Hero Xtreme 160R 4V Cruise Control: భారత మార్కెట్లో హీరో మోటోకార్ప్ మరోసారి యూత్ బైక్ సెగ్మెంట్‌లో హీట్ పెంచింది. ఇప్పటికే మంచి సక్సెస్ సాధిస్తున్న Xtreme 160R 4V ఇప్పుడు క్రూయిజ్ కంట్రోల్ అనే కొత్త ఫీచర్‌తో అందుబాటులోకి వచ్చింది. ధర విషయానికి వస్తే, ఈ కొత్త టాప్ వేరియంట్‌ను కంపెనీ ₹1.34 లక్షల ఎక్స్-షోరూమ్ వద్ద లాంచ్ చేసింది. ప్రస్తుత స్టాండర్డ్ వేరియంట్ కంటే సుమారు ₹4,485 ఎక్కువ అయినా, ఈ కొత్త ఫీచర్లతో ధరకు సరైన విలువ దక్కేలా హీరో ప్యాకేజింగ్ చేసింది.
క్రూయిజ్ కంట్రోల్‌తో 160cc బైక్ - సెగ్మెంట్‌లోనే ఫస్ట్!
మొదటగా, 160cc క్లాస్‌లో క్రూయిజ్ కంట్రోల్ అందిస్తున్న మొట్టమొదటి బైక్ ఇదే. ఇప్పటివరకు ఈ ఫీచర్ 200cc పై బైక్‌ల్లో మాత్రమే కనిపించేది. కానీ హీరో ఈసారి యువ రైడర్ల కోసం స్పెషల్‌గా రైడ్ బై వైర్ థ్రాటిల్ టెక్నాలజీని ఇచ్చింది. దీని వల్ల క్రూయిజ్ కంట్రోల్ పని చేస్తుంది. అదే విధంగా థ్రాటిల్ రెస్పాన్స్ కూడా మరింత స్మూత్‌గా ఉంటుంది.
మూడు రైడింగ్ మోడ్‌లు - వాతావరణానికి తగ్గట్టు
ఈ కొత్త వేరియంట్‌లో మూడు రైడింగ్ మోడ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి:
Rain Mode – వర్షపు రోజుల్లో మరింత సేఫ్ రైడ్ కోసం
Road Mode – రోజువారీ కమ్యూట్‌కు బెస్ట్
Sport Mode – పవర్ డెలివరీ షార్ప్‌గా కావాలంటే ఇదే
ఈ మోడ్‌లను అప్‌డేటెడ్ స్విచ్‌గేర్‌తో సులభంగా మార్చుకోవచ్చు.
కొత్త LED హెడ్‌ల్యాంప్, కొత్త డిజిటల్ డాష్
ఈ వేరియంట్‌లో మరో విశేషం ఏమింటంటే... Xtreme 250R నుంచి ఇన్‌స్పైర్ అయిన కొత్త LED హెడ్‌ల్యాంప్. ఇది మరింత షార్ప్‌గా, మోడ్రన్‌గా కనిపిస్తుంది. అలాగే కొత్త కలర్ LCD డాష్ కూడా ఇచ్చారు. స్పీడ్, గేర్ పొజిషన్, ట్రిప్ మీటర్లు, రైడింగ్ మోడ్ సమాచారం అన్నీ క్లియర్‌గా చూపిస్తుంది.
కలర్ ఆప్షన్‌లు - కొత్తగా వచ్చిన Combat Edition హైలైట్
ఈ క్రూయిజ్ కంట్రోల్ వేరియంట్ నాలుగు కలర్‌ల్లో వస్తుంది. వాటిలో:
బ్రోన్జ్-బ్లాక్ డ్యూయల్ టోన్
ఫారెస్ట్ గ్రీన్-నియాన్ గ్రీన్
బ్లాక్-రెడ్ హైలైట్స్
ప్రత్యేకమైన Combat Edition మ్యాట్ గ్రే
ఈ Combat Edition ఈ వేరియంట్‌కే ప్రత్యేకం కాబట్టి, స్ట్రీట్ లుక్స్ ఇష్టపడేవారికి ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
ఇంజిన్, పవర్ - యథాతథంగా శక్తిమంతమైన పనితీరు
మెకానికల్‌గా ఎలాంటి మార్పులు లేవు. అదే 163.2cc ఎయిర్/ఆయిల్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్. ఈ ఇంజిన్ 16.9hp పవర్ & 14.6Nm టార్క్ ఇస్తుంది. నగరంలో కంఫర్ట్‌గా, హైవేపై కాస్త స్పోర్టీగా రైడ్ చేయాలనుకునే రైడర్లకు ఇది సరిపోయే సెటప్.
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రైడర్ల కోసం - ధరలు ఎలా ఉంటాయి?
హైదరాబాద్‌లో ఎక్స్-షోరూమ్ ధర: ₹1.34 లక్షలు
విజయవాడ ఎక్స్-షోరూమ్ ధర కూడా ఇదే రేంజ్‌లో ఉంటుంది
ఆన్‌రోడ్ ధరలు సుమారు ₹1.60 లక్షల వద్ద ఉండే అవకాశం ఉంది (వేరియంట్ & RTO పన్నులు, ఇతర అవసరమైన ఖర్చులపై ఆధారపడి చిన్న మార్పులు ఉండొచ్చు).
రైవల్స్‌తో పోలిక
Apache RTR 160 4V, Pulsar N160 వంటి బైక్‌లతో పోలిస్తే క్రూయిజ్ కంట్రోల్ & రైడ్ బై వైర్ టెక్నాలజీ కారణంగా ఈ కొత్త Xtreme 160R 4V వేరియంట్ కాస్త ముందంజలో నిలుస్తుంది.
మొత్తంగా చూస్తే... కేవలం ₹4,500 అదనంగా పెట్టి ఈ ఫీచర్లు తీసుకోవడం పూర్తిగా విలువైన నిర్ణయమే. టెక్నాలజీ, రైడింగ్ కంఫర్ట్, మోడర్న్ లుక్స్ అన్నీ కలిపితే ఇది ఆల్ ఇన్ వన్ ప్యాకేజీ అవుతుంది. యువ రైడర్లు, ఆఫీస్ కమ్యూటర్స్, వీకెండ్ రైడింగ్ ఇష్టపడేవారందరికీ ఇది మంచి ఆప్షన్.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.