Upcoming Mid-size SUVs India: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో నవంబర్ 2025లో రెండు మిడ్-సైజ్ SUVల విడుదల ఖరారైంది. ఒక SUV పాత ఇంజిన్ (ICE)తో వస్తుండగా, మరొకటి పూర్తిగా ఎలక్ట్రిక్ 7-సీటర్ SUV కావడం విశేషం. ఈ రెండు మోడల్స్ టాటా మోటార్స్, మహీంద్రాకు చెందినవి, ఇవి ఇప్పటికే SUV విభాగంలో తమదైన ముద్ర వేసుకున్నాయి.

Continues below advertisement

టాటా సియెర్రా 2025

90వ దశకం నాటి ఐకానిక్ SUV టాటా సియెర్రా ఇప్పుడు సరికొత్త అవతారంలో తిరిగి రాబోతోంది. ఈ SUV భారతీయ కార్ల చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. టాటా ఇప్పుడు అదే వారసత్వాన్ని ఆధునిక డిజైన్, సాంకేతికతతో మళ్లీ అందిస్తోంది.

కొత్త సియెర్రా కంపెనీ, నవీకరించిన డిజైన్ భాషతో తయారు చేసింది. ఇందులో కనెక్టెడ్ LED టెయిల్‌లైట్లు, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, పనోరమిక్ గ్లాస్ రూఫ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉంటాయి. ఇంటీరియర్ విషయానికి వస్తే, ట్రిపుల్-స్క్రీన్ లేఅవుట్, లెవెల్-2 ADAS, యాంబియంట్ లైటింగ్ వంటి సాంకేతికతలు ఇందులో ఉండవచ్చు. ఈ SUV 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది, అయితే దీని ఎలక్ట్రిక్ వెర్షన్ 2026లో విడుదల చేస్తుంది.

Continues below advertisement

టాటా సియెర్రా హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్, టాటా హారియర్ వంటి భారతీయ మార్కెట్‌లోని ప్రముఖ SUVలతో పోటీపడుతుంది. దీని క్లాసిక్ డిజైన్, ఆధునిక ఫీచర్ ప్యాకేజీని చూస్తే, పనితీరుతోపాటు ప్రత్యేక గుర్తింపును కోరుకునే కస్టమర్‌లకు ఇది ఆకర్షణీయమైన ఎంపికగా ఉంటుంది.

మహీంద్రా XEV 9S

మహీంద్రా XEV 9S అనేది కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ SUV, ఇది మహీంద్రా INGLO ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ SUV భారతదేశంలో పూర్తి-పరిమాణంలో, ఏడు-సీటర్ ఎలక్ట్రిక్ మోడల్‌గా మొదటిసారిగా ప్రవేశపెట్టనుంది. దీని డిజైన్,  ఫీచర్ ప్యాకేజీ దీనిని మార్కెట్‌లోని అత్యంత అధునాతన EVలలో ఒకటిగా చేస్తుంది.

మహీంద్రా ఈ SUVలో ట్రిపుల్-స్క్రీన్ డాష్‌బోర్డ్, పనోరమిక్ స్కైరూఫ్, 16-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లను అందించడానికి సిద్ధమైంది. అలాగే, ఇందులో లెవెల్-2 ADAS, 360-డిగ్రీ కెమెరా, మసాజింగ్ ఫ్రంట్ సీట్లు వంటి సౌకర్యాలు కూడా ఉంటాయి. మహీంద్రా XEV 9S నేరుగా టాటా హారియర్ EV, MG విండ్సర్ EV, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ వంటి SUVలతో పోటీపడుతుంది.