GST Cut Car Sales Boost 2025: ప్రస్తుతం, ఆటోమొబైల్ ప్రపంచంలో జీఎస్‌టీ బూస్ట్ (GST 2.0) నిజంగా ఒక సంచలనం సృష్టించింది. గతంలో వివిధ ఒత్తిళ్ల కారణంగా ఒక్క మెట్టూ ఎక్కలేక చతికిలపడిన ఈ ఇండస్ట్రీకి ఇప్పుడు ఒక సూపర్ ఫాస్ట్ లిఫ్ట్ దొరికింది. GST సంస్కరణల నుంచి ప్రేరణ పొందింది. ముఖ్యంగా మారుతి, హ్యుందాయ్, టాటా మోటార్స్ వంటి ప్రముఖ ఆటో బ్రాండ్లు, చాలా ఏళ్ల తర్వాత విక్రయాల్లో రికార్డు స్థాయులను సాధించాయి. కానీ, ఈ ఉత్సాహం ఎంతకాలం నిలుస్తుందో చూడాలి.
విక్రయాల విప్లవం
2025 సెప్టెంబర్ 22న, దసరా నవరాత్రుల ప్రారంభం నుంచి, జీఎస్టీ 2.0 కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి. అదే రోజు (కొత్త GST అమల్లోకి వచ్చిన మొదటి రోజు):
టాటా మోటార్స్ 10,000 కార్ల డెలివరీలు సాధించింది.
మారుతి సుజుకి 30,000 యూనిట్ల విక్రయం సాధించింది - ఇది 35 ఏళ్లలో అత్యధిక రోజువారీ రికార్డు.
హ్యుందాయ్ 11,000 డీలర్ బిల్లింగ్స్ పొందింది, ఇది గత కొన్ని సంవత్సరాల్లో అత్యధికం.
కొత్త GST ప్రారంభం రోజే అన్ని కార్ల షోరూమ్‌లు కస్టమర్లతో నిండిపోయాయి, డీలర్ కాంటాక్ట్స్ వృద్ధి చెందాయి & వినియోగదారుల్లో ఉత్సాహం స్పష్టంగా కనిపించింది.
GST కట్‌తో పెద్ద బూస్ట్
ఈ కొత్త జీఎస్టీ రేట్ల వల్ల చిన్న కార్ల విభాగం (సబ్‑4 మీటర్, 1.2 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్) 15‑18% వరకు ధర తగ్గింపులు పొందింది. ఈ తగ్గింపులు పూర్తిగా వినియోగదారులకు పాస్ అయ్యాయి.
మారుతి సుజుకీలో కొన్ని మోడల్స్ ధరలు ఏకంగా 1.30 లక్షల రూపాయల వరకు తగ్గాయి. మారుతి సుజుకి డీలర్‌షిప్ విచారణల్లో భారీ పెరుగుదల మరియు బుకింగ్‌లలో భారీ 50 శాతం వృద్ధి కనిపించింది.
Hyundai Tucson, Creta, Venue వంటి మోడల్స్‌కు కూడా భారీ తగ్గింపులు అందుబాటులోకి వచ్చాయి.
కొత్త GST, కార్ల అమ్మకాలను పెంచడానికి మరియు డిమాండ్‌ను పెంచడానికి సాయపడుతుంది, ఇది ఈ GST కోతల వెనుక ప్రధాన ఆలోచన. అయితే, ఈ డిమాండ్ కొనసాగుతుందా అనేదే ప్రశ్న.
దీర్ఘకాలంలో ప్రభావం
కొత్త GST చర్యలు ఒక తాత్కాలిక బూమ్‌ను కలిగించాయి, కానీ కొన్ని రిస్క్‌లు ఇంకా మిగిలే ఉన్నాయ్:
ఎమిషన్ నిబంధనలు & ఇంధన పరిమాణాలు: కొత్త E20 ఇంధన విధానం, ఉత్పత్తి వ్యయాల వల్ల మళ్లీ ధరలు పెరగవచ్చు.
EV vs ICE: తగ్గిన ధరల వల్ల కొందరు కస్టమర్లు విద్యుత్ వాహనాల స్థానంలో ICE (పెట్రోల్/డీజిల్) వాహనాలను ఎంచుకోవచ్చు. అంటే, EVలకు ప్రోత్సాహం రివర్స్ గేర్ వేస్తుంది.
కొనుగోలు శక్తి & ఆర్థిక పరిస్థితి: సగటు భారతీయుడి ఆర్థిక పరిస్థితి, రుణాల అందుబాటు, చూసి ఖర్చు పెట్టుకునే అలవాటు వంటివి ఈ బూమ్‌ను ప్రభావితం చేస్తాయి.
ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే...
GST తగ్గింపు ఒక తాత్కాలిక ఉత్సాహమే కాదు, ఇది ఆటో పరిశ్రమకు శ్వాసగా మారింది. దీనిని నిలబెట్టుకోవడానికి కంపెనీలు కొత్త ఉత్పత్తులు, ఆధునిక టెక్నాలజీ ఫీచర్లు, అధిక ఆఫ్టర్-సేల్స్ సేవలతో కస్టమర్లలో విశ్వాసాన్ని పెంచాలి.