GST తగ్గింపు తర్వాత భారత మార్కెట్లో బైక్‌లు, స్కూటర్లు, కార్లు మరింత చౌకగా మారాయి. హీరో స్ప్లెండర్ ప్లస్ (Hero Splendor Plus) ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ధర 73,903 రూపాయలుగా ఉంది. మరోవైపు, టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ (TVS Star City Plus) ఎక్స్-షోరూమ్ ధర సుమారు 72,500 రూపాయలు. ఈ బైక్‌ల ఇంజిన్, పనితీరు, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
Hero Splendor Plus మైలేజ్ ఎంత?
అత్యధిక మైలేజ్ ఇచ్చే బైక్‌లలో హీరో స్ప్లెండర్ ప్లస్ ఒకటి. ఈ మోటార్‌సైకిల్‌లో ఎయిర్ కూల్డ్, 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, OHC ఇంజిన్ అమర్చారు. స్ప్లెండర్ ప్లస్‌లోని ఇంజిన్ 8,000 rpm వద్ద 5.9 kW పవర్, 6,000 rpm వద్ద 8.05 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ మోటార్‌సైకిల్ ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్‌తో వస్తుంది.
Hero Splendor Plus ఒక లీటర్ పెట్రోల్‌తో సుమారు 70-73 కిలోమీటర్ల దూరం వెళ్లవచ్చు. ఈ బైక్ ఫ్యూయల్ ట్యాంక్ 9.8 లీటర్ల సామర్థ్యం కలిగి ఉంది. దీనిని ఒకసారి ఫుల్ ట్యాంక్ నింపితే సుమారు 700 కిలోమీటర్ల వరకు సులభంగా జర్నీ చేయవచ్చు. తక్కువ ధరలో మంచి మైలేజ్ అందించడం వల్ల ఈ బైక్‌ను బాగా ఇష్టపడి కొంటారు.
TVS Star City Plus మైలేజ్ ఎంత?
TVS బైక్‌లు మంచి మైలేజ్ కారణంగా కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ (TVS Star City Plus) బైక్ BS-6 ఇంజిన్‌తో వస్తుంది. ఇందులో 109 CC ఇంజిన్, 4-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఉన్నాయి. మైలేజ్ విషయానికి వస్తే, ఈ బైక్ లీటర్ పెట్రోలుకు 70 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగలదు.
బైక్ ఇంజిన్ 7,350 rpm వద్ద 8.08 bhp గరిష్ట పవర్, 4,500 rpm వద్ద 8.7 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. దీని ఇంజిన్ 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇందులో 17 అంగుళాల వీల్ ఉంది. ఇది ట్యూబ్‌లెస్ టైర్లతో వస్తుంది. ఈ విధంగా మీరు రెండు బైకుల ధర, ఫీచర్లు, మైలేజ్ గురించి తెలుసుకుని మీకు కావాల్సిన బైక్‌ను ఎంచుకోవచ్చు.
కొన్ని కంపెనీలు కొత్త ఏడాదిలో బైక్స్, కార్ల ధరలను పెంచుతున్నాయి. కనుక మీరు ధర గురించి తెలుసుకుని కొనడానికి ప్లాన్ చేసుకోవడం మంచిది.