Honda Activa 110 Review Telugu: భారతదేశంలో స్కూటర్ మార్కెట్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు హోండా యాక్టివా. దాదాపు రెండు దశాబ్దాలుగా, బెస్ట్ సెల్లింగ్ స్కూటర్‌గా తన స్థానాన్ని ఎవ్వరూ కదలించలేని స్థాయిలో నిలబెట్టుకుంది. కాలక్రమేణా పెద్ద మార్పులు రాకపోయినా, Activa 110 ఇప్పటికీ చాలా మందికి నమ్మకమైన, ఆచరణీయమైన ఎంపికగానే ఉంది. అయితే ఈ స్కూటర్‌లో అనుకూలతలు, ప్రతికూలతలు రెండూ ఉన్నాయి. ఈ బండి ఎవరికి సూటవుతుంది, ఏ సందర్భాల్లో ఇతర ఆప్షన్లను చూడాలి అనేది ఈ రివ్యూలో మీకు అర్ధమవుతుంది.

Continues below advertisement

Honda Activa 110 కొనడానికి 3 ప్రధాన కారణాలు

1. స్మూత్ ఇంజిన్ & అద్భుతమైన మైలేజ్హోండా ఇంజిన్లు రిఫైన్‌మెంట్‌ విషయంలో ఎప్పటి నుంచో బెస్ట్. Activa 110 కూడా అదే తరహా స్మూత్ పెర్ఫార్మెన్స్‌తో నడుస్తుంది. దీని లాంగ్-స్ట్రోక్ ఇంజిన్ వేగంగా నడిపినా, నెమ్మదిగా నడిపినా పెద్దగా వైబ్రేషన్ లేకుండా పని చేస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే, Activa లీటరుకు 60 km వరకు మైలేజ్ ఇస్తుంది. రోజువారీ ప్రయాణాలు, పెట్రోల్ ఖర్చులు తగ్గించుకోవాలనుకునే వారికి ఇది మంచి ప్లస్ పాయింట్.

Continues below advertisement

2. డైలీ యూజ్‌కు కావాల్సిన కంఫర్ట్ & కన్వీనియెంట్‌ ఫీచర్లుస్కూటర్ తీసుకునే ప్రధాన కారణం ‘కన్వీనియన్స్’. ఈ విషయంలో Activa 110 తన ప్రాక్టికల్ ఫీచర్లతో ముందు వరుసలో ఉంటుంది. కీ లెస్ ఫంక్షన్ అందించడం వల్ల, ఫాబ్ జేబులో ఉండగానే, మీరు కేవలం నాబ్ తిప్పితే చాలు - లాక్/అన్‌లాక్, స్టార్ట్/ఆఫ్ అన్నీ అవుతాయి. అదే విధంగా, స్టార్ట్/స్టాప్ టెక్నాలజీ కూడా ఇంధనాన్ని ఆదా చేయడంలో సాయపడుతుంది. సిగ్నల్ వద్ద ఇంజిన్ ఆగిన తర్వాత ఆక్సిటేటర్‌ తిప్పగానే మళ్లీ స్టార్ట్ అవుతుంది, చాలా సౌకర్యంగా ఉంటుంది.

3. నమ్మదగిన విశ్వసనీయత & తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులుఆక్టివా రెండు దశాబ్దాలుగా బెస్ట్ సెల్లర్ కావడానికి ప్రధాన కారణం - నమ్మకమైన క్వాలిటీ. ఇది, మామూలు స్కూటర్ కంటే ఎక్కువ కాలం సమస్యలు లేని బండిగా వాడుకునే అవకాశం ఇస్తుంది. హోండా సర్వీస్ ఖర్చులు కూడా ఇతర బ్రాండ్‌లతో పోలిస్తే తక్కువే. దీంతో దీర్ఘకాలం ఉపయోగించాలనుకునే వారికి Activa 110 మంచి ఇన్వెస్ట్‌మెంట్‌గా భావించవచ్చు.

Honda Activa 110 కొనకూడని 2 కారణాలు

1. చిన్న అండర్‌సీట్ స్టోరేజ్ - ఈ రోజుల అవసరాలకు సరిపోదునేటి తరం స్కూటర్లలో స్టోరేజ్‌ స్పేస్‌ చాలా ముఖ్యం. కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లలో 35 లీటర్లకు పైగా స్టోరేజ్ ఇస్తున్నారు. కానీ Activa 110లో మాత్రం కేవలం 18 లీటర్ల స్టోరేజ్ మాత్రమే ఉంది. హెల్మెట్ పెట్టాలనుకున్నా, రోజువారీ వస్తువులు వేసుకోవాలనుకున్నా ఈ స్పేస్‌ చాలా పరిమితంగా ఉంటుంది. ఇది పెద్ద మైనస్ పాయింట్.

2. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ లేకపోవడం మరో పెద్ద లోపంటాప్ H-Smart వేరియంట్‌లో TFT డిస్‌ప్లే, కీ లెస్ స్టార్ట్, స్టార్ట్/స్టాప్ టెక్ ఉన్నప్పటికీ... ఇప్పటికి కూడా ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఇవ్వకపోవడం ఆశ్చర్యకరం. డ్రమ్ బ్రేక్ పని చేస్తుంది, కానీ... బ్రేక్‌ ఫీల్‌ పరంగా, బ్రేకింగ్‌ పెర్ఫార్మెన్స్‌ పరంగా డిస్క్ బ్రేక్‌తో పోలిస్తే స్పష్టంగా తేలిపోతుంది. 

సింప్లిసిటీ, మైలేజీ, నమ్మకం - ఈ మూడు విలువలను ప్రాధాన్యంగా చూసేవారికి Honda Activa 110 ఇప్పటికీ బెస్ట్ ఆప్షన్‌. అయితే... పెద్ద స్టోరేజ్, డిస్క్ బ్రేక్ వంటి ఆధునిక ఫీచర్లు కోరుకునే వాళ్లయితే మార్కెట్‌లోని ఇతర మోడళ్లను పరిశీలించడం మంచిది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.