అన్వేషించండి

Most Unsafe Cars: ప్రజాదరణ పొందిన ఈ కార్లు కుటుంబ భద్రతకు తీవ్ర ముప్పు! సేఫ్గీ రేటింగ్స్ చూస్తే షాక్

Family Crash Test: కార్ల భద్రతను అంచనా వేయడానికి Global NCAP క్రాష్ టెస్టులు నిర్వహిస్తుంది. వాటి ఆధారంగా కార్లకు 0 నుండి 5 స్టార్స్ మధ్య రేటింగ్ కేటాయిస్తారు.

Car Safety Rating In India | ప్రస్తుతం కారు కేవలం జర్నీకి మాత్రమే కాదు, సేఫ్టీని సైతం ప్రధాన అంశంగా చూస్తున్నారు. సేఫ్టీ ఫీచర్లతో కొన్ని కార్లకు ప్రజాధరణ పెరుగుతోంది. ఈ కారణంగానే ఇప్పుడు కారు కొనేటప్పుడు సేఫ్టీ రేటింగ్స్‌పై కూడా ఫోకస్ చేస్తుంటారు. కార్ల భద్రతను పరీక్షించడానికి 'గ్లోబల్ ఎన్‌క్యాప్' (Global NCAP) క్రాష్ టెస్టులు చేస్తుంది. దాని ఆధారంగా కార్లకు 0 నుండి 5 స్టార్ల వరకు రేటింగ్ ఇస్తారు. ఒక కారుకు 0 స్టార్స్ వచ్చాయంటే, ప్రమాద సమయంలో అది ప్రయాణికులకు సరైన భద్రతను అందించలేదని అర్థం చేసుకోవాలి. అలాంటి కొన్ని కార్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి.

సిట్రోయెన్ (Citroen e-C3)
సిట్రోయెన్ e-C3 ఒక ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్. అయితే భద్రత విషయంలో దీని ప్రదర్శన బాలేదు. గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో దీనికి అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (పెద్దల రక్షణ) కోసం 0 స్టార్స్, పిల్లల భద్రత కోసం కేవలం 1 స్టార్ వచ్చాయి. ఈ టెస్ట్‌లో కారు బాడీ స్ట్రక్చర్ బలహీనంగా ఉందని, పక్క నుండి ఢీకొన్నప్పుడు ప్రయాణికులకు భద్రత కష్టమేనని తేలింది.

మారుతి సుజుకీ  (Maruti Suzuki Eeco)
మారుతి సుజుకి ఈకో ఒక పాపులర్ ఫ్యామిలీ, కమర్షియల్ వ్యాన్. కానీ సేఫ్టీ టెస్ట్‌లో ఇది చాలా బలహీనం అని తేలింది. దీనికి కూడా గ్లోబల్ ఎన్‌క్యాప్‌లో 0 స్టార్ రేటింగ్ వచ్చింది. నివేదిక ప్రకారం, ఇందులో ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నప్పటికీ డ్రైవర్ ఛాతీ,  మోకాళ్లకు గాయాలయ్యే ప్రమాదం ఉంటుంది. దీని బాడీ షెల్ కూడా పటిష్టంగా లేదని, దీనివల్ల ప్రమాద సమయంలో అందులోని వారికి భద్రత తగ్గుతుందని తేలింది.

మారుతి సుజుకీ ఎస్ ప్రెస్సో (Maruti Suzuki S-Presso)
మారుతి సుజుకి ఎస్-ప్రెస్సోకు మొదట్లో 0 స్టార్‌ వచ్చింది. కానీ తర్వాత కొన్ని మార్పులు చేయడంతో 1 స్టార్ రేటింగ్ పొందింది. ఇప్పుడు ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా ఇస్తున్నప్పటికీ, దీని బాడీ స్ట్రక్చర్, ఫుట్‌వెల్ ఏరియా ఇంకా పూర్తిగా దృఢంగా లేదనుకుటున్నారు. అధిక వేగంతో ఢీకొన్నప్పుడు భద్రత విషయంలో ఇంకా లోపాలు కనిపిస్తున్నాయి.

రెనాల్ట్ క్విడ్ (Renault Kwid)
రెనాల్ట్ క్విడ్ తన డిజైన్, తక్కువ ధర కారణంగా ప్రజాదరణ పొందింది. కానీ భద్రత విషయంలో ఇది చాలా వెనుకబడి ఉంది. దీనికి గ్లోబల్ ఎన్‌క్యాప్‌లో 1 స్టార్ వచ్చింది. నివేదిక ప్రకారం, ఇందులో డ్రైవర్ తలకి రక్షణ ఉన్నప్పటికీ, ఛాతీ, కాళ్ల రక్షణ బలహీనంగా ఉన్నట్లు టెస్టుల్లో గుర్తించారు.

మహీంద్రా బొలెరో నియో (Mahindra Bolero Neo)
మహీంద్రా బొలెరో నియోను ఒక బలమైన SUV అనుకుంటారు. కానీ క్రాష్ టెస్ట్‌లో దీని ప్రదర్శన ఆశించిన దానికంటే తక్కువగా ఉంది. కేవలం 1 స్టార్ రేటింగ్ మాత్రమే పొందింది. సైడ్ ఇంపాక్ట్, పిల్లల భద్రత విషయంలో దీనికి తక్కువ రేటింగ్ ఇచ్చారు. బయట నుంచి చూడటానికి దృఢంగా కనిపించినప్పటికీ, భద్రతా ప్రమాణాలలో ఇది పూర్తిగా తేలిపోయింది. కనుక మీరు కూడా ఏదైనా కారు కొనాలని ప్లాన్ చేస్తున్నట్లు అయితే సేష్టీ రేటింగ్ వివరాలు సైతం చెక్ చేశాకే కొనుగోలు చేయాలి. 

