Hero Pleasure Plus Price And Features: Hero MotoCorp బ్రాండ్‌ నుంచి చాలా కాలంగా మార్కెట్లో ఉన్న స్కూటర్ Pleasure Plus. తేలికైన బాడీ, మంచి మైలేజ్, సామాన్యులు కూడా భరించగలిగే ధరతో యువత, మహిళల మధ్య ఈ స్కూటర్ మంచి పేరు సంపాదించింది. ప్రస్తుతం ఈ స్కూటర్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది, అవి - LX, VX, XTEC ZX. ఒక్కో వేరియంట్‌లో ఏమేం ఫీచర్లు ఉన్నాయి? ధర ఎంత? మీకు ఏది సరైన ఎంపిక అవుతుందో తెలుసుకుందాం.

Continues below advertisement

ఇంజిన్ విషయానికి వస్తే...

మూడు వేరియంట్లలో కూడా ఒకే 109.5cc సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఇచ్చారు. అంటే పవర్, పనితీరు పరంగా పెద్ద తేడా ఉండదు. ఫీచర్లు, సస్పెన్షన్, డిజైన్ అంశాల్లోనే తేడా ఉంటుంది.

LX - బేస్ వేరియంట్

LX అనేది Pleasure Plus లో బేస్ వేరియంట్. ఇందులో స్టీల్ వీల్స్ ఇస్తారు. టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ ఉండదు. అలాగే Hero i3S ఐడిల్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్ కూడా ఉండదు. బ్లూటూత్ కనెక్టివిటీ సదుపాయం కూడా ఇవ్వరు.

Continues below advertisement

ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ పూర్తిగా అనలాగ్ రూపంలో ఉంటుంది. హెడ్‌ల్యాంప్స్‌ హాలోజన్ టైప్. క్రోమ్ ఫినిష్ ఉండే ఫ్రంట్ ఫాస్షియా కనిపిస్తుంది. కానీ పిలియన్ బ్యాక్‌రెస్ట్ ఉండదు. ఇన్నర్ ప్యానెల్ బ్లాక్ ఫినిష్‌లో ఉంటుంది.

ఎక్స్‌-షోరూమ్‌ ధర (ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ): ₹65,473. అన్ని ఖర్చులు, పన్నులు కలుపుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌-రోడ్‌ ధర దాదాపు ₹81,957 వరకు ఉంటుంది.

VX - మధ్య వేరియంట్

VX వేరియంట్ LX కంటే ఒక మెట్టు పై స్థాయిలో ఉంటుంది. ఇందులో టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ ఇస్తారు. అలాగే కాస్ట్ అలాయ్ వీల్స్ కూడా ఉంటాయి. Hero i3S సిస్టమ్ కూడా ఇందులో అందిస్తారు.

ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ డిజి-అనలాగ్ రూపంలో ఉంటుంది. కానీ బ్లూటూత్ కనెక్టివిటీ ఇవ్వరు. హెడ్‌ల్యాంప్స్‌ మాత్రం హాలోజన్ టైప్‌గానే ఉంటాయి. LX మాదిరిగానే పిలియన్ (వెనుక కూర్చునేవారికి) బ్యాక్‌రెస్ట్ ఉండదు.

ఎక్స్‌-షోరూమ్‌ ధర (ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ): ₹67,160, LX కంటే ₹1,613 ఎక్కువ. అన్ని ఖర్చులు కలుపుకుని, తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌-రోడ్‌ ధర దాదాపు ₹84,295 వరకు ఉంటుంది.

XTEC ZX - టాప్ వేరియంట్

XTEC ZX ఈ లైనప్‌లో టాప్ వేరియంట్. ఇందులో టెలిస్కోపిక్ సస్పెన్షన్, కాస్ట్ అలాయ్ వీల్స్, i3S సిస్టమ్ ఉంటాయి. అదనంగా బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇస్తారు.

హెడ్‌ల్యాంప్స్‌ ప్రొజెక్టర్ LED టైప్. ఇన్నర్ ప్యానెల్ డ్యూయల్ టెక్స్చర్ ఫినిష్‌లో ఉంటుంది. ముఖ్యంగా ఈ వేరియంట్‌లో మాత్రమే పిలియన్ బ్యాక్‌రెస్ట్ అందిస్తారు.

ఎక్స్‌-షోరూమ్‌ ధర (ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ): ₹75,501. ఇది VX కంటే ₹4,333 ఎక్కువ. అన్ని ఖర్చులు కలుపుకుని, తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌-రోడ్‌ ధర దాదాపు ₹93,972 వరకు ఉంటుంది.

ఏ వేరియంట్ తీసుకోవాలి?

మీరు కేవలం తక్కువ బడ్జెట్‌లో స్కూటర్ కావాలనుకుంటే LX సరిపోతుంది. కొంచెం మంచి సస్పెన్షన్, అలాయ్ వీల్స్ కావాలంటే VX సరైన ఎంపిక. అయితే పూర్తి ఫీచర్లు, బ్లూటూత్, LED లైటింగ్ కావాలంటే XTEC ZX బెస్ట్ ఆప్షన్.

తెలుగు రాష్ట్రాల్లో నగర ప్రయాణాలకు ఈ స్కూటర్ మంచి ఆప్షన్‌. కొనుగోలు చేసే ముందు మీ అవసరం, బడ్జెట్, రోజువారీ వినియోగం చూసుకుని సరైన వేరియంట్ ఎంచుకుంటే మంచిది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.