E20 Petrol Engine: భారత్‌లో E20 పెట్రోల్ వాడకం పెరుగుతోంది. ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ పెట్రోల్‌ను ప్రోత్సహిస్తోంది. 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ ఉండే ఈ ఇంధనాన్ని E20 పెట్రోల్ అని పిలుస్తారు. దేశంలో ఇప్పటికీ పెద్ద సంఖ్యలో వాహనాలు ఉన్నా, ఇవి ప్రత్యేకంగా E10 పెట్రోల్ కోసం డిజైన్ చేశారు. ఈ వాహనాలలో కొందరు E20 పెట్రోల్‌ను నింపుతున్నారు. అలా వాడిన క్రమంలో E20 పెట్రోల్ కారణంగా వాహనాల ఇంజిన్ పాడైపోతే, దానికి ఇన్సూరెన్స్ లభిస్తుందా లేదా అని చాలా మంది కార్ల యజమానులలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. E20 పెట్రోల్ వాడకం వల్ల నార్మల్ కార్ ఇంజిన్ పాడైపోతే ఇన్సూరెన్స్ లభిస్తుందా లేదా అనే విషయానికి సంబంధించి రూల్స్ ఏం చెబుతున్నాయో ఇక్కడ తెలుసుకోండి. 

Continues below advertisement

E20 పెట్రోల్ అంటే ఏంటీ ?E20 పెట్రోల్‌లో 80 శాతం పెట్రోల్ మరియు 20 శాతం ఇథనాల్ కలుపుతారు. ఇథనాల్ అనేది చెరకు, మొక్కజొన్న, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల నుండి తయారు చేస్తున్న ఒక బయోఫ్యూయల్. దీనివల్ల కాలుష్యం తగ్గడంతో పాటు రైతుల ఆదాయం పెరుగుతుందని, విదేశీ చమురుపై ఆధారపడటం బాగా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే భారత్‌లోనూ E20 పెట్రోల్ వాడకం వేగంగా పెరుగుతోంది.

E20 పెట్రోల్ వల్ల ఏ వాహనాలపై ప్రతికూల ప్రభావంఏప్రిల్ 2023 తర్వాత తయారు చేసిన చాలా కొత్త కార్లు E20 పెట్రోల్ తో నడిచేలా ఉన్నాయి. అంతకంటే ముందు ఉన్న అనేక వాహనాలు E10 అంటే 10 శాతం ఇథనాల్ ఉండే పెట్రోల్ ప్రకారం డిజైన్ చేశారు. అటువంటి పరిస్థితిలో, ఆటో నిపుణుల అభిప్రాయం ప్రకారం పాత వాహనాలలో E20ని నిరంతరం ఉపయోగించడం వల్ల ఫ్యూయల్ లైన్, రబ్బర్ సీల్ గ్యాస్కెట్, ఇంజిన్ కొన్ని భాగాలపై ప్రభావం చూపవచ్చు. అయితే, వెంటనే నష్టం జరగదు. కానీ సమస్య క్రమక్రమంగా బయటపడుతుంది.

Continues below advertisement

Also Read: Petrol Latest News: పెట్రోల్ బంకుల్లో ఇంధన కొనుగోళ్లపై 90 రోజులపాటు ఆంక్షలు.. కేంద్రం కీలక నిర్ణయం

వాహన తయారీ కంపెనీలు ఏం చెబుతున్నాయిE20 పెట్రోల్‌ గురించి టయోటా సంస్థ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. E10 కోసం డిజైన్ చేసిన కార్లలో E20ని ఉపయోగించడం నివారించాలి. కంపెనీ ప్రకారం, సెట్ కాని ఇంధనాన్ని ఉపయోగించడం వల్ల నష్టం జరిగితే, వారంటీ క్లెయిమ్ చెల్లదు. మహీంద్రా కంపెనీ తమ పెట్రోల్ ఇంజిన్లు E20కి అనుకూలంగా ఉన్నాయని,  కేవలం E20 ఉపయోగించడం వల్ల వారంటీ లేదా క్లెయిమ్ తిరస్కరించరని పేర్కొంది. టాటా మోటార్స్ తమ వాహనాలు ఎలాంటి పెద్ద సమస్య లేకుండా E20 పెట్రోల్‌పై నడుస్తాయని క్లెయిమ్ చేస్తోంది.

ఇన్సూరెన్స్ కంపెనీలుఇన్సూరెన్స్ కంపెనీల ప్రకారం, వాహనం E20 కోసం డిజైన్ చేయకపోతే.. తప్పుడు ఇంధనాన్ని ఉపయోగించడం వల్లే ఇంజిన్ దెబ్బతిన్నట్లు పరీక్షల్లో తేలితే  ఇన్సూరెన్స్ క్లెయిమ్ తిరస్కరణకు గురవుతుంది. సంబంధించి మహీంద్రా ప్రతినిధి మాట్లాడుతూ.. E20 పెట్రోల్‌కు సంబంధించిన ఏదైనా సమస్య తలెత్తితే కంపెనీ తన వారంటీ రూల్స్ ప్రకారం నడుచుకుంటుందన్నారు. అంటే E20 ఉపయోగించడం వల్ల మీ ఇన్సూరెన్స్ అంత ఈజీగా రిజెక్ట్ చేయరు. కంపెనీ రూల్స్, ఇన్సూరెన్స్ పాలసీ రూల్స్ చెక్ చేసి.. రాంగ్ పెట్రోల్ వల్లే ఇంజిన్ పాడయిందని తేలితేనే మీ క్లెయిన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది.