భారత్‌లో టూ-వీలర్ కేవలం ప్రతి ఇంటికి అవసరమైన వస్తువుగా మారుతోంది. కొత్త బైక్ లేదా స్కూటర్ కొనేటప్పుడు కేవలం ధర, మైలేజీ, ఫీచర్లతో పాటు రీసేల్ వాల్యూ కూడా చూస్తున్నారు. కొన్ని ఏళ్ల తర్వాత టూవీలర్ అమ్మితే ఎంత ధర వస్తుందో అని కూడా ఆలోచిస్తారు. ముఖ్యంగా 1 లక్ష రూపాయల కంటే తక్కువ బడ్జెట్‌లో ఉన్న విషయంలో రీసేల్ కీలకం అవుతుంది. హీరో (Hero), హోండా (Honda), బజాజ్ వంటి బ్రాండ్లు ఈ విషయంలో కస్టమర్లు నమ్మదగ్గ వాహనాలుగా ఉన్నాయి.  ఎందుకంటే ఈ కంపెనీల వాహనాలు ఎక్కువ కాలం మన్నిక రావడంతో పాటు సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో వీటి డిమాండ్ ఎప్పుడూ తగ్గదు.

Continues below advertisement

హీరో స్ప్లెండర్, హోండా యాక్టివా (Honda Activa)హీరో స్ప్లెండర్ (Hero Splendor) భారత్‌లో అత్యంత నమ్మదగిన బైక్‌గా భావిస్తారు. దీని ఇంజన్ సింపుల్‌గా ఉండటంతో మన్నికలోనూ కస్టమర్ల నమ్మకం చూరగొంది. దీనివల్ల ఈ బైక్ ఎక్కువ ఖర్చు లేకుండా ఏళ్ల తరబడి నడుస్తుంది. అందుకే 2-3 ఏళ్ల తర్వాత కూడా రీసేల్ చేస్తే మంచి ధర లభిస్తుంది. మరోవైపు, స్కూటర్ విభాగంలో హోండా యాక్టివా అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటీ. దీని స్మూత్ ఇంజన్, సులభమైన వాడకం దీనిని అన్ని ఆడ, మగ అని వ్యత్యాసం లేకుండా అన్ని వయసుల వారికి ఫేవరెట్‌గా మార్చాయి. నగరాల్లో దీనికి డిమాండ్ ఎంత ఎక్కువగా ఉందంటే, సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో కూడా త్వరగా అమ్ముడై క్యాష్ వచ్చేలా చేస్తుంది. 

హోండా షైన్, బజాజ్ పల్సర్ 150 (Bajaj Pulsar 150)మీరు కొంచెం ఎక్కువ పవర్, ఫీచర్లు కోరుకుంటే, హోండా షైన్ (Honda Shine), బజాజ్ పల్సర్ 150 మంచి ఛాయిస్.  హోండా షైన్ 125cc విభాగంలో స్మూత్ పర్ఫార్మెన్స్‌తో రాణిస్తోంది. ఈ బైక్ ఎక్కువ కాలం మన్నుతుంది. రీసేల్ లో కూడా మంచి ధరను ఇస్తుంది. ఇక బజాజ్ పల్సర్ 150 యూత్ మెచ్చే బైక్. దీని స్టైలిష్ లుక్, పవర్‌ఫుల్ ఇంజన్ దీనిని సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో కూడా త్వరగా కొనేలా చేస్తాయి. 

Continues below advertisement

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 (Royal Enfield Classic 350)రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కేవలం బైక్ మాత్రమే కాదు. టాప్ క్లాస్ బైక్స్ కావాలనుకునేవారికి అదొక ఎమోషన్ లాంటిది. కొందరికి ఈ బైక్ తమ రిచ్ నెస్, హోదాకు సింబల్‌గా చూస్తారు. దీని రెట్రో డిజైన్, సౌండ్ దీనిని ఇతర బైకులతో ప్రత్యేకంగా చేస్తాయి. ధర ఎక్కువ ఉన్నప్పటికీ, వాడిన తర్వాత కూడా దీని విలువ అంత వేగంగా తగ్గదు. చాలాసార్లు పాత క్లాసిక్ 350కి డిమాండ్ ఎంత ఎక్కువగా ఉంటుందంటే రీసేల్ లోనూ మంచి ధరకు త్వరగా అమ్ముడవుతుంది.

ఏ టూవీలర్ కొనడం బెస్ట్ ?తక్కువ ధరకు లభించడంతో పాటు రీసేల్ చేయగా ఎక్కువ నష్టం కలగని టూవీలర్ మీరు కోరుకుంటే హీరో స్ప్లెండర్,  హోండా యాక్టివా బెస్ట్ ఛాయిస్. అదే సమయంలో పర్ఫార్మెన్స్‌తో పాటు వాల్యూ కోరుకునే వారికి హోండా షైన్, పల్సర్ 150 సరైన ఎంపికగా నిలుస్తాయి. ఒకవేళ మీకు ప్రీమియం, డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ కావాలంటే, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 సరిగ్గా సరిపోతుంది. మీ సౌలభ్యాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం మంచిది.