Best Scooter In India: భారతదేశంలో స్కూటర్‌ అనగానే ముందుగా గుర్తుకు వచ్చే రెండు పేర్లు - హోండా ఆక్టివా & టీవీఎస్‌ జూపిటర్‌. దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే ఈ రెండు స్కూటర్లు కొత్తగా స్కూటర్‌ కొనాలనుకునే చాలా మంది తొలి ఎంపికలుగా నిలుస్తాయి. ఆటోమొబైల్‌ ఎక్స్‌పర్ట్‌లు ముంబయి రోడ్లపై కొన్ని రోజుల పాటు ఈ రెండు స్కూటర్లను వరుసగా నడిపిన తర్వాత, నిజ జీవితంలో ఏది మెరుగైనదో తెలుసుకునే ప్రయత్నం చేశారు.

Continues below advertisement

డిజైన్‌ & ఫీచర్లు: దేని బలం దానిదే

డిజైన్‌ విషయంలో, ఆక్టివా చాలా పరిచయమైన లుక్‌తో కనిపిస్తుంది. దాదాపు 25 ఏళ్లుగా మార్కెట్లో ఉన్నప్పటికీ ఆక్టివా ఆకృతి పెద్దగా మారలేదు. కొంతమందికి ఇది పాతగా అనిపించవచ్చు. కానీ అమ్మకాల సంఖ్యను చూస్తే, డిజైన్‌ వల్ల ఆక్టివాకు ఏ మాత్రం ఇబ్బంది లేదని అర్థమవుతుంది. హోండా నుంచి వచ్చిన స్కూటర్‌ కావడంతో బిల్డ్‌ క్వాలిటీ బాగా నమ్మకంగా ఉంటుంది.

Continues below advertisement

టాప్‌ వేరియంట్‌లో ఆక్టివా కలర్‌ TFT డిస్‌ప్లే, బ్లూటూత్‌ కనెక్టివిటీ, కీ లెస్‌ ఇగ్నిషన్‌, స్టార్ట్‌ స్టాప్‌ టెక్నాలజీ వంటి ఆధునిక ఫీచర్లను ఇస్తుంది. కీ లెస్‌ సిస్టమ్‌ రోజువారీ వినియోగంలో చాలా సౌకర్యంగా ఉంటుంది. అయితే అండర్‌సీట్‌ స్టోరేజ్‌ కేవలం 18 లీటర్లు మాత్రమే ఉండటం, ముందు డిస్క్‌ బ్రేక్‌ ఆప్షన్‌ లేకపోవడం లాంటి అంశాలు ఆక్టివా వయసును చూపిస్తాయి.

ఇక్కడే జూపిటర్‌ ముందంజలో ఉంటుంది. 33 లీటర్ల భారీ బూట్‌ స్పేస్‌, ముందు భాగంలో ఫ్యూయల్‌ ఫిల్లర్‌, ఎలక్ట్రిక్‌ బూస్ట్‌, 12 ఇంచుల వీల్స్‌, ముందు డిస్క్‌ బ్రేక్‌ వంటి ఫీచర్లతో జూపిటర్‌ మరింత ప్రాక్టికల్‌గా అనిపిస్తుంది. చిన్నచిన్న రోజువారీ అవసరాలకు ఉపయోగపడే పార్కింగ్‌ బ్రేక్‌ లాక్‌, లైట్‌ సెంటర్‌ స్టాండ్‌, వెనుక షాక్‌ అడ్జస్టర్‌ లాంటి విషయాలు కూడా జూపిటర్‌కు అదనపు ప్లస్‌.

రైడ్‌, హ్యాండ్లింగ్‌, పనితీరు

ఆక్టివా నడిపితే స్మూత్‌గా, న్యూట్రల్‌గా అనిపిస్తుంది. ఇంజిన్‌ మృదువుగా పని చేస్తుంది, రైడ్‌ కంఫర్ట్‌ కూడా బాగానే ఉంటుంది. చాలా స్కూటర్లకు ఇది ఒక బెంచ్‌మార్క్‌లా ఉంటుంది.

కానీ జూపిటర్‌పై కూర్చోగానే ఒక మెట్టు పైకి వెళ్లిన ఫీలింగ్‌ వస్తుంది. ఇంజిన్‌ మరింత స్మూత్‌గా అనిపిస్తుంది, హైవే స్పీడ్స్‌లో కూడా ఇబ్బంది పెట్టదు. సస్పెన్షన్‌ సెటప్‌ చాలా బ్యాలెన్స్‌గా ఉండటంతో, గుంతలు, పాడైన రోడ్లపై కూడా నమ్మకంగా ముందుకు సాగుతుంది. హై స్పీడ్‌ స్టేబిలిటీ విషయంలో జూపిటర్‌ కొంచెం ముందుంటుంది.

బ్రేకింగ్‌ విషయంలో రెండూ సమానంగానే ఉన్నా, జూపిటర్‌లో ముందున్న డిస్క్‌ బ్రేక్‌ రైడర్‌కు ఎక్కువ నమ్మకం ఇస్తుంది.

మైలేజ్‌లో ఏది బెస్ట్‌?

మైలేజ్‌ అనేది మనకు చాలా కీలకమైన విషయం. ఈ విషయంలో ఆక్టివా కొంచెం ఆధిక్యం చూపిస్తుంది. రెండూ మంచి ఫ్యూయల్‌ ఎఫిషియెన్సీ ఇస్తున్నా, ఆక్టివా ఇంజిన్‌ మరికొంత డబ్బు మిగులుస్తుంది.

తుది తీర్పు

హోండా ఆక్టివా ఇప్పటికీ అమ్మకాలలో రాజుగానే కొనసాగడానికి కారణం దాని నమ్మకమైన పనితీరు, మంచి రీసేల్‌ విలువ, స్థిరమైన మైలేజ్‌. కొత్త ఫీచర్లతో ఇప్పుడు కూడా ఇది బలమైన ఎంపికగానే ఉంది.

అయితే, పూర్తిగా ప్రాక్టికల్‌గా, ఆధునికంగా, రైడ్‌ కంఫర్ట్‌లో కొంచెం మెరుగ్గా చూస్తే టీవీఎస్‌ జూపిటర్‌ స్పష్టంగా ముందుంటుంది. ప్రాంతాని బట్టి సర్వీస్‌ అనుభవం మారవచ్చన్న అభిప్రాయం ఉన్నా, ఒక ప్రొడక్ట్‌గా జూపిటర్‌ ఈ కంపారిజన్‌లో విజేతగా చెప్పవచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.