Honda Activa on Down Payment and EMI: భారత మార్కెట్లో స్కూటర్లకు మంచి ప్రజాదరణ ఉంది. ఇప్పుడు మనదేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్ గురించి చెప్పాలంటే అది హోండా యాక్టివా. ఈ స్కూటర్ ధర అందుబాటులో ఉండటంతోపాటు మంచి మైలేజీని కూడా ఇస్తుంది. మీరు కూడా హోండా యాక్టివాను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, దాని డౌన్ పేమెంట్, ఈఎంఐ గురించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హోండా యాక్టివా ఎక్స్ షోరూమ్ ధర రూ.76,684 నుంచి రూ.82,684 మధ్యలో ఉంది. దీని టాప్ మోడల్ ఆన్ రోడ్ ధర గురించి రూ.92,854గా ఉంది. హోండా యాక్టివా మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
ఎంత డౌన్‌పేమెంట్ కట్టాలి?
మీరు రూ. 10,000 డౌన్ పేమెంట్‌తో హోండా యాక్టివా బేస్ మోడల్‌ను కొనుగోలు చేస్తే, బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీ మీకు దాదాపు రూ. 80,000 రుణం ఇస్తుంది. దానిపై మీరు 9.7 శాతం వడ్డీ చెల్లించాలి. మీరు ఐదు సంవత్సరాల కాల పరిమితితో లోన్ తీసుకుంటే మీరు ప్రతి నెలా రూ. 2500 వరకు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. మీరు 5 సంవత్సరాలలో బ్యాంకుకు మొత్తం రూ.92,900 చెల్లిస్తారు.
Also Read: ఆకాశాన్నంటే ధర - అయినా అవుట్ ఆఫ్ స్టాక్ - మార్కెట్లో ఈ కియా కారుకు సూపర్ డిమాండ్!
యాక్టివా పవర్‌ట్రెయిన్ ఎలా ఉంది?
హోండా ఈ స్కూటర్‌లో 109.51 సీసీ ఇంజన్‌ను అందించింది. ఈ ఇంజన్ గరిష్టంగా 7.79 పీఎస్ శక్తిని, 8.84 ఎన్ఎం పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇది కాకుండా కంపెనీ తెలుపుతున్న దాని ప్రకారం ఈ స్కూటర్ 50 కిలోమీటర్ల వరకు మైలేజీని కూడా అందిస్తుంది. అదే సమయంలో ఇందులో డ్రమ్ బ్రేక్స్ అందించారు. ఈ స్కూటర్ బరువు దాదాపు 109 కిలోలుగా ఉంది.
వీటితోనే పోటీ...
ఈ స్కూటర్‌లో అనలాగ్ స్పీడోమీటర్, ఓడోమీటర్, ప్యాసింజర్ ఫుట్‌రెస్ట్, ఈఎస్‌పీ టెక్నాలజీ, షట్టర్ లాక్ ఉన్నాయి. అలాగే ఈ స్కూటర్‌లో 5.3 లీటర్ల పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. మార్కెట్లో ఈ స్కూటర్ టీవీఎస్ జూపిటర్, సుజుకి యాక్సెస్ 125 వంటి స్కూటర్లకు ప్రత్యక్షంగా పోటీని ఇస్తుంది.
Also Read: వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉన్న బెస్ట్ కార్లు - అసలు లేకపోయినా ఆశ్చర్యం అక్కర్లేదు!