ఆటో సెక్షన్‌లో మరిన్ని ఆసక్తికర వార్తల కోసం క్లిక్ చేయండి

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

E85తో పరుగులు పెట్టే హీరో బైక్‌లు బాగా చౌక! భారీ తగ్గింపుతో బంపర్ ఆఫర్!
కొత్తగా వచ్చిన హీరో 'ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌' బైక్‌లపై బిగ్‌ డిస్కౌంట్స్‌- ధరలు చూసి షాక్ అవుతారు!
మీ బైక్‌, కారులో E20 ఇంధనం పోస్తే బీమా కవరేజ్‌ రద్దువుతుందా? ఐసీఐసీఐ లాంబార్డ్ క్లారిటీ!
బైక్‌, కారులో E20 పెట్రోల్‌ వాడితే ఇన్సూరెన్స్‌ రాదా? ICICI లాంబార్డ్‌ ఏం చెప్పింది?
ఎలివేట్‌, సిటీ, అమేజ్‌పై బంపర్ ఆఫర్లు - హోండా కార్లను చౌకగా సొంతం చేసుకునే ఛాన్స్‌ ఇంకొన్ని రోజులే!
హోండా కార్లపై రూ.2 లక్షలకు పైగా డిస్కౌంట్స్‌ - ఇప్పుడే కొనకపోతే భారీ ఆఫర్ మిస్‌!
మారుతి Wagon R బయోఫ్లెక్స్ రేటు ప్రకటన - E85 ఫ్యూయల్‌తో నడిచే ఈ కారు ధర ఎంతంటే?
E85 ఫ్యూయల్‌తో నడిచే మారుతి Wagon R బయోఫ్లెక్స్ - కామన్‌ మ్యాన్‌ కూడా కొనొచ్చు!
Advertisement

వీడియోలు

Vaibhav about Fight With Sri Lanka Players | లంక ప్లేయర్‌తో గొడవపై వైభవ్ కామెంట్స్
Arshdeep Angry Gill For Gurbaz Wicket | రివ్యూతీసుకోకపోవడంతో గుర్బాజ్ సెంచరీ
Gurnoor Brar Debut vs Afghanistan | ఇంటర్నేషనల్ క్రికెట్‌లో గుర్నూర్ సంచలన డెబ్యూ
IND vs AFG 1st ODI Highlights | అఫ్గాన్‌పై టీమిండియా ఘన విజయం
Shubman Gill Slip Catch vs Afghanistan | రోహిత్ రనౌట్‌పై గిల్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HYDERABAD METRO - THE ISSUE and THE STATUS | హైదరాబాద్ మెట్రోకు ఏమైంది? రూ.13,600 కోట్ల అప్పు, ఫేజ్ - 2 ప్రారంభానికి అడ్డేంటి ??
HYDERABAD METRO | హైదరాబాద్ మెట్రోకు ఏమైంది? రూ.13,600 కోట్ల అప్పు, ఫేజ్ - 2 ప్రారంభానికి అడ్డేంటి ??
Telegram Ban: టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక నిషేధం.. నీట్ రీఎగ్జామ్ వేళ కేంద్రం కీలక నిర్ణయం
టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక నిషేధం.. నీట్ రీఎగ్జామ్ వేళ కేంద్రం కీలక నిర్ణయం
Hyderabad Metro Phase 2 Loan Controversy: రాజకీయ సుడిగుండంలో చిక్కుకున్న మెట్రో ఫేజ్ 2 - రేవంత్ , కిషన్, కేటీఆర్ మధ్య పరస్పర ఆరోపణలు - పరిష్కారం ఉందా?
రాజకీయ సుడిగుండంలో చిక్కుకున్న మెట్రో ఫేజ్ 2 - రేవంత్ , కిషన్, కేటీఆర్ మధ్య పరస్పర ఆరోపణలు - పరిష్కారం ఉందా?
US Iran Peace Deal: ఇరాన్‌కు 300 బిలియన్ డాలర్ల పరిహారం..! యుద్ధంతో డొనాల్డ్ ట్రంప్ ఏం సాధించారు?
ఇరాన్‌కు 300 బిలియన్ డాలర్ల పరిహారం..! యుద్ధంతో డొనాల్డ్ ట్రంప్ ఏం సాధించారు?
International Yoga Day: ఏపీలో పండుగలా యోగాడే నిర్వహణకు ఏర్పాట్లు - తెలంగాణలో లైట్ - ఎందుకలా?
ఏపీలో పండుగలా యోగాడే నిర్వహణకు ఏర్పాట్లు - తెలంగాణలో లైట్ - ఎందుకలా?
Vaibhav Suryavanshi: లంక ఆటగాళ్లతో వివాదం.. చిక్కుల్లో వైభవ్ సూర్యవంశీ! ఐసీసీ క్రమశిక్షణా చర్యలు తప్పవా ?
లంక ఆటగాళ్లతో వివాదం.. చిక్కుల్లో వైభవ్ సూర్యవంశీ! ఐసీసీ క్రమశిక్షణా చర్యలు తప్పవా ?
Thankyou Subbarao OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ - అమ్మాయిల హత్యల మిస్టరీ... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ - అమ్మాయిల హత్యల మిస్టరీ... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
మారుతి Wagon R బయోఫ్లెక్స్ రేటు ప్రకటన - E85 ఫ్యూయల్‌తో నడిచే ఈ కారు ధర ఎంతంటే?
E85 ఫ్యూయల్‌తో నడిచే మారుతి Wagon R బయోఫ్లెక్స్ - కామన్‌ మ్యాన్‌ కూడా కొనొచ్చు!
Embed widget