అన్వేషించండి

హీరో గ్లామర్‌ ఎక్స్‌ 125 vs హోండా ఎస్పీ 125; మైలేజీ, ధర, ఐదేళ్ల మెయింటెనెన్స్‌ ఖర్చుల వివరాలు ఇవే! ఏ బైక్ కొంటే లాభం?

Hero Glamour X 125 vs Honda SP 125: హీరో గ్లామర్‌ ఎక్స్‌ 125, హోండా ఎస్పీ 125 మధ్య ఉన్న వ్యత్యాసాలు, ఐదేళ్ల నిర్వహణ ఖర్చులు, రీసేల్‌ విలువపై సమగ్ర విశ్లేషణ ఇక్కడ చూడొచ్చు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Hero Glamour X 125 vs Honda SP 125 Comparison: భారతీయ టూవీలర్‌ మార్కెట్‌లో 125 సీసీ సెగ్మెంట్‌ అత్యంత కీలకమైనది. రోజు వారీ ప్రయాణాలు చేసే మధ్యతరగతి వినియోగదారులకు మైలేజీ, స్టైల్‌, నిర్వహణ ఖర్చు ప్రధాన ప్రాధాన్యతలు. ఈ విభాగంలో హీరో గ్లామర్‌ ఎక్స్‌ 125, హోండా ఎస్పీ 125 మధ్య పోరు తీవ్ర స్థాయిలో ఉంది. ఒకవైపు హీరో మోటోకార్ప్‌ తన గ్లామర్‌ బ్రాండ్‌ను అత్యాధునిక టెక్నాలజీతో అప్‌డేట్ చేయగా, మరోవైపు హోండా తన ఎస్పీ 125 ద్వారా నమ్మకమైన ఇంజిన్‌, ప్రీమియం ఫీలింగ్‌ను అందిస్తోంది. 

ఈ రెండు బైక్‌లలో ఏది నిజంగా లాభదాయకం, ఐదేళ్ల వాడకం తర్వాత మీ జేబులో ఎంత మిగులుతుంది. అనే వాస్తవాలను డేటా ఆధారంగా చూద్దాం. పెట్రోల్‌ ధరలు పెరిగిన వేళ, కేవలం కొనుగోలు ధర మాత్రమే కాకుండా, టోటల్ కాస్ట్ ఆఫ్‌ ఓనర్‌ షిప్‌ ఆధారంగా నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు ప్రతి వాహనదారుడికి తప్పనిసరి అయ్యింది. 

భారతీయ మార్కెట్‌లో హీరో, హోండా రెండు పవర్‌ఫుల్‌ బ్రాండ్‌లు. హీరో గ్లామర్‌ X125 తన ఎక్స్‌టెక్ వేరియంట్‌తో టెక్ సావీ రైడర్‌లను ఆకట్టుకుంటోంది. మరోవైపు హోండా ఎస్పీ 125 రిఫైన్డ్‌ ఇంజిన్ బ్రాండ్‌ వాల్యూతో దూసుకుపోతోంది. సోర్స్ ప్రకారం, ఈ రెండు బైక్‌లు 2026 మోడల్స్‌లో బీఎస్‌ 6 ఫేజ్ 2 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించారు. 

హీరో గ్లామర్‌ ఎక్స్‌ 125 ప్రధానంగా యూత్‌ను, ఫీచర్లను కోరుకునే వారిని టార్గెట్‌గా చేసుకుంది. హోండా ఎస్పీ 125 సైలెంట్‌ స్టార్ట్, స్మూత్‌ ఇంజిన‌ను కోరుకునే ఫ్యామిలీ, సిటీ కమ్యూటర్లను ఆకట్టుకుంటోంది.  

ఏబైక్ కొనడానికి ఎంత ఖర్చు పెట్టాలి?

ధర విషయంలో ఈ రెండు బైక్‌ల మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉంది. సోర్స్‌ ప్రకారం, హీరో గ్లామర్‌ ఎక్స్‌ 125 సాధారణంగా హోండా ఎస్పీ 125 కంటే తక్కువ ధరలో లభిస్తుంది. 

