Hero Splendor Price, Mileage And Features In Telugu: కమ్యూటర్ విభాగంలో, డైలీ అప్‌ అండ్‌ డౌన్‌ కొట్టడానికి అత్యంత తక్కువ ధర బైక్‌లలో హీరో స్ల్పెండర్‌ ఒకటి. నమ్మకమైన పనితీరు, అందుబాటు ధర & గొప్ప మైలేజీతో ఈ బైక్‌ జనంలో బాగా ప్రసిద్ధి చెందింది. మీరు స్ల్పెండర్‌ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుంది. హీరో స్ల్పెండర్‌లో అత్యంత తక్కువ ధర మోడల్ ఏది, తెలుగు రాష్ట్రాల్లో దాని ఆన్-రోడ్ ధర & మైలేజ్ ఎంతో తెలుసుకుందాం.       

హీరో స్ల్పెండర్‌ 3 వేరియంట్లలో అందుబాటులో ఉన్నప్పటికీ, రేటు విషయంలో అత్యంత పొదుపుగా ఉండే మోడల్ Splendor Plus డ్రమ్ బ్రేక్ వేరియంట్ (Drum Brake - OBD 2B). తెలుగు రాష్ట్రాల్లో ఈ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర (Hero Splendor ex-showroom price) రూ. 79,476. RTO కోసం దాదాపు రూ. 11,000 వేలు, ఇన్సూరెన్స్‌ కోసం దాదాపు రూ. 6,000, ఇతర అవసరమైన ఖర్చులు చెల్లించిన తర్వాత, విజయవాడలో దీని ఆన్-రోడ్ ధర (Hero Splendor on-road, Vijayawada) దాదాపు రూ. 97,000. హైదరాబాద్‌లో ఆన్-రోడ్ ధర (Hero Splendor on-road price, Hyderabad) దాదాపు రూ. 98,500.          

హీరో స్ల్పెండర్‌ బైక్ పవర్Hero Splendor Plus అత్యంత ఇంధన సామర్థ్యం కలిగిన బైక్‌లలో ఒకటి. ఈ మోటార్‌ సైకిల్ ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, సింగిల్-సిలిండర్, OHC ఇంజిన్‌తో వేగంగా పరుగులు తీస్తుంది. స్ల్పెండర్‌ ప్లస్‌లోని ఇంజిన్ 8,000 rpm వద్ద 5.9 kW శక్తిని & 6,000 rpm వద్ద 8.05 Nm టార్క్‌ను ఇస్తుంది. ఈ మోటార్‌ సైకిల్ ప్రోగ్రామ్డ్‌ ఫ్యూయల్‌ ఇంజెక్షన్ సిస్టమ్‌తో పని చేస్తుంది.            

హీరో స్ల్పెండర్‌ ప్లస్ ఒక లీటరు పెట్రోల్‌తో దాదాపు 70-73 కి.మీ. దూరం ప్రయాణించగలదు. ఈ టూవీలర్‌కు 9.8 లీటర్ల సామర్థ్యం కలిగిన ఇంధన ట్యాంక్ బిగించారు. ఈ ట్యాంక్‌ను పూర్తిగా నింపితే, ఈ బండిని దీనిని దాదాపు 700 కి.మీ. సులభంగా నడపవచ్చు. అంటే, మెరుగైన మైలేజ్‌తో మీ పెట్రోల్‌ ఖర్చును ఆదా చేస్తుంది. తక్కువ ధర & మంచి మైలేజ్ కారణంగా ఈ బైక్‌ ఎక్కువగా అమ్ముడవుతోంది.       

హీరో స్ల్పెండర్‌ ప్లస్ ఫీచర్లుబ్లూటూత్‌ కనెక్టివిటీతో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, రియల్-టైమ్ మైలేజ్ ఇండికేటర్, LED హెడ్‌ల్యాంప్స్‌, SMS & కాల్ అలర్ట్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. సైడ్-స్టాండ్ కట్-ఆఫ్ ఫీచర్, హజార్డ్ లైట్లు, బ్లింకర్లు & తాజా OBD2B కంప్లైంట్ నిబంధనలు వంటి భద్రతా లక్షణాలు కూడా హీరో స్ల్పెండర్‌ ప్లస్‌లో అందించారు.