Citroen Basalt X Full Review Explained: కూపే SUV లుక్స్‌తో యువతరాన్ని ఆకట్టుకుంటున్న కొత్త మోడల్‌ సిట్రోయెన్‌ బాసాల్ట్‌ X. ఈ మిడ్‌సైజ్‌ SUV తన స్టైలింగ్‌, డ్రైవ్‌ క్వాలిటీతో ఆకర్షిస్తున్నా, కొన్ని మిస్‌ అయిన ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ కారును కొనుగోలు చేయదలచినవారు ఏమేం గమనించాలో తెలుసుకుందాం.

Continues below advertisement

డ్రైవింగ్‌ & హ్యాండ్లింగ్‌Citroen Basalt X రోడ్డుపై నడిపితే అద్భుతమైన డ్రైవ్‌ క్వాలిటీని ఫీల్‌ కావచ్చు. సస్పెన్షన్‌ సెటప్‌ సాఫ్ట్‌గా ఉండటంతో బంప్స్‌, గుంతల రోడ్లను కూడా సులభంగా తట్టుకుంటుంది. లైట్‌ స్టీరింగ్‌ మరో ప్లస్‌ పాయింట్‌, చేతుల్లో చక్రంలా తిరుగుతుంది & సులభంగా ఉంటుంది. ఈ SUV హై గ్రౌండ్‌ క్లియరెన్స్‌ కారణంగా సిటీ, హైవే రెండింట్లోనూ కంఫర్ట్‌గా డ్రైవ్‌ చేయవచ్చు.

టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌Citroen Basalt X లో 1.2 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంటుంది, ఇది 110 hp పవర్‌, 190-205 Nm టార్క్‌ ఇస్తుంది. మాన్యువల్‌ & ఆటోమేటిక్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది. కారును స్టార్ట్‌ చేసినప్పుడు తొలుత కొంచెం ల్యాగ్‌ ఉన్నా, టర్బో కిక్‌ ఇన్‌ అయిన తర్వాత రెస్పాన్స్‌ బాగుంటుంది. రియల్‌ మైలేజ్‌ టెస్ట్‌లలో ఆటోమేటిక్‌ వెర్షన్‌ సిటీలో లీటరుకు 9.87 కి.మీ.లు, హైవే మీద లీటరుకు 15.01 కి.మీ. ఇచ్చింది.

Continues below advertisement

స్పేస్‌ & కంఫర్ట్‌కూపే రూఫ్‌లైన్‌ ఉన్నా, వెనుక సీట్లలో హెడ్‌రూమ్‌ బాగుంది. ముగ్గురు పెద్దవాళ్లు కంఫర్ట్‌గా కూర్చోవచ్చు. టాప్‌ ట్రిమ్‌లో 3-స్టెప్‌ అడ్జస్టబుల్‌ అండర్‌-థై సపోర్ట్‌ కూడా ఉంది, దీని వల్ల లాంగ్‌ డ్రైవ్‌లలో సౌకర్యం మరింత పెరుగుతుంది.

విలువకు తగిన ధరతెలుగు రాష్ట్రాల్లో రూ. 7.95 లక్షల నుంచి 13.10 లక్షల రూపాయల మధ్య ఎక్స్‌-షోరూమ్‌ ధరతో బసాల్ట్‌ X ‘వాల్యూ ఫర్ మనీ’ SUVగా నిలుస్తోంది. అదే సెగ్మెంట్‌లోని కాంపాక్ట్‌ SUVలతో పోలిస్తే ఇది పెద్ద సైజు, మెరుగైన డ్రైవ్‌, స్టైలిష్‌ లుక్‌ అందిస్తోంది. ఉదాహరణకు, టాప్‌ ట్రిమ్‌ Hyundai Venue కంటే దాదాపు ₹1.7 లక్షలు చౌకగా ఉంటుంది.

లోపాలేమిటి?బసాల్ట్‌ Xలో 1.2 లీటర్‌ నేచురల్లీ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్‌ వెర్షన్‌ కూడా ఉంది. కానీ గేర్‌షిఫ్ట్‌లు స్మూత్‌గా ఉండవు. క్లచ్‌ హార్ష్‌గా, గేర్‌బాక్స్‌ నాచ్‌గా ఉంటుంది. సన్‌రూఫ్‌, ADAS, టెలిస్కోపిక్‌ స్టీరింగ్‌, పవర్డ్‌ డ్రైవర్‌ సీట్‌, ప్రీమియం ఆడియో సిస్టమ్‌ వంటి ఫీచర్లు కూడా మిస్‌ అయ్యాయి.

సర్వీస్‌ నెట్‌వర్క్‌ పరిమితంసిట్రోయెన్‌ బ్రాండ్‌ ఇప్పటికీ భారత్‌లో కొత్తది. మెట్రో నగరాల బయట డీలర్‌ నెట్‌వర్క్‌ పరిమితంగా ఉండటంతో, కొంతమంది కస్టమర్లు వెనుకంజ వేస్తున్నారు.

యూత్‌ఫుల్‌ లుక్‌, డ్రైవ్‌ క్వాలిటీ, కంఫర్ట్‌, డిజైన్‌ విషయంలో బాసాల్ట్‌ X మంచి SUV. కానీ ఫీచర్ల కొరత, లిమిటెడ్‌ సర్వీస్‌ నెట్‌వర్క్‌ వంటివి కస్టమర్లు ఆలోచించే అంశాలు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.