తెలుగు రాష్ట్రాల్లో హీరో గ్లామర్‌ ఎక్స్‌ 125 బేస్ వేరియంట్‌ 84, 331 రూపాయలు నుంచి ప్రారంభమవుతుంది. ఆన్‌ రోడ్ ర సుమారు 97వేల నుంచి 1,11,000 మధ్య ఉంటుంది. హోండా ఎస్పీ  125 బేస్‌ వేరియంట్‌ 88,750 నుంచి ప్రారంభమవుతుంది. ఆన్‌ రోడ్‌ ధర సుమారు 1, 02, 000 నుంచి 1, 08, 000 మధ్య ఉంది. హీరో గ్లామర్‌ ఎక్స్ టాప్ వేరియంట్‌ ఎక్స్ షోరూమ్ ధర 99,999 రూపాయలు ఉంటే హోండా ఎస్పీ 125 టాప్ వేరియంట్‌ 1,03,000 రూపాయలు ఉంది. మొత్తంగా చూస్తే హీరో మోడల్‌ హోండా కంటే నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు తక్కువ ధరకు లభిస్తోంది. 

ఇంజిన్ పని తీరు

టెక్నికల్‌గా ఈ రెండు బైక్‌లు 125cc ఇంజిన్‌‌లు కలిగి ఉన్నా, వాటి పని తీరులో చాలా తేడాలు ఉన్నాయి. హీరో గ్లామర్‌ ఎక్స్‌ 125 బైక్‌ 124.7 సీసీ ఇంజిన్‌ కలిగి ఉంది. 11.5 PS, 10.5Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఇది హైవే రైడింగ్‌కు, ఎక్కువ స్పీడ్‌ వెళ్లే వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. హోండా ఎస్పీ 125 వెహికల్‌ 123.94 సీసీ ఇంజిన్ కలిగి ఉంది. ఇది 10.87 PS పవర్‌, 10.9Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హోండా ఇంజిన్ రిఫైన్‌మెంట్‌, పికప్‌ విషయంలో ముందంజలో ఉంది. 

మైలేజీ విషయంలో దేని సత్తా ఎంత?

మైలేజీ విభాగంలో రెండు బైక్‌ల మధ్య తీవ్రమై పోటీ ఉంది. హీరో గ్లామర్‌ ఎక్స్‌ 125 లీటర్‌కు 65కిలో మీటర్లు నడుస్తుందని చెబుతుంది. వాస్తవ పరిస్థితుల్లో ఇది 53-65 వరకు ఉంటుందని వినియోగదారులు రివ్యూల్లో చెబుతున్నారు. హోండా ఎస్పీ 125 విషయంలో లీటర్‌కు 63-65 కిలోమీటర్లు వరకు ఉంటుందని కంపెనీ అధికారికంగా పేర్కొంది. కానీ వాస్తవంగా ఇది 62-65 కిలోమీటర్లుగా ఉంటుందని రిపోర్టులు చెబుతున్నాయి. 

ఫీచర్ల విషయంలో రెండు బైక్‌ల మధ్య ఉన్న తేడా?

ఫీచర్ల విషయంలో హీరో గ్లామర్‌ ఎక్స్‌ 125 కాస్త భిన్నంగా ఉంది. సెగ్మెంట్‌ ఫస్ట్‌ క్రూయజ్‌ కంట్రోల్‌‌, 3 రైడ్‌మోడ్స్‌, బ్లూటూత్‌ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, నావిగేషన్, యూఎస్‌బీ టైప్‌ సీ ఛార్జింగ్‌ పోర్ట్‌ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. హోండా ఎస్పీ 15లో డిజిటట్‌ మీటర్, రియల్‌ టైమ్‌ మైలేజీ సమాచారం, గేర్‌ పొజిషన్ ఇండికేటర్‌, సైలెంట్‌ స్టార్ట్‌ ఫీచర్లను కలిగి ఉంది. 

