అందుబాటులో ఉంది. స్పెషల్ ఎడిషన్, స్మార్ట్ Xonnect డిస్క్, స్మార్ట్ Xonnect డ్రమ్, డ్రమ్ అల్లాయ్. ఈ స్కూటర్ 7 రంగుల ఎంపికలలో వస్తుంది. టీవీఎస్ జూపిటర్ ఎక్స్-షోరూమ్ ధర 72,400 రూపాయల నుండి ప్రారంభమవుతుంది. టీవీఎస్స్కూటర్లో సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్ ఇంజిన్ ఇచ్చారు., ఇది 6,500 rpm వద్ద 5.9 kW పవర్, 5,000 rpm వద్ద 9.2 Nm టార్క్ అందిస్తుంది. టీవీఎస్ జూపిటర్ ఒక లీటర్ పెట్రోల్‌తో 53 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని సంస్థ పేర్కొంది.

టీవీఎస్ ఈ స్కూటర్లో రెండు హెల్మెట్‌లను ఉంచుకోవడానికి తగినంత స్థలం ఉంటుంది. స్కూటర్ శైలి విషయానికి వస్తే.. ఇందులో టెయిల్ లైట్ బార్ ఇచ్చారు. ఈ టూ-వీలర్లో భద్రతపై ఎక్కువ శ్రద్ధ చూపారు. కొంతమంది స్కూటర్ ను స్టార్ట్ చేసే ముందు సైడ్ స్టాండ్ తీయడం మర్చిపోతుంటారు. అందుకు పరిష్కారం కోసం, ఈ స్కూటర్లో సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఇచ్చారు.

Also Read: 1st Gearbox Electric Bike: బైక్ లవర్స్‌కు ఇక నో పెట్రోల్ టెన్షన్- తొలి గేర్‌బాక్స్ ఎలక్ట్రిక్ బైక్ ధర, పూర్తి వివరాలు