Buying Tata Punch On EMI: టాటా బ్రాండ్‌లో భారతీయుల మనస్సులు దోచుకున్న కార్‌ పంచ్‌. దీని లుక్‌ చాలా స్టైలిష్‌గా, దాదాపు రూ.25 లక్షల విలువైన ప్రీమియం కార్‌ తరహాలో ఉంటుంది. అయితే, ఈ కారు వాస్తవ ధర రూ. 7 లక్షల పరిధిలోనే ఉంది. అందువల్లే ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కార్‌ కూడా. టాటా పంచ్ భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి. మీకు రూ. 40 వేల నుంచి 45 వేల జీతం ఉంటే, మీరు కూడా టాటా పంచ్‌ను సులభంగా కొనుగోలు చేయవచ్చు. 

స్టైలిష్‌ టాటా పంచ్‌ను కొనడానికి, కార్‌ ధర మొత్తాన్ని ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదు. లోన్‌ తీసుకుని ఈ కారును మీ ఇంటికి తీసుకెళ్లవచ్చు & మీ గరాజ్‌లో పార్క్ చేయవచ్చు. ఆ తర్వాత, మీరు ప్రతి నెలా సులభమైన వాయిదాల (EMI) రూపంలో బ్యాంక్‌ రుణం చెల్లిస్తే సరిపోతుంది. ఆర్థిక భారం తక్కువగా ఉండే సౌలభ్యం వల్ల, డబ్బులు ఉన్న వ్యక్తులు కూడా కార్‌ లోన్‌ తీసుకుని EMIలు కడుతున్నారు.

టాటా పంచ్ కొనడానికి నెలవారీ EMI ఎంత ఉంటుంది? దిల్లీలో టాటా పంచ్ ప్యూర్‌ పెట్రోల్ వేరియంట్ ఆన్ రోడ్ ధర (Tata Punch Pure Petrol Variant On Road Price, Delhi) రూ. 6.62 లక్షలు. మీరు రూ. 50,000 వేలు డౌన్ పేమెంట్ చేస్తే, మిగిలిన రూ. 6.12 లక్షలను బ్యాంక్‌ నుంచి లోన్‌గా తీసుకోవాలి. మీ క్రెడిట్ స్కోరు ఎంత బాగుందనే దానిపై కారు రుణ మొత్తం ఆధారపడి ఉంటుంది.

9% వడ్డీ రేటుతో లోన్‌ తీసుకుంటే...టాటా పంచ్‌ కొనుగోలుపై బ్యాంక్ 9 శాతం వడ్డీని వసూలు చేస్తుంది అనుకుంటే... 

  • మూడు సంవత్సరాల కాలానికి మీరు రూ. 6.12 లక్షల కార్‌ లోన్‌ తీసుకుంటే ప్రతి నెలా రూ. 19,461 EMI కట్టాలి. మూడేళ్లలో వడ్డీ రూ. 88,612 తో కలిపి మొత్తం రూ. 7,00,612 చెల్లించాలి.
  • నాలుగు సంవత్సరాల టెన్యూర్‌తో కార్‌ లోన్‌ తీసుకుంటే, మీరు ప్రతి నెలా రూ. 15,230 EMI డిపాజిట్ చేయాలి. నాలుగేళ్లలో వడ్డీ రూ. 1,19,023 తో కలిపి మొత్తం రూ. 7,31,023 చెల్లించాలి.
  • ఐదు సంవత్సరాల్లో తిరిగి చెల్లించేలా రుణం తీసుకుంటే, ప్రతి నెలా రూ. 12,704 బ్యాంక్‌కు ఇవ్వాలి. ఐదేళ్లలో వడ్డీ రూ.  1,50,247 తో కలిపి మొత్తం రూ. 7,62,247 చెల్లించాలి.
  • ఆరు సంవత్సరాల టెన్యూర్‌తో కార్‌ లోన్‌ తీసుకుంటే, ప్రతి నెలా రూ. 11,032 వాయిదా చెల్లించాలి. ఆరేళ్లలో వడ్డీ రూ. 1,82,277 తో కలిపి మొత్తం రూ. 7,94,277 చెల్లించాలి.
  • ఏడు సంవత్సరాల కాలం కోసం రుణం తీసుకుంటే, ప్రతి నెలా రూ. 9,847 EMI కట్టాలి. ఏడేళ్లలో వడ్డీ రూ. 2,15,107 తో కలిపి మొత్తం రూ. 8,27,107 చెల్లించాలి.
  • ఎనిమిది సంవత్సరాల్లో తిరిగి చెల్లించేలా రుణం తీసుకుంటే, ప్రతి నెలా రూ. 8,966 బ్యాంక్‌కు ఇవ్వాలి. ఎనిమిదేళ్లలో వడ్డీ రూ. 2,48,729 తో కలిపి మొత్తం రూ. 8,60,729 చెల్లించాలి.

ఈ లెక్కలను బట్టి, మీరు నెలకు రూ. 40,000 నుంచి రూ. 45,000 సంపాదిస్తుంటే, EMI ఆప్షన్‌తో టాటా పంచ్‌ కొనే విషయాన్ని పరిశీలించవచ్చు.

ప్రాంతీయ పన్నులను కలుపుకుని, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో టాటా పంచ్ ధరల్లో కొంత తేడా ఉండవచ్చు. టాటా పంచ్‌పై లభించే రుణ మొత్తం కూడా భిన్నంగా ఉండవచ్చు. కారు రుణాలపై వడ్డీ రేట్లలో వ్యత్యాసం వల్ల EMI లెక్కలు కూడా మారిపోతాయి. కాబట్టి, కార్‌ లోన్‌ తీసుకునే ముందు అన్ని రకాలుగా ఆలోచించి, నిర్ణయం తీసుకోవాలి.