Buying a flood affected car is safe Know Details in Telugu | ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు విలయతాండవం చేయడంతో భారీ వర్షాలు కురిశాయి. పెద్ద నగరాలు నుంచి మొదలుకొని చిన్నచిన్న గ్రామాల వరకు జల ప్రవాహంలో చిక్కుకున్నాయి. ఈ క్రమంలో వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగిన విషయం తెలిసిందే. భారీ వర్షానికి జల ప్రవాహం ఎక్కువగా ఉండటంతో రోడ్లపై, ఇంటి ముందు ఉండే కొన్ని వాహనాలు కంటికి కనబడకుండా కొట్టుకుపోయాయి. రోడ్లపై ఉండే ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు నీట మునిగి బురదమయం అయిపోయాయి.
స్క్రాప్ రూపంలో అమ్మకాలు
ఇళ్లలో ఉండే సోఫా సెట్లు, బెడ్లు, కుర్చీలు ఇనుము సామాగ్రి వస్తువులు ఎండకు పెడితే ఎండుతాయి. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, టీవీ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు నీటిలో తడిచాయి అంటే ఇంకా అంతే సంగతులు. మరి వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేసే ఫ్రిడ్జ్ టీవీ వాషింగ్ మిషన్ లాంటి వస్తువులయితే నీటిలో తడిస్తే పర్లేదు కానీ లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసే కార్లు నీటిలో తడిశాయంటే ఇంక అంతే పరిస్థితి అనుకుంటారు. లక్షల రూపాయలు పెట్టి, కొనుగోలు చేసిన ఆ కార్లను స్క్రాప్ రూపంలో అమ్మకాలు చేస్తుంటారు.
నీటిలో మునిగిన ఖరీదైన కార్లను కొందరు చవకగా స్క్రాప్ లో కొనుగోలు చేస్తుంటారు. మరి ఈ కార్లను కొనుగోలు చేయొచ్చా..? ఒకవేళ చేస్తే అవి పనికి వస్తాయా ..? అయితే కార్లు నీటిలో మునిగిన తర్వాత కారు ఇంజన్ కు ఏమైనా అవుతుందా...? ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనే విషయాలను "ABP DESAM" ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
కార్ నీటిలో మునిగితే ఏం అవుతుంది...
వాహనాలు నీటిలో తడవడం సహజమే కానీ మామూలుగా తడవడానికి పూర్తిగా నీటిలో మునిగిపోవడానికి తేడా ఉంటుంది. సామాన్యంగా కార్లలో వెళ్లేటప్పుడు వర్షం పడితే కారు తడుస్తుంది .మరి అప్పుడు రాని సమస్య నీటిలో మునిగినప్పుడు ఎందుకు వస్తుందని చాలా మందిలో సందేహాలను తీసుకువస్తుంది.
అయితే మానవ శరీరంలో మెదడు, గుండె, కాలేయం, నరాలు ఎలా పనిచేస్తాయి వాహనాలకు కూడా ECM (ENGINE CONTROL MODULE),ECU (ELECTRONIC CONTROL UNIT), ఎయిర్ ఫిల్టర్, సైలెన్సర్, వైరింగ్, సెల్ఫ్ మోటర్, డైనమా అనే కొన్ని ముఖ్యమైన భాగాలు ఉంటాయి.
ECM, ECU అంటే ఏంటి అది ఎలా పని చేస్తుంది...?
ఈ ECM, ECU అంటే మానవ శరీరంలో మెదడు శరీరాన్ని ఎలా కంట్రోల్ చేస్తుందో ఈ ECM, ECU లు కూడా కారు ఇంజను స్మూత్ గా ఉండేందుకు ఎలక్ట్రానిక్ వైరింగ్ సిస్టంని కంట్రోల్ చేసేందుకు పనిచేస్తాయి. ముఖ్యంగా కారులో ఉండే వైరింగ్ సిస్టం ఎలా పనిచేస్తుంది, బ్యాటరీ నుంచి ఎంత పవర్ ని పంపించాలి డైనమా నుండి ఎంత పవర్ ని తీసుకోవాలి అనే పని ECM,ECU చేస్తుంటాయి.
ఫోర్ వీలర్ టెక్నీషియన్...
ఫోర్ వీలర్ వాహనాలు వర్షంలో తడిసాయి అంటే ముందుగా 90% వరకు పాడైపోతాయని అంటున్నారు టెక్నీషియన్. ముందుగా సైలెన్సర్ బాగా నుండి కారు ఇంజన్ లోకి నీరు చేరుకుంటుందని కారు ఇంజన్లోకి నీరు చేరుకోగానే ఈ సీఎం లు బ్యాటరీ షార్ట్ అయిపోయి వైరింగ్ అంతా షాట్ సర్క్యూట్ అవుతుందని అంటున్నారు. ఒకవేళ కార్ని స్టార్ట్ చేద్దామని ప్రయత్నిస్తే ఇంజన్ తోపాటు డైనమా బ్యాటరీ వైరింగ్ మొత్తం పాడు అయిపోయే అవకాశం ఉంటుందని అంటున్నారు టెక్నీషియన్...
మరి ఈ వాహనాలను స్క్రాప్ లో కొనుగోలు చేస్తే పనికి వస్తాయా...
అడ్వాన్సుడ్ స్టేజ్ లో ఉండే క్యాన్సర్ పేషెంట్ కి ఎంతకాలం బతుకుతాడో అనే నమ్మకం ఎలా ఉంటుందో ఈ నీటిలో మునిగిన వాహనాలను కొనుగోలు చేసి వాటిని బాగు చేయించుకోవడం కూడా అలాంటిదే అని అంటున్నారు సీనియర్ టెక్నీషియన్ దాసరి వంశీ. వాహనాలు నీటిలో మునిగిపోయిన గంటసేపటి వ్యవధిలోనే వైరింగ్ మొత్తం జంక్ పడుతుందని.. ఒకవేళ వారి అదృష్టం బాగుంటే వాహనం బాగు అయ్యే అవకాశం ఉందంటున్నారు.