Hero Electric Motorcycle | భారత్‌లో పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, ఆటోమొబైల్ కంపెనీలు ఈవీ (EV) సెగ్‌మెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. దేశంలో ప్రస్తుతం ఈవీ బైక్‌లు, స్కూటర్లు వేగంగా అమ్ముడవుతున్నాయి. దేశంలోనే అతిపెద్ద బైక్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ సెగ్‌మెంట్‌లో ఎంట్రీ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తోంది.

Continues below advertisement

 హీరో మోటోకార్ప్ తీసుకుంటున్న నిర్ణయం ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric), బజాజ్ ఆటో, టీవీఎస్ వంటి దిగ్గజ కంపెనీలకు పెద్ద సవాలుగా మారనుంది. ఆటో నివేదికల ప్రకారం, హీరో కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను 2027 నాటికి భారత మార్కెట్‌లో ప్రారంభించనుంది. రోజువారీ వాడకంతో పాటు లాంగ్ జర్నీలకు కూడా చాలా సులభంగా, చౌకగా మార్చేలా యువతకు నచ్చేలా శక్తివంతమైన ఎలక్ట్రిక్ బైక్‌ను అందించడం కంపెనీ లక్ష్యం.

UBEX, VXZ ప్లాట్‌ఫారమ్‌లపై వర్క్హీరో మోటోకార్ప్ తన కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ల కోసం 2 అత్యంత అడ్వాన్స్‌డ్, విభిన్న ఆర్కిటెక్చర్ ప్లాట్‌ఫారమ్‌లను సిద్ధం చేస్తోంది. ఇందులో మొదటి ప్లాట్‌ఫారమ్‌ను UBEX కాగా, రెండవదానిని VXZ అని పిలుస్తారు. UBEX ప్లాట్‌ఫారమ్‌ను ప్రత్యేకంగా ప్రతిరోజూ ఆఫీసు లేదా కాలేజీకి వెళ్లే సిటీ రైడర్‌ల కోసం డిజైన్ చేస్తున్నారు.

Continues below advertisement

అందులోభాగంగా కమ్యూటర్, యుటిలిటీ సెగ్‌మెంట్‌కు చెందిన చౌకైన ఎలక్ట్రిక్ బైక్‌లు తయారుకానున్నాయి. మరోవైపు VXZ ప్లాట్‌ఫారమ్‌ను హై-పెర్ఫార్మెన్స్, ప్రీమియం, స్పోర్టీ లుక్స్ ఉన్న ఎలక్ట్రిక్ బైక్‌ కోసం ఉపయోగిస్తారు. 2 వేర్వేరు ప్లాట్‌ఫారమ్‌లపై పనిచేయడం వల్ల హీరో వద్ద అన్ని రకాల వినియోగదారుల కోసం, బడ్జెట్ కస్టమర్ల కోసం సొల్యూషన్ దొరకనుంది. 

Also Read: BMW F 450 GS బైక్‌ రియల్‌ వరల్డ్‌ టెస్ట్.. 100km వేగం కేవలం 5.72 సెకన్లలో!

బైక్ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్

ఈ బైక్‌లో ఫిక్స్‌డ్, స్వ్యాపబుల్ (మార్చగలిగే) 2 రకాల బ్యాటరీ ఆప్షన్లు ఉంటాయని భావిస్తున్నారు. రోజువారీ వాడకం కోసం వచ్చే బేస్ మోడల్‌లో 3.5 kWh నుండి 4 kWh వరకు బ్యాటరీ ప్యాక్ ఇవ్వొచ్చు. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 130 నుండి 150 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్‌ను ఇస్తుంది.

ప్రీమియం స్పోర్టీ మోడల్‌లో పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. దీనివల్ల కేవలం అర గంటలోనే బైక్ చాలా వరకు ఛార్జ్ అవుతుంది. ఎలక్ట్రిక్ మోటార్ పవర్‌ఫుల్ టార్క్ ఎక్కేటప్పుడు, ఓవర్‌టేక్ చేసే సమయంలో అద్భుతమైన పికప్‌ అందిస్తుంది.

ఎన్నో మోడ్రన్ ఫీచర్లు

హీరో తన ఈ మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను ఎన్నో హై-టెక్ ఫీచర్లతో తీసుకురానుంది. ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ లేదా టీఎఫ్‌టీ (TFT) డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్.. ఇది బ్లూటూత్, GPS కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. దీని సహాయంతో రైడర్లు తమ స్మార్ట్‌ఫోన్‌ను బైక్‌కి కనెక్ట్ చేసి టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్- మెసేజ్ అలర్ట్స్, రైడ్ స్టాట్స్ చూడవచ్చు. ఇందులో ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్‌డేట్స్, మల్టిపుల్ రైడింగ్ మోడ్స్, యాంటీ-థెఫ్ట్ అలారం, జియో-ఫెన్సింగ్, రీజనరేటివ్ బ్రేకింగ్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా చేర్చుతారు.

ఈ బైక్ ధర ఎంత

హీరో మోటోకార్ప్ నుంచి ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ 2027లో భారత రోడ్లపై పరుగులు తీయవచ్చు.  ధర విషయానికొస్తే,  దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.20 లక్షల నుండి రూ. 1.50 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు. లాంచ్ అయిన తర్వాత ఇది  ఓలా రోడ్‌స్టర్ సిరీస్, బజాజ్ కొత్త ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్‌లు, రివోల్ట్ RV400 వంటి బైక్‌లతో పోటీ పడుతుంది. దేశవ్యాప్తంగా విస్తరించిన హీరో భారీ డీలర్‌షిప్ నెట్‌వర్క్, నమ్మకమైన సర్వీస్ ఆధారంగా ఈ ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తే గేమ్-చేంజర్‌గా మారవచ్చునని కంపెనీ భావిస్తోంది.