Pune Man Gets Donkeys To Pull Thar car It To Showroom: మహీంద్రా థార్ ఎస్‌యూవీలో పదేపదే బ్రేక్‌డౌన్‌లు, సర్వీసింగ్ లోపాలతో కోపం తెచ్చుకున్న పుణె నివాసి గణేష్ సంగడే వినూత్న రీతిలో నిరసన తెలిపారు. థార్ కారుకు రెండు గాడిదలతో లాగుతూ.. వాకడ్‌లోని మహీంద్రా సహ్యాద్రి మోటార్స్ షోరూమ్‌కు తీసుకెళ్లాడు. అందర్నీ ఆకట్టుకునేలా.. డీజే కూడా పెట్టి ఒక చిన్న ర్యాలీ మాదిరిగా తీసుకెళ్లారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
నవంబర్ 13న జరిగిన ఈ వినూత్న నిరసన థార్ కారు సర్వీసింగ్ లోపాల కారణంగా చేయాల్సి వచ్చింది. గణేష్ సంగడే కొన్ని నెలల క్రితం కొనుగోలు చేసిన మహీంద్రా థార్ రాక్స్‌లో ఎదురైన సమస్యలను ఎంతకూ తగ్గడం లేదు. జున్నార్‌కు చెందిన సంగడే, థార్‌ను "రగ్డ్ అండ్ రిలయబుల్" వాహనంగా భావించి కొనుగోలు చేశాడు. కానీ, డెలివరీ తర్వాత తక్కువ ప్రయాణాల్లోనే సమస్యలు మొదలయ్యాయి. ప్ర వర్షాల సమయంలో ఇంటీరియర్‌లో నీరు లీక్ , రోజూ రిఫ్యూవల్ చేయాల్సినంత తక్కువ మైలేజ్, బాడీలో రస్ట్ ప్యాచెస్, రంగు వెలియడం, డ్రైవింగ్ సమయంలో అసౌకర్యకరమైన లౌడ్ ఎంజిన్ సౌండ్ వంటి సమస్యలు ఉన్నాయి.
సంగడే, వాకడ్‌లోని మహీంద్రా సహ్యాద్రి మోటార్స్‌కు అనేక సార్లు వాహనాన్ని తీసుకెళ్లి సర్వీసింగ్ చేయించాడు. కానీ, మైలేజ్ ఆధారంగా సూచించిన సర్వీసుల తర్వాత కూడా సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలేద. కంపెనీ రికమెండేషన్ల ప్రకారం సర్వీస్ చేసినా, ఏమీ మారలేదని మథనపడ్డాడు. ఎన్ని సార్లు చెప్పినా కంపెనీ సిబ్బంది పట్టించుకోకపోవడంతో నిరసన చేపట్టాలని నిర్ణయించుకున్నడాు.
నవంబర్ 13న, సంగడే తన థార్‌ను రెండు గాడిదలక సాయంతో లాక్కుంటూ షోరూమ్ వైపు బయలుదేరాడు. డోలు వాయించే టీమ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. రోడ్డు మీద గాడిదలు థార్‌ను నెమ్మదిగా లాగుతుంటే, డ్రమ్స్ సౌండ్‌తో కలిపి ఈ ర్యాలీ ఆకట్టుకున్నది. స్థానికులు, రోడ్డు ప్రయాణికులు ఆశ్చర్యంగా చూస్తూ వీడియోలు తీశారు. కంపెనీ ఇంకా .. సంగడే ఆవేదనను పట్టించుకుందో లేదోస్పష్టత లేదు.