భారత్‌లో CNG వాహనాలకు డిమాండ్ పెరిగింది. తక్కువ ఫ్యూయల్, మెయింటనెన్స్ ఖర్చు ఓ కారణంగా చెబుతారు. అయితే, చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటీవలే బరోడాలోని ఒక సీఎన్‌జీ పంప్‌ వద్ద ఫిల్ చేస్తుండగా హఠాత్తుగా ఒక కారు సిలిండర్ పేలిపోయింది. ఈ భారీ పేలుడుతో కారు విడిభాగాలు ముక్కలై ఎగిరిపడ్డాయి. చుట్టుపక్కల ఉన్న ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సీఎన్‌జీ పంప్ నుంచి దూరంగా పరుగులు తీశారు. 

Continues below advertisement

ఎక్కువగా ఇలాంటి ప్రమాదాలు లోకల్ సిలిండర్లు వాడటం, సరైన సమయానికి సిలిండర్ టెస్ట్ చేయించకపోవడం లేదా గ్యాస్ లీకేజీని గుర్తించకపోవడం వల్లే జరుగుతుంటాయి. మీ వద్ద కూడా సీఎన్‌జీ కారు (CNG) ఉంటే గ్యాస్ రీఫిల్లింగ్ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతోపాటు ఇతర సీఎన్‌జీ ప్రమాదాల నుంచి మిమ్మల్ని, మీ కారును పూర్తిగా సురక్షితంగా ఉంచే 3 ముఖ్యమైన సేఫ్టీ చెక్స్ వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.

హైడ్రో-టెస్టింగ్ సర్టిఫికేట్‌ అప్‌డేట్‌

Continues below advertisement

సీఎన్‌జీ కారు యజమానులకు అత్యంత ముఖ్యమైన విషయం.. సిలిండర్‌కు ఎప్పటికప్పుడూ హైడ్రో- టెస్టింగ్ చేయించాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి గుర్తింపు పొందిన టెస్టింగ్ సెంటర్ నుంచి సీఎన్‌జీ సిలిండర్‌ (CNG Cylinder)ను చెక్  చేయించడం తప్పనిసరి.

ఈ తనిఖీలో CNG సిలిండర్ లోపల ఏవైనా పగుళ్లు, తుప్పు పట్టడం లేదా గ్యాస్ ప్రెజర్ తట్టుకోవడంలో ఏమైనా బలహీనపడిందా అనేది చెక్ చేస్తారు. వ్యాలిడిటీ సమయం పూర్తయిన తర్వాత లేదా వ్యాలిడ్ హైడ్రో-టెస్టింగ్ సర్టిఫికేట్ లేకుండా సిలిండర్‌లో గ్యాస్ నింపడం ప్రమాదానికి దారితీయవచ్చు. కనుక ఎల్లప్పుడూ మీ కారు సిలిండర్ వ్యాలిడిటీని చెక్ చేసుకుంటూ ఉండాలి.

అప్రూవ్డ్ కిట్‌ను మాత్రమే ఉపయోగించాలి

బడ్జెట్, ఇతర ఖర్చుల కారణంగా కొందరు కొద్దిగా డబ్బు ఆదా చేయడం కోసం లోకల్ మార్కెట్లలో చౌకైన, లోకల్ సీఎన్‌జీ కిట్ లేదా పాత సిలిండర్‌ను తమ కారులో ఫిక్స్ చేయిస్తుంటారు. ఈ పెద్ద నిర్లక్ష్యం ఏ క్షణంలోనైనా భారీ ప్రమాదానికి కారణం కావచ్చు. కొన్ని సందర్బాలలో కారు డ్యామేజీతో పాటు మీ ప్రాణాలకు ముప్పు వాటిల్లవచ్చు.

అప్రూవల్ లేని సిలిండర్ల లోహం, వాల్వ్ గ్యాస్ హై ప్రెజర్‌ను తట్టుకోలేవు. కనుక రీఫిల్లింగ్ సమయంలో వాటిపై అధిక ప్రెజర్ పడగానే పేలిపోతాయి. ఎల్లప్పుడూ ఆర్‌టీఓ (RTO) అప్రూవ్డ్, కంపెనీ-ఫిట్టెడ్ సీఎన్‌జీ కిట్‌‌ (CNG KIT)ను మాత్రమే ఉపయోగించాలి. ఒకవేళ బయట కిట్ బిగించాల్సి వస్తే, ఎట్టి పరిస్థితిలోనైనా గుర్తింపు పొందిన డీలర్ వద్ద మాత్రమే సర్టిఫైడ్ కిట్‌ను ఇన్స్టాల్ చేయించుకోవాలి. 

ఆ సమయంలో కారు బయటకు రండి

సీఎన్‌జీ పంప్‌ వద్ద కారులో గ్యాస్ ఫిల్ చేస్తున్నప్పుడు కారు లోపల కూర్చోవడం చాలా ప్రమాదకరం. సీఎన్‌జీ సిలిండర్‌లో చాలా ఎక్కువ ప్రెజర్‌తో గ్యాస్ నింపుతారు. ఒకవేళ సిలిండర్ లేదా పైప్‌‌లైన్‌లో లోపం ఉంటే, ప్రెజర్ పెరగగానే సిలిండర్ బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఉంది.

భద్రతా కారణాల దృష్ట్యా గ్యాస్ రీఫిల్లింగ్ ప్రారంభమయ్యే ముందే కారులోని ప్రయాణికులు వాహనం నుంచి దిగిపోవాలి. ఫిల్ చేసే సమయంలో కారులో మనుషులు ఉంటే గట్టిగా ఫోన్ మాట్లాడటం, లేక ఏదైనా డివైజ్ వాడటం ప్రమాదానికి దారితీయవచ్చు. కారు ఇంజిన్‌ను సైతం పూర్తిగా బంద్ చేయాలి. సమీపంలో స్మోకింగ్ అస్సలు చేయకూడదు. అలాగే కారు డిక్కీని తెరిచి ఉంచడం ద్వారా గ్యాస్ లీక్ అయితే వెంటనే గుర్తించడానికి వీలవుతుంది.