CNG Car Maintenance: దేశంలో పెట్రోలు, డీజిల్ ధరల కారణంగా CNG కార్లకు గత కొన్నేళ్లుగా డిమాండ్ బాగా పెరిగింది. కానీ సాధారణ కార్ల కంటే ఎక్కువ మెయింటెనెన్స్ అవసరం. సీఎన్‌జీ కార్లలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే సీఎన్‌జీ అనేది ఎక్కువగా మండే వాయువు. అందులో ఏదైనా నిర్లక్ష్యం వహిస్తే దానిలో కూర్చున్న ప్రయాణీకులకు చాలా ప్రాణాంతకం అవుతుంది. మీరు కూడా సీఎన్‌జీ కారు నడుపుతుంటే, పొరపాటున కూడా మీరు చేయకూడని కొన్ని తప్పుల గురించి తెలుసుకోండి. ఎందుకంటే ఇవి మీ కారు ఇంజిన్‌పై ప్రభావం చూపడమే కాకుండా మీ ప్రాణాలకు కూడా ప్రమాదకరంగా మారతాయి.


సీఎన్‌జీలో ఇంజిన్‌ను ప్రారంభించవద్దు
మీరు వాహనాన్ని నేరుగా సీఎన్‌జీ మోడ్‌లో ఎప్పుడూ స్టార్ట్ చేయకూడదు. సీఎన్‌జీ కారును ముందుగా పెట్రోల్‌తో మాత్రమే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే నేరుగా సీఎన్‌జీలో ప్రారంభిస్తే వాహనం ఇంజిన్‌పై చెడు ప్రభావం పడుతుంది. అందుకే చాలా CNG కార్లలో వాహనాన్ని నేరుగా సీఎన్‌జీలో స్టార్ట్ చేసే అవకాశం లేదు. కారును పెట్రోల్ మోడ్‌లో కొద్దిసేపు రన్ చేసిన తర్వాత మాత్రమే సీఎన్‌జీ మోడ్‌కి మారండి.


స్పార్క్ ప్లగ్ చూసుకోవాలి
సీఎన్‌జీ కార్లలోని స్పార్క్ ప్లగ్‌లు చాలా త్వరగా పాడైపోతాయి. అందుకే వాటిని జాగ్రత్తగా మెయింటెయిన్ చేయాలి. వాటిని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి. మీకు కావాలంటే పెట్రోల్ ఆధారిత స్పార్క్ ప్లగ్‌ని కూడా ఉపయోగించవచ్చు. ఇది కొంచెం ఉపయోగపడే పద్ధతి


సీఎన్‌జీ కారును ఎండలో పార్కింగ్ చేయడం మానుకోండి
సీఎన్‌జీ గ్యాస్ రూపంలో ఉంటుంది. ఇతర ఇంధనాలతో పోలిస్తే ఎక్కువ వేడిని పొందిన తర్వాత చాలా త్వరగా ఆవిరైపోతుంది. అందుకే సీఎన్‌జీ వాహనాన్ని ఎండలో పార్కింగ్ చేయడం మానుకోవాలి.


లీకేజీ కోసం రెగ్యులర్ టెస్ట్ చేయించుకోండి
సీఎన్‌జీ ట్యాంక్‌లో లీక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఇది అగ్ని ప్రమాదాలకు దారి తీస్తుంది. అందుకే మీరు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు లీకేజీని తనిఖీ చేయాలి. అలాగే ట్యాంక్‌ను ఎప్పుడూ ఓవర్‌ఫిల్ చేయకండి. లీకేజీ అయినట్లయితే వెంటనే మెకానిక్‌తో రిపేర్లు చేయించండి.