Citroen C3 Live O Price And Features: భారత మార్కెట్‌లో తన ఉనికిని మరింత బలపర్చుకునే దిశగా సిట్రోయెన్ ఇండియా కీలక అడుగు వేసింది. తాజాగా కంపెనీ C3 Live (O) & Aircross X Max Turbo 5-సీటర్ అనే రెండు కొత్త వేరియంట్లను అధికారికంగా విడుదల చేసింది. ఈ రెండు మోడళ్లతో పాటు సిట్రోయెన్ ఒక కొత్త విధానాన్ని కూడా అమల్లోకి తెచ్చింది. అదే బుకింగ్స్‌ ఆధారిత తయారీ విధానం.

Citroen Aircross X Max Turbo 5-సీటర్‌ వివరాలు

ఇప్పటివరకు Aircrossలో 5-సీటర్‌ ఆప్షన్‌ You, Plus వేరియంట్లకే పరిమితమైంది. ఇప్పుడు అదే లైనప్‌లో Max Turbo 5-సీటర్‌ కూడా చేరింది. ఈ వేరియంట్‌ ధర రూ. 12.41 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ ధర).

7-సీటర్‌తో పోలిస్తే ఈ 5-సీటర్‌లో వెనుక సీట్లో ప్రయాణికులకు 60mm అదనపు మోకాలి స్థలం లభిస్తుంది. అంతేకాదు,

రియర్‌ సెంటర్‌ ఆర్మ్‌రెస్ట్‌

కప్‌ హోల్డర్స్‌

మూడు దశల రియర్‌ సీట్‌ రీక్లైన్‌

వంటి కంఫర్ట్‌ అప్‌గ్రేడ్స్‌ అందించారు. ఈ వేరియంట్‌ Polar White, Deep Forest Green, Perla Nera Black కలర్‌ ఆప్షన్లలో, డార్క్‌ బ్రౌన్‌ ఇంటీరియర్స్‌తో వస్తుంది. మాన్యువల్‌ గేర్‌బాక్స్‌తోనే అందుబాటులో ఉంటుంది.

Citroen C3 Live (O): బేస్‌ వేరియంట్‌లోనే ఎక్కువ ఫీచర్లు

సిట్రోయెన్ C3 హ్యాచ్‌బ్యాక్‌లో కొత్తగా Live (O) అనే ఆప్షనల్‌ వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 5.49 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌).

స్టాండర్డ్‌ Live ట్రిమ్‌తో పోలిస్తే Live (O) వేరియంట్‌లో 10కి పైగా అదనపు ఫీచర్లు ఇచ్చారు. ప్రీమియం కార్లలోనే కనిపించే ఇలాంటి ఫీచర్లను ఇంత తక్కువ ధర వేరియంట్‌లోకి సిట్రోయెన్‌ తీసుకొచ్చింది. ముఖ్యంగా...

10.1 ఇంచ్‌ టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌

వైర్‌లెస్‌ Android Auto, Apple CarPlay

రియర్‌వ్యూ కెమెరా

లెదరెట్‌ సీట్లు

స్పీకర్లు

వీల్‌ కవర్లు

అదనపు క్లాడింగ్‌, క్రోమ్‌ యాక్సెంట్స్‌

ఈ వేరియంట్‌ Perla Nera Black కలర్‌లో మాత్రమే లభిస్తుంది.

బుకింగ్స్‌ ఆధారిత తయారీ అంటే ఏమిటి?

ఇప్పటి నుంచి కొన్ని ఎంపిక చేసిన వేరియంట్లను డీలర్‌ స్టాక్‌ కోసం ముందుగా తయారు చేయకుండా, కస్టమర్‌ నుంచి కన్ఫర్మ్‌ అయిన బుకింగ్‌ వచ్చిన తర్వాత మాత్రమే తయారు చేస్తామని సిట్రోయెన్ ప్రకటించింది. దీని వల్ల అసలు డిమాండ్‌ ఏంటో అర్థం చేసుకుని, తయారీ సామర్థ్యాన్ని సమర్థంగా వినియోగించుకోవచ్చని కంపెనీ భావిస్తోంది.

ఈ విషయంపై స్టెల్లాంటిస్‌ ఇండియా ఆటోమోటివ్‌ బ్రాండ్స్‌ బిజినెస్‌ హెడ్‌ కుమార్‌ ప్రియేశ్‌ మాట్లాడుతూ - “బుకింగ్స్‌ ఆధారిత విధానంతో మేము నిజమైన డిమాండ్‌కు అనుగుణంగా వేరియంట్లను అందించగలుగుతున్నాం. Aircross X Max 5-సీటర్‌, C3 Live (O) ఈ విధానంలో తొలి మోడళ్లు” అని తెలిపారు.

భారత మార్కెట్‌పై సిట్రోయెన్ ఫోకస్‌

ఈ కొత్త వేరియంట్లతో భారత మార్కెట్‌లో విస్తృత కస్టమర్‌ బేస్‌ను చేరుకోవాలని సిట్రోయెన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఒకవైపు ఎక్కువ కంఫర్ట్‌ కోరుకునే కుటుంబాలకు Aircross X Max 5-సీటర్‌, మరోవైపు బడ్జెట్‌లోనే మోడ్రన్‌ ఫీచర్లతో కూడిన హ్యాచ్‌బ్యాక్‌ కావాలనుకునే వారికి C3 Live (O) ఆకర్షణీయమైన ఎంపికగా మారనుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.