Hero Splendor Plus Price, Down Payment, Loan and EMI Details: హీరో స్ల్పెండర్ ప్లస్(Hero Splendor Plus ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కరలేదు, అది సగటు భారతీయుడి కుటుంబ బాధ్యతలను పంచుకునే బండి. హీరో స్ల్పెండర్ ప్లస్‌కు మార్కెట్లో ఇప్పటికీ చాలా డిమాండ్ ఉంది. అత్యధికంగా అమ్ముడవుతోంది. హీరో స్ల్పెండర్ ప్లస్ కొనాలన్న ప్లాన్ మీకు కూడా ఉంటే, మీరు ఎలాంటి అనుమానం పెట్టుకోకుండా దీనిని కొనవచ్చు. అయితే, మీ దగ్గర ఎక్కువ డబ్బు లేదని వెనుకాడుతుంటే, ఇకపై అలాంటి ఇబ్బంది కూడా ఉంది. మీ దగ్గర కేవలం 10,000 రూపాయలే ఉన్నప్పటికీ, ఆ పరిమిత బడ్జెట్‌తోనే ఈ బైక్‌ను కొనుగోలు చేయవచ్చు.
హీరో స్ల్పెండర్ ఆన్-రోడ్ ధరహీరో స్ల్పెండర్ ప్లస్ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర (ex-showroom price) 77,226 రూపాయలు. దీనిని మీరు హైదరాబాద్ లేదా విజయవాడ లేదా మరేదైనా తెలుగు నగరంలో కొనుగోలు చేస్తే... దాదాపు రూ. 11,000 RTO (రిజిస్ట్రేషన్), దాదాపు రూ. 6,800 బీమా కింద చెల్లించాలి. ఈ అదనపు ఖర్చులతో, హీరో స్ల్పెండర్ ఆన్-రోడ్ ధర (Hero Splendor Plus on-road price) దాదాపు రూ. 94,794 అవుతుంది.
ప్రతి నెలా ఎంత EMI చెల్లించాలి?మీరు, హీరో స్ల్పెండర్ ప్లస్ కొనడానికి మీ దగ్గర ఉన్న రూ. 10,000 డౌన్ పేమెంట్ చేస్తే ఆ బండి మీ సొంతం అవుతుంది, కీస్ మీ చేతికి వస్తాయి. డౌన్ పేమెంట్ పోను మిగిలిన రూ. 84,794 మొత్తాన్ని లోన్‌గా తీసుకోవాలి. రుణం ఇచ్చేందుకు, హీరో షోరూమ్‌లోనే బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు ఉంటారు. ఈ రుణంపై బ్యాంక్/ఫైనాన్స్ కంపెనీ 9 శాతం వార్షిక వడ్డీ రేటు వసూలు చేస్తుందని అనుకుందాం. ఇప్పుడు మీ చెల్లించాల్సిన మంత్లీ EMI లెక్క చూద్దాం.
48 నెలల్లో (4 సంవత్సరాలు) తిరిగి చెల్లించేలా లోన్ టెన్యూర్ పెట్టుకుంటే, మంత్లీ EMI రూ. 2,489 అవుతుంది
36 నెలల (3 సంవత్సరాలు) రుణ కాలపరిమితి పెట్టుకుంటే, నెలకు రూ. 3,180 EMI చెల్లించాలి
24 నెలల్లో (2 సంవత్సరాలు) బ్యాంక్ మొత్తం తిరిగి తీర్చేయాలనుకుంటే, నెలనెలా EMI రూ. 4,568 బ్యాంక్‌లో జమ చేయాలి
హీరో స్ల్పెండర్ ప్లస్ మైలేజ్ARAI (Automotive Research Association of India) సర్టిఫై చేసిన ప్రకారం, హీరో స్ల్పెండర్ ప్లస్ బైక్ లీటరుకు 73 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ టూవీలర్‌కు 9.8 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంది. ఈ లెక్కన, స్ల్పెండర్ ప్లస్ ఫ్యూయల్ ట్యాంక్‌ను ఫుల్ చేస్తే, మధ్యలో ఎక్కడా ఆగకుండా 715 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. మీరు ప్రతిరోజూ సగటున 40 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తారనుకున్నా, ఒకసారి ట్యాంక్ ఫుల్ చేసిన తర్వాత, మళ్లీ 17 రోజుల వరకు పెట్రోల్ బంక్ ముఖం చూడాల్సిన అవసరం ఉండదు.