Ducati Watches India: భారత్‌లో డుకాటీ అభిమానులకు ఇప్పుడు మరో ప్రత్యేక అనుభూతి అందుబాటులోకి వచ్చింది. రైడింగ్‌ థ్రిల్‌ కోసం పేరుగాంచిన Ducati, ఇప్పుడు తన రేసింగ్‌ స్టైల్‌, అగ్రెసివ్‌ డిజైన్‌ & శక్తిమంతమైన పనితీరును వాచ్‌ల రూపంలోనూ భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త వాచ్‌ల కలెక్షన్‌ను టైటన్‌ (Titan Company Limited) డిస్ట్రిబ్యూట్‌ చేస్తోంది. డిసెంబర్‌ 3న అధికారికంగా లాంచ్ అయిన ఈ సిరీస్‌లో మొత్తం 43 మోడళ్లు ఉన్నాయి. వాటి ధరలు రూ.14,799 నుంచి రూ.27,999 వరకు ఉన్నాయి.

Continues below advertisement

ప్రత్యేకమైన డిజైనింగ్‌ఈ వాచ్‌లను పూర్తిగా డుకాటీ మోటార్‌ సైకిళ్ల నుంచి తీసుకున్న డిజైన్‌ స్పూర్తితోనే రూపొందించారు. ప్రత్యేకంగా ఇన్‌స్ట్రుమెంటేషన్‌-లుక్‌ ఉన్న డయల్స్‌, ఆకర్షణీయమైన రెడ్‌ యాక్సెంట్స్‌, షార్ప్‌ ఎడ్జ్‌లు, వైమానిక ప్రేరణతో చేసిన కేసింగ్‌, మోటార్‌ స్పోర్ట్స్‌ టెక్స్చర్‌లు... డుకాటీ రేసింగ్‌ ప్రపంచాన్ని గుర్తు చేస్తాయి. డుకాటీ రైడర్లు, మోటార్‌ సైకిల్‌తో కలిగే ఆ పెద్ద థ్రిల్‌ను చేతిపైన కూడా అనుభూతి చెందేలా ఈ వాచ్‌లను ప్రత్యేకంగా డిజైన్‌ చేశారని బ్రాండ్ చెబుతోంది.

ఎక్కడ కొనవచ్చు?భారత్‌లో డుకాటీ మర్చండైస్‌ కోసం చాలా కాలంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ అవసరాన్ని గుర్తించిన Ducati... Titan‌ను తన ప్రత్యేక లైసెన్సింగ్‌ & డిస్ట్రిబ్యూషన్‌ భాగస్వామిగా ప్రకటించింది. అంటే ఈ వాచ్‌లు టైటన్‌ తయారీ కాదు; కానీ Titan మాత్రమే వాటి భారత మార్కెట్‌ డిస్ట్రిబ్యూటర్‌. Titan‌ Helios, Titan World & ప్రముఖ మల్టీ-బ్రాండ్‌ స్టోర్లతో పాటు ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లలో కూడా ఇవి అందుబాటులో ఉంటాయి.

Continues below advertisement

Ducati బ్రాండ్ లైసెన్సింగ్ హెడ్ Alessandro Cicognani మాట్లాడుతూ - “Ducati అంటే ఎమోషన్‌. రైడర్‌ బైక్‌తో కలిసిపోయే ఆ క్షణాన్ని మేము ఈ వాచ్‌లలోకి తీసుకొచ్చాం. ప్రతి డుకాటీ ఫ్యాన్‌ కోసం ఇది ప్రత్యేకంగా రూపొందించిన కలెక్షన్‌” అని చెప్పారు.

Titan Watches CEO Kuruvilla Markose మాట్లాడుతూ - “డుకాటీ మర్చండైస్‌ కోసం భారత రేసింగ్‌ కమ్యూనిటీ చాలా కాలంగా ఎదురు చూసింది. ఈ ప్రీమియం వాచ్‌లతో ఆ లోటు ఇప్పుడు తీరిపోయింది” అన్నారు.

స్పెషల్‌ కలెక్షన్‌డుకాటీ అభిమానులు ఇప్పుడు తమ రోజు వారీ జీవితంలో కూడా బ్రాండ్‌ స్పూర్తిని అనుభూతి చెందగలిగేలా ఈ వాచ్‌లు రూపొందించడం ప్రత్యేకత. మోటార్‌ స్పోర్ట్ ప్రేమికులు, స్టైల్‌ను ప్రాధాన్యంగా చూసే యువత & ప్రీమియం యాక్ససరీస్‌ ఇష్టపడే వారికి ఇవి ఒక ప్రత్యేక ఎంపికగా నిలుస్తాయి.

భారత్‌లో మోటార్‌ సైకిల్‌ సంస్కృతికి భారీ ఆదరణ ఉన్న తరుణంలో Ducati Watches లాంచ్‌ కావడాన్ని, లైఫ్‌ స్టైల్‌ సెగ్మెంట్‌లో డుకాటీ ప్రారంభించిన కీలక అడుగుగా చూస్తున్నారు పరిశ్రమ నిపుణులు. టైటన్‌ డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ ఉండటంతో, ఈ వాచ్‌లు దేశవ్యాప్తంగా సులభంగా అందుబాటులోకి వస్తాయి.

డుకాటీ స్టైల్‌ను ఇప్పుడు రోడ్డుమీద కాదు, చేతిపైన కూడా ధరించొచ్చు అనేది ఈ కలెక్షన్‌ ప్రత్యేకత.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.