Bike Tuning Tips At Home:ప్రతిసారీ మీబైక్ చిన్నగా మొరాయించినా లేదా మైలేజ్ తగ్గినట్టు అనిపించినా మెకానిక్ షాప్‌కు పరుగులు తీయాల్సిన అవసరం లేదు. నేటి కాలంలో పెరుగుతున్న సర్వీసింగ్ ఛార్జీల, నుంచి తప్పించుకోవడానికి DIY బైక్ మెయింటెనెన్స్ ఒక అద్భుతమైన మర్గంగా మారుతోంది. ప్రతి రెండు లేదా 3 నెలలకు ఒకసారి షోరూమ్‌కు వెళ్లి వేల రూపాయలు బిల్లులు కట్టే బదులు మీరే స్వయంగా కొన్ని చిట్కాలు పాటించవచ్చు. ఇంట్లోనే మీ బైక్ పర్ఫార్మెన్స్, మైలేజీ పెంచుకోవడానికి అవసరమైన పూర్తి గైడ్ ఇక్కడ ఉంది.
సర్వీస్ సెంటర్‌లో లేబర్ ఛార్జీలు, అనవసరమైన విడిభాగాల మార్పుల వల్ల మీ జేబుకు చిల్లుపడుతుంది. మీ వాహనంపై మీకు పూర్తి అవగాహన ఉండటం వల్ల, భవిష్యత్‌లో వచ్చే పెద్ద సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు. సరైన సమయంలో చిన్న చిన్న ట్యూనింగ్ పనులు చేయడం వల్ల బైక్ ఇంజిన్ లైఫ్ 5 నుంచి పదేళ్లు అదనంగా పెరుగుతుంది.
ఎప్పుడు ట్యూనింగ్ చేయాలి?
ప్రతి ఐదు వందల కిలోమీటర్లకు ఒకసారి క్లీనింగ్, లూబ్రికేషన్ చేయడం తప్పనిసరి. స్పార్క్ ప్లగ్, ఎయిప్‌ఫిల్టర్‌లను ప్రతి 2000 నుంచి 3000 కిలోమీటర్ల వరకు ఒకసారి చెక్ చేయాలి. ఇంజిన్ ఆయిల్ మార్పు సాధారణంగా ప్రతి 2500కిలోమీటర్ల నుంచి 3000కిలోమీటర్లకు ఒకసారి చేయాలని నిపుణులు చెబుతుంటారు.
స్పార్క్ ప్లగ్ మెయింటెనెన్స్ ఎలా చేయాలి?
బైక్ స్టార్టింగ్ సమస్యలు, పిక్ తగ్గడానికి ప్రధాన కారణం స్పార్క్ ప్లగ్‌పై కార్బొన్ పేరుకుపోవడమే. ప్లగ్ స్పానర్‌తో దానిని బయటకు తీసి సాండ్‌పేపర్ లేదా పాత టూత్‌బ్రష్, పెట్రోల్‌తో క్లీన్ చేయాలి. రెండు ఎలక్ట్రోడ్ల మధ్య గ్యాప్0.6-0.7mm ఉండేలా చూసుకోవడం వల్ల సింగిల్ కిక్‌లోనే బైక్ స్టార్ట్ అవుతుంది.
ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ ఎలా?
బైక్ ఇంజిన్‌కు గాలి సరిగా అందకపోతే పెట్రోల్ ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇది మైలేజీపై ప్రభావం చూపుతుంది. ఫోమ్ ఫిల్టర్ అయితే సోప్ వాటర్‌తో కడిగి ఆరబెట్టాలి. పేపర్ ఫిల్టర్ అయితే ఎయిర్‌ప్రెజర్‌తో దుమ్ము దులపాలి. ఇది ఇంజిన్‌లోకి స్వచ్ఛమైన గాలిని పంపి, బైక్ స్మూత్‌గా వెళ్లేలా చేస్తుంది.
చైన్ లూబ్రికేషన్ ఎలా చేయాలి?
చైన్ లూజ్ అయిన లేదా డ్రైగా మారినా ఇంజిన్‌పై లోడ్ పడి చైన్ తెగిపోయే ప్రమాదం ఉంది. చైన్ 20-30mm ప్లే ఉండేలా అడ్జెస్ట్ చేసి, క్రమం తప్పకుండా చైన్ లూబ్ లేదా ఇంజిన్ ఆయిల్ అప్లై చేయాలి. ముఖ్యంగా వర్షంలో బైక్ నడిపిన తర్వాత చైన్ లూబ్రికేషన్ చేయడం చాలా ముఖ్యం.
టైర్ ప్రెజ్, ఆయిల్ చెక్
వారానికి ఒకసారి టైర్ ప్రెజర్ చెక్ చేయడం వల్ల మైలేజ్ తగ్గకుండా ఉంటుంది. టైర్లు త్వరగా అరిగిపోవు ఇంజిన్ ఆయిల్ లెవెల్‌ను డిప్‌స్టిక్ ద్వారా తరచుగా చెక్ చేస్తూ ఉండాలి. ఆయిల్ నల్లగా మారితే వెంటనే మార్చాలి. ఆయిల్ లెవెల్ ఎప్పుడూ మాక్సిమమ్ మార్క్ వద్ద ఉండేలా జాగ్రత్త పడాలి.
ఐడిల్‌స్పీడ్
ట్రాఫిక్‌లో బైక్ పదే పదే ఆఫ్ అవుతుంటే, కార్బ్యురేటర్ వద్ద ఉండే ఆర్‌పీఎం స్క్రూను స్వల్పంగా అడ్జస్ట్ చేయాలి. బ్రేక్స్, క్లచ్, థ్రాటిల్‌కేబుల్స్ టైట్‌గా ఉన్నాయో లేదో చూసుకొని అవసరమైతే ఆయిలింగ్ చేయాలి. బ్యాటరీ టెర్మినల్స్ క్లీన్ చేయం, లైట్లు, హార్న్ పని తీరును కూడా నెలకోసారి చెక్ చేయాలి. హీరోస్ప్లెండర్ నుంచి బజాజ్, టీవీఎస్ వరకు అన్ని రకాల సాధారణ బైక్‌లకు ఈ టిప్స్ యూజ్ అవుతాయి.
