టాటా మోటార్స్ నెక్సాన్ ఎస్‌యూవీ జులైలో మంచి సేల్స్ నంబర్‌ను నమోదు చేసింది. మొత్తంగా 14,214 టాటా నెక్సాన్ ఎస్‌యూవీలు ఈ నెలలో అమ్ముడయ్యాయి. జులైలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఎస్‌యూవీ టాటా నెక్సానే. జూన్ నెలలో 14,295 నెక్సాన్ ఎస్‌యూవీ యూనిట్లను టాటా విక్రయించింది. జులైలో కూడా ఈ నంబర్ దాదాపు సమానంగా ఉండటం విశేషం. ఇక గతేడాది జులైతో పోలిస్తే ఏకంగా నాలుగు వేల యూనిట్లు ఎక్కువ అమ్ముడుపోవడం విశేషం. 2021 జులైలో 10,287 నెక్సాన్ ఎస్‌యూవీలు అమ్ముడుపోయాయి.


హ్యుండాయ్ క్రెటా, హ్యుండాయ్ వెన్యూ, టాటా పంచ్, మారుతి బ్రెజాలను వెనక్కి నెట్టి టాటా నెక్సాన్ మొదటి స్థానంలో నిలవడం విశేషం. హ్యుండాయ్ క్రెటా సేల్స్ గతంతో పోలిస్తే కొంచెం తగ్గాయని చెప్పాలి. ఎందుకంటే జులైలో క్రెటా 12,625 యూనిట్లు అమ్ముడుపోయింది. ఈ సంవత్సరం జూన్‌లో క్రెటా 13,760 యూనిట్లు అమ్ముడుపోవడం విశేషం. గతేడాది జులైలో కూడా 13,000 క్రెటా యూనిట్లను హ్యుండాయ్ విక్రయించింది.


ఇక మూడో స్థానంలో ఉన్న హ్యుండాయ్ వెన్యూ ఫేస్ లిఫ్ట్ మాత్రం గతంతో పోలిస్తే మంచి పురోగతిని సాధించింది. జులైలో వెన్యూ 12,000 యూనిట్లు అమ్ముడుపోయాయి. జూన్‌లో 10,321 యూనిట్లు అమ్ముడుపోగా... దానికంటే 1,600కు పైగా ఎక్కువ యూనిట్లు జులైలో అమ్ముడుపోవడం విశేషం. ఇక గతేడాది జులైలో వెన్యూ యూనిట్లు కేవలం 8,185 మాత్రమే అమ్ముడయ్యాయి.


జులైలో మనదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఎస్‌యూవీలు ఇవే.
1. టాటా నెక్సాన్ (14,214)
2. హ్యుండాయ్ క్రెటా (12,625)
3. హ్యుండాయ్ వెన్యూ (12,000)
4. టాటా పంచ్ (11,007)
5. మారుతి బ్రెజా (9,709)


ఈ జాబితాలో నాలుగో స్థానంలో టాటా పంచ్ నిలిచింది. జులైలో టాటా పంచ్ ఏకంగా 11,007 యూనిట్లు అమ్ముడుపోయింది. ఈ సంవత్సరం జూన్‌లో 10,414 టాటా పంచ్ యూనిట్లను కంపెనీ విక్రయించింది. మారుతి బ్రెజా సేల్స్ మాత్రం దాదాపు రెట్టింపవ్వడం విశేషం. జూన్‌లో బ్రెజా యూనిట్లు 4,404 అమ్ముడుపోగా... జులైలో ఆ సంఖ్య ఏకంగా 9,709కు పెరిగింది. 


Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!


Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!


Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?