మెయింటనెన్స్‌, సర్వీస్ ఖర్చులో తేడా ఎంత?

హీరో గ్లామర్‌  వార్షిక మెయింటెనెన్స్‌ రెండు వేల నుంచి మూడు వేల వరకు ఉంటుంది. ఐదు ఫ్రీ సర్వీస్‌లు అందిస్తోంది. వారంటీ ఐదేళ్లు ఉంది, లేదా బైక్ 70వేల కిమీటర్లు వరకు ఉంది. రెండింటిలో ఏది త్వరగా అయితే వారి అప్పటి వరకే ఉంటుంది. హోండా విషయంలో వార్షిక మెయింటెనెన్స్‌ పదిహేను వందల నుంచి రెండు వేల ఐదు వందల వరకు ఉంది. మూడు ఫ్రీ సర్వీస్‌లు మాత్రం ఇస్తోంది. వారంటీ మూడేళ్లు ఇచ్చారు. లేదా 42 వేల కిలోమీటర్లు పూర్తి అయ్యే వరకు వారంటీ ఉంటుంది. 

రీ సేల్ వాల్యులో ఎవరి విలువ ఎంత?

ఐదేళ్ల తర్వాత బైక్ అమ్మాలని అనుకుంటే హోండా ఎస్పీ 125 అత్యుత్తమ విలువను ఇస్తుంది. ఇది మూడు నుంచి ఐదేళ్ల తర్వాత బైక్ ధర అరవై నుంచి డబ్భై శాతం తగ్గుతుంది. అంటే దీని విలువ యాభై నుంచి అరవై వేలు మధ్య ఉంటుంది. హీరో గ్లామర్‌ ఎక్స్‌ 125 బైక్ విలువ ఐదేళ్ల తర్వాత నలబై ఐదు నుంచి యాభై శాతంగా ఉంటుంది. అంటే ఇది కూడా నలభై ఐదు వేల నుంచి యాభై వేల మధ్య  అమ్ముకోవచ్చు. 

ఐదేళ్ల ఓనర్‌ షిప్‌ కాస్ట్ రిపోర్ట్

సంవత్సరానికి పదివేల కిలోమీటర్లు ప్రయాణం, పెట్రోల్ ధర వంద రూపాయలు ఉంటే ఐదేళ్ల ఓనర్‌షిప్‌ కాస్ట్ ఇలా ఉంటుంది. 

హీరో గ్లామర్‌ ఎక్స్ 125

హోండా ఎస్పీ 125 

ఆన్‌రోడ్‌ ధర- రూ. లక్ష  ఆన్‌రోడ్ -రూ. 1,05,000
ఐదేళ్ల ప్యూయల్ ఖర్చు రూ. 77వేలు  ఐదేళ్ల ఫ్యూయల్ ఖర్చు -రూ.80 వేలు 
మెయింటెనెన్స్‌- రూ. 12 వేలు  మెయింటెనెన్స్‌-రూ. 10వేలు 
ఇన్సూరెన్స్‌ -రూ. 14వేలు ఇన్సూరెన్స్‌-రూ. 14వేలు 
రీసేల్‌ విలువ-రూ. 50వేలు  రీసేల్‌ విలువ-రూ.60వేలు  
నికర ఖర్చు-  రూ. 1,53,000  నికర ఖర్చు -రూ.1, 50,000

ఎవరు ఏ బైక్ తీసుకుంటే మంచిది?

మీరు సిటీలో ఎక్కువగా ప్రయాణిస్తూ, తక్కువ మెయింటెనెన్స్‌, రీసేల్ విలువ కోరుకుంటే హోండా ఎస్పీ 125 ఉత్తమ ఎంపిక అవుతుంది. అదే మీకు స్టైల్, లేటెస్ట్ ఫీచర్స్ కావాలంటే హైవేపై ఎక్కువ పవర్ కావాలనుకుంటే హీరో గ్లామర్‌ ఎక్స్‌ 125 సరైన ఎంపిక. 

