ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ప్రస్తుతం తన కొత్త టెస్లా మోడల్ Y కారణంగా వార్తల్లో నిలిచాడు. అక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానున్న భారత్- ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌కు సన్నాహాలు జరుగుతున్న సమయంలో హిట్‌మ్యాన్ రోహిత్ తన కొత్త టెస్లా మోడల్ Yని నడుపుతూ కనిపించాడు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. వీడియోలో రోహిత్ తన కొత్త టెస్లా Yని ముంబై రోడ్లపై నడుపుతూ కనిపించాడు. ఇది అభిమానులను మాత్రమే కాకుండా, ఎలాన్ మస్క్‌ను సైతం ఆకట్టుకుంది. దాంతో తన బిజినెస్ ప్లాన్ కోసం మస్క్ వాడేశాడు. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

Continues below advertisement

ఎలాన్ మస్క్ పోస్ట్ వైరల్

రోహిత్ శర్మ టెస్లా డ్రైవ్ వీడియో ఎలాన్ మస్క్‌ దృష్టికి రాగానే తను స్వయంగా ఈ పోస్ట్‌ను షేర్ చేశాడు. “ఇందుకే టెస్లాకు యాడ్స్, ప్రకటనల అవసరం లేదు” అని మస్క్ రాసుకొచ్చాడు. టెస్లా ప్రకటనలపై డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. హై-ప్రొఫైల్ వినియోగదారులు, సెలబ్రిటీలు టెస్లా కారును ప్రమోట్ చేస్తారు. 45 మిలియన్ల ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లను కలిగి ఉన్న రోహిత్ శర్మ ఇప్పుడు టెస్లాకు ఫ్రీ అంబాసిడర్‌గా మారి తన ప్రమేయం లేకుండానే ప్రమోట్ చేశాడు. 

టెస్లా మార్కెటింగ్ వ్యూహం

టెస్లా అనేది సాంప్రదాయ ప్రకటనలపై ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయదని తెలిసిందే. అయినప్పటికీ టెస్లా కొత్త కారు మార్కెట్లో వైరల్ అవుతోంది. ఇటీవల, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కొత్త టెస్లా కారు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా టెస్లాకు కోట్లాది రూపాయల ఉచిత ప్రమోషన్‌గా మారింది. ఇదే ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లాను "ఇన్నోవేషన్ ద్వారా నడిచే బ్రాండ్"గా మార్చిన వ్యూహం.

Continues below advertisement

టెస్లా మోడల్ Y కారు

రోహిత్ శర్మ కొనుగోలు చేసిన కారు టెస్లా మోడల్ Y. అదే మోడల్ చవకైన వేరియంట్ అమెరికన్ మార్కెట్‌లో లాంచ్ అయింది. దీని పేరు మోడల్ Y స్టాండర్డ్. ఈ టెస్లా కారులో 69.5 kWh బ్యాటరీ ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు 517 కిలోమీటర్ల రేంజ్ ప్రయాణిస్తుంది. దాదాపు 300 హార్స్‌పవర్. ఇది వేగవంతమైన, స్మూత్ డ్రైవింగ్ అనుభూతిని ఇస్తుంది.

డిజైన్‌లో మార్పులు, కానీ

టెస్లా మోడల్ Y స్టాండర్డ్ డిజైన్‌లో కొన్ని మార్పులు చేశారు, తద్వారా ధరను తగ్గించవచ్చు. టెస్లా కంపెనీ కొన్ని ఫీచర్లను తొలగించింది. అదే డిజైన్, పనితీరులో రాజీ పడలేదు. కొత్త మోడల్‌లో 18-అంగుళాల స్టాండర్డ్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. పనోరమిక్ గ్లాస్ సన్‌రూఫ్ తొలగించారు. ఈ కారు మూడు రంగులలో లభిస్తుంది.  తెలుపు, నలుపుతో పాటు బూడిద రంగులలో లభిస్తుంది. ఫ్రంట్ డిజైన్‌లో కూడా మార్పులు చేశారు, దీనివల్ల కారు కొంచెం మినిమలిస్ట్ లుక్‌ను కలిగి ఉంది.

టెస్లా కొత్త వ్యూహం

కంపెనీ అమ్మకాలు తగ్గుతున్న సమయంలో టెస్లా ఈ మోడల్ తీసుకొచ్చింది. టెస్లా కంపెనీ ప్రస్తుతం "చవకైన EVల" దిశగా అడుగులు వేస్తోంది. టెస్లా మోడల్ Y స్టాండర్డ్, మోడల్ 3 స్టాండర్డ్ వంటి మోడల్స్ టెస్లాకు మార్కెట్ విస్తరణలో కీలకమని భావిస్తున్నారు. ఎలాన్ మస్క్ కేవలం లగ్జరీ కార్లపైనే కాకుండా 'అందరికీ లగ్జరీ' అనే దిశగా అడుగులు వేస్తున్నారు.