Hero Splendor and Honda Shine Mileage | ఈ రోజుల్లో ప్రజలకు బైక్ రోజువారీ అవసరంగా మారింది. రోజువారీ జర్నీ కోసం ప్రజలు ఎక్కువగా మోటార్‌సైకిల్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే మైలేజీ, బైక్ ఖర్చు, మెయింటనెన్స్ గురించి ఎక్కువగా ఆందోళన చెందుతుంటారు. ప్రతిరోజూ బైక్ నడపడానికి మంచి మైలేజీనిచ్చే బైక్‌ను కొనడం ద్వారా మీకు పెట్రోల్ ఖర్చులు కొంచెం తగ్గుతాయి. దీనితో పాటు, ప్రజలు చవకైన బైక్‌లను కొనడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో చవకైన, మంచి మైలేజీనిచ్చే బైక్‌లలో హీరో స్ప్లెండర్ ప్లస్, హోండా షైన్ ఉన్నాయి. వాటి గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

Continues below advertisement

హీరో స్ప్లెండర్ ప్లస్ (Hero Splendor Plus)

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోటార్‌సైకిల్ హీరో స్ప్లెండర్ ప్లస్. ఈ బైక్ భారత మార్కెట్‌లో 4 వేరియంట్‌లలో ఉంది. స్ప్లెండర్ ప్లస్ ఎయిర్ కూల్డ్, 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్ OHC ఇంజిన్‌ను కలిగి ఉంది. బైక్‌లో అమర్చిన ఈ ఇంజిన్ 8,000 rpm వద్ద 5.9 kW శక్తిని, అదే విధంగా 6,000 rpm వద్ద 8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 73,902 నుండి ప్రారంభం కాగా గరిష్టంగా రూ. 76,437 వరకు ఉంటుంది.

హోండా షైన్ (Honda Shine)

హోండా షైన్ కూడా మంచి మైలేజీకి ఇచ్చే బైకులలో ఒకటి. హోండా ఈ మోటార్‌సైకిల్ 4 స్ట్రోక్, SI, BS VI ఇంజిన్‌తో వస్తుంది. ఈ బైక్ 7,500 rpm వద్ద 7.93 kW శక్తిని, 6,000 rpm వద్ద 11 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హోండా షైన్ బైక్ ఆరు రంగుల ఎంపికలతో మార్కెట్‌లో ఉంది. హోండా షైన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 79,352 నుంచి ప్రారంభం కాగా గరిష్టంగా రూ. 83,711 మధ్య ఉంటుంది.

Continues below advertisement

స్ప్లెండర్ లేదా షైన్.. ఏది ఎక్కవ మైలేజ్ వస్తుంది?

హీరో స్ప్లెండర్ ప్లస్ 61 kmpl మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ బైక్‌లో 9.8 లీటర్ల వరకు పెట్రోల్ నింపవచ్చు. దీనితో ఈ బైక్ ట్యాంక్ నింపినప్పుడు గరిష్టంగా దాదాపు 598 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. హోండా షైన్ ఒక లీటర్ పెట్రోల్‌తో 55 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని పేర్కొంది. ఈ బైక్ 10.5 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యంతో వస్తుంది. దీనితో ఈ బైక్ ట్యాంక్ నింపినప్పుడు 578 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఈ విధంగా చూస్తే, ఈ రెండు బైక్‌లు ట్యాంక్ నింపినప్పుడు 550 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించగలవు. కానీ మైలేజీ విషయానికి వస్తే Splender plus కొంచెం ఎక్కువ మైలేజీ అందిస్తుంది.