What is Meant by Connected Car:గత కొన్ని దశాబ్దాలుగా కేవలం రవాణా సాధనంగా మాత్రమే పరిగణించే కార్లు ఇప్పుడు కంప్యూటర్ల మాదిరిగా మారిపోతున్నాయి. ఎక్కువ మంది ప్రయాణికులు అలాంటి కార్ల కొనేందుకు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. దీని వల్ల భారత్ వాహన రంగంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు లగ్జరీ కార్లకే పరిమితమైన కనెక్టెడ్‌ ఫీచర్లు ఇప్పుడు సామాన్యుడు కొనే బడ్జెట్‌ కార్లలో కూడా స్టాండర్డ్‌ ఫీచర్లుగా మారుతున్నాయి. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, 5G టెక్నాలజీతో అనుసంధానించే ఈ స్మార్ట్‌ కార్లు మన ప్రయాణాన్ని ఎలా సౌకర్యమంతగా మారుస్తున్నాయో చూద్దాం. 

Continues below advertisement

కనెక్టెడ్ కార్ అంటే ఎలా ఉంటుంది?

కనెక్టెడ్ కార్ లేదా స్మార్ట్ కార్ అంటే ఇంటర్నెట్‌కు నిరంతరం కనెక్ట్ అయి ఉండే వాహనం. ఇది కేవలం ఒక వైపు నుంచి మాత్రమే కాకుండా అన్ని వైపుల నుంచి సమాచార వ్యవస్థ కలిగి ఉంటాయి. ఇదంతా టెలీమాటిక్స్ టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. ప్రతి కనెక్టెడ్‌ కార్‌లో ఒక 4G లేదా 5G మోడెమ్ ఎంబెడ్ అయి ఉంటుంది. ఇది డేటా షేరింగ్, నావిగేషన్, ఎంటర్‌టైన్మెంట్‌, సేఫ్టీ ఫీచర్లు అందిస్తుంది. ఇందులో ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతోపాటు ఓవర్‌ ది ఎయిర్‌ అంటే ఓటీఏ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌వంటి ఫీచర్లు ఉంటాయి. 

ఈ వాహనాలు ప్రధానంగా సిమ్‌బేస్డ్ కనెక్టివిటీ ద్వారా పని చేస్తాయి. కార్ తయారీదారులు ఇందులో ఇ-సిమ్‌ లేదా ఫిజికల్‌ సిమ్‌కార్డును అమర్చుతారు. ఇది సెల్యూలార్ నెట్‌వర్క్ ద్వారా క్లౌడ్‌ సర్వర్‌లతో అనుసంధానించి ఉంటుంది. ఇది కారును ఒక వైఫై హాట్‌స్పాట్‌గా మార్చడమే కాకుండా, రియల్ టైమ‌ నావిగేషన్ రిమోట్‌ కంట్రోల్‌ల ఉంటుంది. అయితే ఈ ఫీచర్లను కంటిన్యూగా వాడాలంటే డేటా ప్లాన్ లేదా సబ్‌స్క్రిప్షన్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 

Continues below advertisement

భారత్ మార్కెట్‌లో కనెక్టెడ్‌ కార్ల హవా

భారత్‌లో కనెక్టెడ్‌ కార్ల పాపులారిటీ ఊహించని విధంగా పెరుగుతుంది. గత ఏడాది జరిగిన అమ్మకాల్లో 27 నుంచి 37 శాతం మోడల్స్‌లో eసిమ్‌ ఉంది. భారతీయ వినియోగదారులు రిమోట్ కంట్రోల్‌,లైవ్ ట్రాఫిక్ అప్‌డేట్స్, జియో ఫెన్సింగ్‌ వంటి ఫీచర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. 

నిజంగా కార్లకు ఇవి అవసరమా? మార్కెట్ మాయాజాలమా?

కనెక్టెడ్ కార్ల విషయంలో ఒక చర్చ నిరంతరం జరుగుతూనే ఉంది. పది కొత్త కార్లలో 9 కార్లు ఇప్పుడు కనెక్టెడ్ కార్లు వస్తున్నాయి. డ్రైవర్ అసిస్ట్‌, రిమోట్‌ మానిటరింగ్ ట్రాఫిక్ అప్‌డేట్స్ వంటి ఫీచర్లు డ్రైవింగ్‌ను సులభతరం చేస్తున్నాయి. భద్రతను కూడా పెంచుతున్నాయి. ఉదాహరణకు రిమోట్‌ ఇంజిన్ స్టార్ట్ ఫీచర్ ద్వారా స్మార్ట్ ఫోన్ యాప్‌ ఉపయోగించి కారును దూరంగా ఉన్నప్పుడే స్టార్ట్ చేయవచ్చు. ఎండలు ఎక్కువగా ఉండే మనలాంటి దేంలో కారు దగ్గరకు వెళ్లకముందే యాప్ ద్వారా ఏసీ ఆన్ చేసి లోపల కూల్ చేసుకోవడం అనేది చాలా మందికి లగ్జరీ కంటే కన్వీనియెన్స్‌గా అనిపిస్తుంది. 

అయితే ప్రతి ఫీచర్ అందరికీ అవసరం ఉండకపోవచ్చు. కొంతమంది దీనిని కేవలం కార్ల విక్రయాలు పెంచడానికి కంపెనీలు ఆడే మార్కెటింగ్‌ గిమ్మిక్‌గా భావిస్తారు. రిమోట్‌ ఫీచర్ల వల్ల బ్యాటరీ డ్రెయిన్ అయ్యే  అవకాశం ఉందని అలాగే సెక్యూరిటీ రిస్క్‌లు కూడా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

అయినా సరే కనెక్టెడ్‌ కార్లు అనేది భవిష్యత్‌లో ఒక అనివార్యమైన మార్పు. ఇవి మన ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి. భద్రతను పెంచుతాయి. ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. అయితే వినియోగదారులు కేవలం ఫీచర్లును చూసి మురిసిపోకుండా తమ డేటా ఎలా షేర్ అవుతోందా లేదా అనే విషయాన్ని సెట్టింగ్స్‌ నిరంతరం చెక్ చేసుకోవడం చాలా అవసరం.