Ferrari First EV:Ferrari పేరు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన, వేగవంతమైన కార్లలో ఒకటిగా వినిపిస్తుంది. ఇప్పుడు కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల ప్రపంచంలోకి అడుగుపెడుతూ తన తొలి పూర్తిగా ఎలక్ట్రిక్ కారు Ferrari Luceని పరిచయం చేసింది. లాంచ్ అయిన వెంటనే ఈ కారు ఒక రికార్డు సృష్టించింది. అది మొత్తం ఆటో ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకుంది. Luce ప్రత్యేక వన్-ఆఫ్ మోడల్‌ను వేలంలో 4 కోట్ల డాలర్లు అంటే సుమారు 382 కోట్ల రూపాయలకు అమ్మారు. కొత్త కారు వేలంలో ఇప్పటివరకు ఇదే అత్యధిక ధర.

Continues below advertisement

Ferrari Luceలో వేలం వేసిన మోడల్ సాధారణ ప్రొడక్షన్ కారు కాదు. దీనికి ప్రత్యేకంగా ‘Chassis 0’ అనే పేరు పెట్టారు, ఫెరారీకి చెందిన టయలర్‌ మేడ్‌ డివిజన్ దీన్ని అత్యంత ప్రత్యేకంగా తయారు చేసింది. అమెరికాలోని కానిఫోర్నియాలో జరిగిన మోంటెరీ కార్‌ వీక్‌ సందర్భంగా RM Sotheby's ద్వారా ఈ వేలం నిర్వహించారు. ఈ కారును అమెరికన్ బిలియనీర్, దీర్ఘకాల ఫెరారీ కలెక్టర్ హార్బర్ట్‌ ఏ వర్థీమ్‌ కొనుగోలు చేశారు.

40 రెట్లు ఎక్కువ ధర

ఈ కారుకు వేలానికి ముందు దాదాపు 11 లక్షల డాలర్లు అంటే సుమారు 9 కోట్ల రూపాయల వరకు ధర ఉంటుందని అంచనా వేశారు. కానీ వేలం సమయంలో బిడ్డింగ్ వేగంగా పెరిగి చివరికి 4 కోట్ల డాలర్ల వద్ద ఆగింది. అంటే కారుకు వచ్చిన తుది ధర ప్రారంభ అంచనాతో పోలిస్తే దాదాపు 40 రెట్లు ఎక్కువ.

Continues below advertisement

Ferrari Luce వేలంలో కొత్త కారు కోసం ఉన్న గత రికార్డును కూడా బద్దలు కొట్టింది. అంతకుముందు Ferrari Daytona SP3 వన్-ఆఫ్ మోడల్ సుమారు 2.6 కోట్ల డాలర్లకు అమ్ముడైంది.

Luce దీనికంటే చాలా ఎక్కువ ధర సాధించి కొత్త రికార్డు నెలకొల్పింది. అయితే, ఇది ప్రపంచంలో ఇప్పటివరకు అత్యంత ఖరీదైన వేలం కారు కాదు. ఈ రికార్డు 1955 Mercedes-Benz 300 SLR Uhlenhaut Coupé పేరిట ఉంది, అది 2022లో సుమారు 13.5 కోట్ల యూరోలకు అమ్ముడైంది.

Ferrari తొలి పూర్తిగా ఎలక్ట్రిక్ కారు

Ferrari Luce కంపెనీ చరిత్రలో తొలి పూర్తిగా ఎలక్ట్రిక్ కారు. ఇది Ferrariకి ఒక పెద్ద మార్పుగా భావిస్తున్నారు, ఎందుకంటే కంపెనీ చాలా కాలంగా పెట్రోల్ ఇంజిన్, ముఖ్యంగా హై-పర్ఫార్మెన్స్ స్పోర్ట్స్ కార్లకే తన గుర్తింపును నిలబెట్టుకుంది. Luce ద్వారా Ferrari ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల పెరుగుతున్న మార్కెట్లో తన స్థానం సంపాదించేందుకు ప్రయత్నిస్తోంది.

Luce కేవలం ఎలక్ట్రిక్ కావడం వల్ల మాత్రమే ప్రత్యేకం కాదు, దాని పనితీరు కూడా చాలా శక్తివంతంగా ఉంది. ఇందులో నాలుగు ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి, ఇవి కలిసి సుమారు 1,050 CV అంటే 1,000కి పైగా హార్స్‌పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఇలా Ferrari ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో కూడా తన హై-పర్ఫార్మెన్స్ కార్ల గుర్తింపును నిలబెట్టుకునే ప్రయత్నం చేసింది.Ferrari Luceను తొలిసారి పరిచయం చేసిన తర్వాత దీనిపై మిశ్రమ స్పందన కనిపించింది. ఈ కారు డిజైన్‌లో మాజీ Apple డిజైనర్ Sir Jony Ive పాత్ర కూడా ఉంది. ఆయన LoveFrom ద్వారా Ferrariతో కలిసి Luce డిజైన్‌పై పని చేశారు. అందుకే దీని డిజైన్ Ferrari ప్రస్తుత కార్లతో పోలిస్తే చాలా భిన్నంగా, మరింత ఆధునికంగా కనిపిస్తోంది.

వేలం ద్వారా వచ్చిన డబ్బు ఏం చేస్తారు?

ఈ వేలంలో మరో ప్రత్యేకత ఏంటంటే, దీని ద్వారా వచ్చిన మొత్తం డబ్బు Ferrariకే లేదా కారు యజమానికి మాత్రమే వెళ్లదు. Ferrari ప్రకారం, వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని Ferrari Foundation ద్వారా విద్యకు సంబంధించిన ప్రాజెక్టుల్లో వినియోగిస్తారు. 382 కోట్ల ధర విన్నప్పుడు Ferrari Luce ప్రతి కారు అంత ఖరీదైనదని అనిపించవచ్చు, కానీ వేలంలో అమ్ముడైన మోడల్ వన్-ఆఫ్ Chassis 0, దాని అరుదైన స్వభావం, ప్రత్యేక కస్టమైజేషన్ కారణంగా అంత ఎక్కువ ధర వచ్చింది. సాధారణ Ferrari Luce ప్రారంభ ధర సుమారు 5.5 లక్షల యూరోలు అని తెలిపారు.

Ferrari Luce కంపెనీకి కేవలం కొత్త కారు మాత్రమే కాదు, ఎలక్ట్రిక్ యుగంలోకి ప్రవేశించడానికి ఒక పెద్ద అడుగు. ప్రారంభంలో దీని డిజైన్‌పై విమర్శలు ఎదురైనా, వేలంలో వచ్చిన రికార్డు ధర, కారుపై ఏర్పడిన చర్చ Ferrari ఎలక్ట్రిక్ భవిష్యత్తుపై ప్రజల ఆసక్తి చాలా ఎక్కువగా ఉందని చూపిస్తోంది. Luce డిమాండ్‌పై కంపెనీ కూడా సానుకూల స్పందన ఇచ్చింది.