Hero Xtreme 250R Price, Mileage And Features In Telugu: హీరో మోటోకార్ప్‌ నుంచి వచ్చిన తాజా ఫ్లాగ్‌షిప్‌ బైక్‌ - Hero Xtreme 250R. 250cc ఇంజిన్‌తో వచ్చిన ఈ మోడల్, ఒరిజినల్‌ Karizma XMR 210cc ఇంజిన్‌కి అప్‌డేటెడ్‌ వెర్షన్. ధర విషయంలో ఈ బండి చాలా ఆకర్షణీయంగా ఉన్నా, కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. ఈ బైక్ కొనడానికి 2 కారణాలు, అలాగే దూరంగా ఉండడానికి 2 కారణాలు చూద్దాం.

కొనడానికి 2 కారణాలు

1. మంచి విలువ (Good Value)Hero Xtreme 250R ధర రూ. 1.80 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌). ఇది.. Suzuki Gixxer 250 (రూ. 1.98 - 2.17 లక్షలు), KTM 250 Duke (రూ. 2.28 లక్షలు) కంటే తక్కువ. ఫీచర్లు బేసిక్‌గా ఉన్నా (LCD డిస్‌ప్లే, డ్యూయల్ ఛానల్ ABS, LED లైట్స్), ధర పరంగా మంచి డీల్‌గా చెప్పుకోవచ్చు.

విజయవాడలో Hero Xtreme 250R ఆన్‌-రోడ్‌ ధర దాదాపు రూ. 2.15 లక్షలు. ఇందులో, దాదాపు రూ. 23,000 RTO ఛార్జీలు, దాదాపు రూ. 12,000 బీమా, ఇతర ఖర్చులు కూడా కలిసి ఉన్నాయి. హైదరాబాద్‌లో ఆన్‌-రోడ్‌ ధర దాదాపు రూ. 2.20 లక్షలు. ఇక్కడ RTO ఛార్జీలు దాదాపు రూ. 29,000, బీమా దాదాపు రూ. 12,000 అవుతుంది.

2. కాన్ఫిడెంట్ హ్యాండ్లింగ్ (Confident Handling)హీరో చిన్న బైక్స్‌ (125cc, 160cc) ఎక్కువగా కమ్యూటర్‌ లుక్‌ ఇస్తాయి. కానీ 250R మాత్రం నిజమైన స్పోర్ట్ బైక్‌ ఫీలింగ్ ఇస్తుంది. దీని సస్పెన్షన్ సెటప్ కాస్త హార్డ్‌గా ఉన్నా, హైవేలో రైడ్ చేస్తే కంఫర్టబుల్‌గా, స్టేబుల్‌గా ఫీలవుతారు. ఎర్గోనామిక్స్ కూడా కంఫర్టబుల్‌గా ఉండటంతో కంట్రోల్ బావుంటుంది.

దూరంగా ఉండడానికి 2 కారణాలు

1. ఇంజిన్ రిఫైన్‌మెంట్ లోపం (Engine Refinement Issues)హీరో ఇప్పటి వరకు తయారు చేసిన అత్యంత శక్తిమంతమైన రోడ్ ఇంజిన్ ఇదే అయినప్పటికీ, రిఫైన్‌మెంట్ పూర్తిగా పక్కాగా లేదు. హ్యాండిల్‌బార్‌, సీటు, ట్యాంక్‌, ఫుట్‌పెగ్‌ల వద్ద వైబ్రేషన్స్‌ కనిపిస్తాయి. దీర్ఘకాలిక రైడ్‌లో ఇది అసౌకర్యంగా మారుతుంది.         

2. ఫినిషింగ్‌ లోపం (Inconsistent Finish)డిజైన్ మస్క్యులర్‌గా ఉన్నా, కొన్ని ప్రాంతాల్లో ఓవర్‌ స్టైలింగ్‌లా కనిపిస్తుంది. ముఖ్యంగా హెడ్‌స్టాక్ దగ్గర వదులుగా ఉన్న వెల్డ్స్ కంటికి నచ్చదు. ఫ్రేమ్‌ ఫినిషింగ్ కూడా కొన్ని చోట్ల రఫ్‌గా ఉంటుంది. స్విచ్‌ గేర్‌ టచ్‌ పాయింట్స్ మాత్రం బాగానే ఉన్నాయి.         

ఫైనల్‌గా...Hero Xtreme 250R ధర పరంగా మంచి ఆప్షన్‌. స్పోర్టీ హ్యాండ్లింగ్‌ ఇష్టపడేవారికి ఇది సూట్ అవుతుంది. కానీ రిఫైన్‌మెంట్‌, బిల్డ్ క్వాలిటీ ఇష్యూలు ఉన్నందున, సరైన ప్రీమియం బైక్‌లా అనిపించదు. మీరు బడ్జెట్‌లో 250cc బైక్ కోరుకుంటే ఇది "పర్లేదు" అనుకునే ఆప్షన్‌. కానీ, కచ్చితమైన ప్రీమియం ఫీలింగ్ కావాలంటే మాత్రం Suzuki లేదా KTM బైకుల వైపు చూడాలి.