Frequently Asked Questions

హీరో గ్లామర్ X 125 మరియు హోండా SP 125 బైకుల ధరల మధ్య వ్యత్యాసం ఎంత?

హీరో గ్లామర్ X 125 సాధారణంగా హోండా SP 125 కంటే సుమారు ₹4,000 నుండి ₹5,000 వరకు తక్కువ ధరకు లభిస్తుంది.

రెండు బైకుల ఇంజిన్ పనితీరులో ప్రధాన తేడా ఏమిటి?

హీరో గ్లామర్ X 125 ఎక్కువ పవర్, టార్క్ ఉత్పత్తి చేసి హైవే రైడింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. హోండా SP 125 రిఫైన్‌మెంట్, పికప్ విషయంలో మెరుగ్గా ఉంటుంది.

మైలేజ్ విషయంలో ఏ బైక్ మెరుగైనది?

రెండు బైకులు లీటరుకు 63-65 కిలోమీటర్ల మైలేజీని అందిస్తాయని అంచనా. వాస్తవ పరిస్థితుల్లో ఇది 53-65 కిలోమీటర్ల మధ్య ఉండవచ్చు.

ఫీచర్ల విషయంలో హీరో గ్లామర్ X 125 ఎలా భిన్నంగా ఉంటుంది?

గ్లామర్ X 125 లో సెగ్మెంట్-ఫస్ట్ క్రూయిజ్ కంట్రోల్, 3 రైడ్ మోడ్స్, బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్, USB ఛార్జింగ్ పోర్ట్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

ఐదేళ్ల తర్వాత ఏ బైక్ రీసేల్ విలువ ఎక్కువగా ఉంటుంది?

ఐదేళ్ల తర్వాత హోండా SP 125 బైక్ సుమారు 50-60 వేల రూపాయల వరకు రీసేల్ విలువను అందిస్తుంది, గ్లామర్ X 125 కంటే ఇది కొంచెం ఎక్కువ.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hero Xoom 125 లో రెండు వేరియంట్లు - ఏ వేరియంట్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?
Hero Xoom 125 VX vs ZX - ₹8,000 తేడాతో ఏ ఫీచర్లు మారాయి?
ఫిబ్రవరి 2026 కార్ సేల్స్‌: జనం ఈ కంపెనీ కార్లను తెగ కొన్నారు, డిమాండ్‌ కూడా పెరిగింది
ఫిబ్రవరి 2026 కార్ సేల్స్‌: గత నెలలో ఈ కార్లకే భారీ డిమాండ్, కొనడానికి జనం క్యూ
ఇరాన్‌-అమెరికా యుద్ధం: బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా ₹12,000 కోట్ల అదనపు భారం - మన పెట్రోల్‌ బడ్జెట్‌పై ప్రభావం ఎంత?
ఇరాన్‌-అమెరికా యుద్ధం: ఇండియాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ఆటో ఇండస్ట్రీకి హెచ్చరిక సంకేతాలు
ఈ నెలలో Honda City, Elevate, Amaze కొనేవాళ్లకు భారీ బెనిఫిట్స్‌ - ₹1.97 లక్షల వరకు డిస్కౌంట్
ఈ నెలలో Honda కారు కొనేవాళ్లకు భారీ ఆఫర్లు - హైదరాబాద్, విజయవాడలో ఎంత లాభం?
Advertisement

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
ఇరాన్‌-అమెరికా యుద్ధం: బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా ₹12,000 కోట్ల అదనపు భారం - మన పెట్రోల్‌ బడ్జెట్‌పై ప్రభావం ఎంత?
ఇరాన్‌-అమెరికా యుద్ధం: ఇండియాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ఆటో ఇండస్ట్రీకి హెచ్చరిక సంకేతాలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
US Shooting: అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
Palamaner Latest News:తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
Embed widget