Continues below advertisement

హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ (Hero HF Deluxe), హీరో ప్యాషన్ ప్లస్ (PassionPlus)భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌లు. ఈ రెండు బైక్‌లు రోజువారీ ఆఫీసు, కాలేజీ లేదా పనికి వెళ్లడానికి చవకైన, మన్నికైన బైక్స్. ఎక్కువ మైలేజీని అందించే బైక్‌లను కోరుకునే వారు ఈ బైకులను కొనుగోలు చేస్తారు. తక్కువ బడ్జెట్, సులభమైన మెయింటెనెన్స్, నమ్మదగిన ఇంజిన్ ఈ రెండు బైక్‌లకు ప్లస్ పాయింట్. ఈ రెండు బైక్‌ల రైవల్స్, ఫీచర్ల వివరాలు ఇక్కడ అందిస్తున్నాం. ఆ విషయాలు తెలుసుకున్నాక మీకు కావాల్సిన బైక్ కొనుక్కోండి. 

ధర విషయానికి వస్తే.. Hero HF Deluxe చాలా తక్కువ ధరకే అందుబాటులోఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 55,992 నుండి ప్రారంభమవుతుంది. HeroPassionPlus బైక్ ఎక్స్-షోరూమ్ప్రారంభధర రూ. 76,691 గా ఉంది. అంటేHF Deluxe కంటేPassion Plus సుమారు రూ. 20,000 ఎక్కువధరకు లభిస్తుంది.  

Continues below advertisement

ఇంజిన్, పనితీరు 

ఈ రెండుబైక్‌లలో 97.2cc ఎయిర్ కూల్డ్ఇంజిన్ఉంది. ఇంజిన్ 8.02 PS శక్తిని, 8.05 Nm టార్క్‌నుఅందిస్తుంది. రెండింటిలోనూ 4 స్పీడ్ గేర్‌బాక్స్ఉంది. BS6 2.0 నిబంధనలప్రకారంతయారయ్యాయి. సిటీ, గ్రామాల రోడ్లు రెండింటిలోనూ, ఈ బైక్‌లుసులభంగానడుస్తాయి. HF Deluxe కొంచెంసాధారణంగా ఉండగా, PassionPlusఇంజిన్ కొంచెం స్మూత్‌గా ఉంటుంది. 

బైక్ ఎంత మైలేజ్ ఇస్తుంది? 

మైలేజ్ విషయానికి వస్తే 2 బైక్‌లుదాదాపుగాఒకేలాఉంటాయి. కంపెనీప్రకారంరెండు 70 kmpl వరకుమైలేజ్ఇస్తాయి. HF Deluxe నగరంలోసుమారు 65 నుండి 70 kmplఇస్తుంది. Passion Plus లోi3S టెక్నాలజీ ట్రాఫిక్‌లోఇంధనాన్నిఆదాచేయడానికిసహాయపడుతుంది. Passion Plus ఇంధనట్యాంక్పెద్దది. దీనితోఒకసారిఫుల్ట్యాంక్‌తోఎక్కువదూరంప్రయాణించవచ్చు.

ఎటువంటి బైక్‌లతో పోటీ పడుతుంది? 

Hero HF Deluxe 100cc సెగ్మెంట్ఎంట్రీ-లెవెల్బైక్‌లకు నేరుగా పోటీనిస్తుంది. ఇందులో HondaShine 100, బజాజ్ ప్లాటినా 100 (BajajPlatina 100), టీవీఎస్ స్పోర్ట్ (TVS Sport), టీవీఎస్ రేడియన్ (TVS Radeon)వంటి బైక్‌లు ఉన్నాయి. ఈ బైక్‌లన్నీ మంచి మైలేజ్, తక్కువ ధర వల్ల విక్రయాల్లో దూసుకెళ్తున్నాయి. HF Deluxe తో నేరుగా పోటీ పడతాయి. Hero Passion Plus 100cc బైక్‌లకు నేరుగా పోటీనిస్తుంది. ఇందులో Honda Shine 100, TVS Radeon, బజాబ్ ప్లాటినా 100 (Bajaj Platina 100), హీరో స్ప్లెండర్ ప్లస్ (Hero Splendor Plus) వంటి బైక్‌లు ఉన్నాయి.

ఫీచర్లు, లుక్ వివరాలు

Hero HF Deluxe డిజైన్ సాధారణంగా ఉన్నా, అవసరమైన ఫీచర్‌లను కలిగి ఉంటుంది. అదే సమయంలో Hero Passion Plus కొంచెంప్రీమియంగా కనిపిస్తుంది. ఇందులో మంచి గ్రాఫిక్స్, అల్లాయ్వీల్స్, ఎక్కువ కంఫర్ట్ లభిస్తుంది. మీకు లుక్, కొంచెం ఎక్కువ సౌకర్యం కావాలంటే, Passion Plus మంచిది. మీ బడ్జెట్ తక్కువగా ఉండి ఎక్కువ మైలేజ్ ఇచ్చే చవకైన బైక్ కావాలనుకుంటే Hero HF Deluxe మీకు సరైనది. కొంచెం ఎక్కువ బడ్జెట్, కొంచెం ప్రీమియం లుక్ కోరుకుంటే Hero Passion Plus బెటర్. అయితే రోజువారీప్రయాణానికిరెండుబైక్‌లు బాగుంటాయి.