భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎస్‌యూవీలు, సెడాన్ కార్ల క్రేజ్ బాగా పెరిగింది. ఇటీవల కార్లు కొనుగోలు చేసేవారు కేవలం మైలేజ్, ఫీచర్లు మాత్రమే కాదు, పవర్‌ఫుల్ ఇంజిన్ పెర్ఫార్మెన్స్, హైవేపై అద్భుతమైన డ్రైవింగ్ వివరాలు చెక్ చేస్తున్నారు.
మీ బడ్జెట్ కనుక రూ. 15 నుంచి 20 లక్షల మధ్య ఉండి, హైవేపై వేగంతో దూసుకెళ్లే కారు కోసం మీరు చూస్తున్నట్లయితే, మార్కెట్‌లో కొన్ని అత్యుత్తమ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కార్లలో లభించే బలమైన టర్బో-పెట్రోల్ ఇంజిన్, అద్భుతమైన టార్క్ జర్నీలో మీకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి.
వోక్స్‌వ్యాగన్ వర్టస్, స్కోడా స్లావియా మీకు సెడాన్ కార్లంటే ఇష్టమైతే, ఒకవేళ వేగం కూడా కావాలంటే.. వోక్స్‌వ్యాగన్ వర్టస్ (Volkswagen Virtus), స్కోడా స్లావియా (Skoda Slavia)లోని 1.5 లీటర్ TSI టర్బో-పెట్రోల్ ఇంజిన్ మీకు సరిపోతుంది. ఈ ఇంజిన్ 150 PS పవర్, 250 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ కార్ హైవేపై వెళ్తున్నప్పుడు, దీని యాక్టివ్ సిలిండర్ టెక్నాలజీ, DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కాంబో మీకు బెస్ట్ స్పీడ్ ఇస్తుంది. దీని హై-స్పీడ్ స్టెబిలిటీ, కార్నరింగ్ ఎంత అద్భుతం అంటే.. 100 నుంచి 120 కిమీ/గంట వేగంలో కూడా కారు రోడ్డుకు అతుక్కుని వెళ్తున్నట్లు అనిపించి డ్రైవర్‌కు ఏ ఇబ్బంది ఉండదు.
హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta), కియా సెల్టోస్ (Kia Seltos)లోని కొత్త 1.5 లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ పెర్ఫార్మెన్స్ పరంగా గేమ్ ఛేంజర్‌గా మారుతోంది. ఈ ఇంజిన్ 160 PS గరిష్ట పవర్, 253 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
ఈ ఇంజిన్‌తో వచ్చే 7 స్పీడ్ DCT గేర్‌బాక్స్ గేర్లను ఎలా పనిచేస్తుందంటే.. ఓవర్‌టేక్ చేసే సమయంలో మీకు ఎలాంటి ల్యాగ్ అనిపించదు. హైవేపై మీరు అలా క్లచ్ నొక్కగానే, ఈ ఎస్‌యూవీ రెప్పపాటులో దాదాపు 100+ km/h వేగాన్ని టచ్ చేస్తుంది. లాంగ్ జర్నీలకు వీటి రైడ్ క్వాలిటీ, పవర్ డెలివరీ ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి.
మహీంద్రా XUV700
మహీంద్రా XUV700 (Mahindra XUV700) ఎంట్రీ, మిడ్ లెవెల్ వేరియంట్లు రూ. 15 నుంచి రూ. 20 లక్షల ఎక్స్‌షోరూమ్ రేంజ్‌లో లభిస్తాయి. ఈ కారులో లభించే 2.0 లీటర్ mStallion టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఈ విభాగంలోనే అతి పెద్దది, అత్యంత పవర్‌ఫుల్ ఇంజిన్. ఈ ఇంజిన్ 200 PS భారీ పవర్, 380 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. భారీ ఎస్‌యూవీ అయినప్పటికీ, హైవేపై దీని వేగం ఎక్కువగానే ఉంటుంది. దీని సస్పెన్షన్ సెటప్, బరువైన బాడీ హై-స్పీడ్‌లో కారును పూర్తిగా కంట్రోల్ లో ఉంచుతాయి.
టాటా హారియర్ వేగంతో పాటు హైవేపై భారీ టార్క్, రఫ్ లుక్ ఇష్టపడే వారికి టాటా హారియర్ (Tata Harrier) బేస్, మిడ్ వేరియంట్లు బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ఇందులో 2.0 లీటర్ క్రియోటెక్ డీజిల్ ఇంజిన్ వస్తుంది. ఈ ఇంజిన్ 170 PS పవర్, 350 Nm టార్క్ జనరేట్ చేస్తుంది.
ల్యాండ్ రోవర్ ఒమేగా ఆర్క్ ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించిన ఈ కారు హైవేలో జర్నీకి సరిగ్గా సరిపోతుంది. దీని పెర్ఫార్మెన్స్ ఎంత బాగుంటుందంటే.. ఎలాంటి హైవేపై అయినా అలసట లేకుండా గంటల తరబడి 100+ వేగంతో డ్రైవ్ చేయవచ్చు. బరువైన స్టీరింగ్ వీల్ హై-స్పీడ్‌లో డ్రైవర్‌కు సపోర్ట్ ఇస్తుంది.
