Mid Size Car Comparison: స్పోర్టీ డ్రైవింగ్‌, వేగవంతమైన యాక్సిలరేషన్‌, నమ్మకమైన బ్రేకింగ్‌ ఉన్న మిడ్‌సైజ్‌ కారు కోసం మీరు సెర్చ్‌ చేస్తుంటే... Citroen Basalt Turbo AT & Skoda Slavia AT రెండూ మంచి పార్ట్‌నర్‌లుగా నిలుస్తాయి. ఒకటి కూపే-SUV స్టైల్‌లో ఉండగా, మరొకటి క్లాసిక్‌ సెడాన్‌ రూపంలో ఉంటుంది. అయితే నిజ జీవితంలో వీటి పనితీరు ఎలా ఉంది?.

Continues below advertisement

స్పెసిఫికేషన్స్‌ పోలిక

సిట్రోయెన్‌ బసాల్ట్‌లో పెద్ద టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంది. అయితే పవర్‌ పరంగా చూస్తే, బసాల్ట్‌ కంటే స్కోడా స్లావియా 5hp ఎక్కువ శక్తిని అందిస్తుంది. పవర్‌ టు వెయిట్‌ రేషియో స్లావియాకు అనుకూలంగా ఉండగా, టార్క్‌ టు వెయిట్‌ రేషియో మాత్రం బసాల్ట్‌కు బలంగా ఉంది. కారణం – స్లావియా కంటే బసాల్ట్‌ 27Nm ఎక్కువ టార్క్‌ను ఇస్తుంది. అంతేకాదు, బసాల్ట్‌ బరువు కూడా సుమారు 12 కిలోలు తక్కువ.

Continues below advertisement

ఈ రెండు కార్లలోనూ 6-స్పీడ్‌ టార్క్‌ కన్వర్టర్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ ఉంటుంది. 

ధర పోలిక

Citroen Basalt AT ధర రూ. 12.07-13.11 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) మధ్య ఉంటుంది.

Skoda Slavia AT ధర రూ. 14.18-16.15 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) మధ్య ఉంటుంది. 

బసాల్ట్‌ Turbo AT వేరియంట్లు స్లావియా AT కంటే తక్కువ ధరకు లభిస్తాయి. టాప్‌ వేరియంట్‌ బసాల్ట్‌ కూడా స్లావియా ఎంట్రీ AT వేరియంట్‌ కంటే రూ.1 లక్షకు పైగా చౌకగా ఉంటుంది.

0–100 kmph, క్వార్టర్‌ మైల్‌ టెస్ట్‌

0–20 kmph వరకు బసాల్ట్‌ వేగంగా దూసుకెళ్లింది. ఎక్కువ టార్క్‌ ఉండటమే దీనికి ప్రధాన కారణం. కానీ ఆ తర్వాత పరిస్థితి మారింది.

0–80 kmph చేరుకోవడంలో స్లావియా 0.46 సెకన్లు ముందుంది.

0–100 kmph వద్ద ఈ తేడా 0.83 సెకన్లకు పెరిగింది.

120 kmph స్పీడ్‌ను కూడా స్లావియా 1.38 సెకన్లు వేగంగా పూర్తి చేసింది.

క్వార్టర్‌ మైల్‌ రన్‌లో స్లావియా బసాల్ట్‌ను 0.46 సెకన్ల తేడాతో ఓడించింది.

రోలింగ్‌ యాక్సిలరేషన్‌ టెస్ట్‌

నిజ జీవిత డ్రైవింగ్‌లో చాలా ముఖ్యమైనవి ఇన్-గేర్‌ యాక్సిలరేషన్‌ టెస్టులు.

20–80 kmph టెస్ట్‌లో స్లావియా 0.34 సెకన్లు వేగంగా ఉంది.

40–100 kmph టెస్ట్‌లో ఈ తేడా 0.47 సెకన్లకు పెరిగింది.

ఇది హైవే ఓవర్‌టేకింగ్‌లో స్లావియాకు అడ్వాంటేజ్‌గా మారుతుంది.

బ్రేకింగ్‌ పనితీరు

బరువు ఎక్కువగా ఉన్నప్పటికీ, బ్రేకింగ్‌లో కూడా స్కోడా స్లావియా ఆధిక్యం చూపించింది. 80 kmph నుంచి పూర్తిగా ఆగేందుకు బసాల్ట్‌ కంటే స్లావియా 3.45 మీటర్లు తక్కువ దూరం తీసుకుంది. సమయం పరంగా ఇది 0.56 సెకన్ల తేడా. అంటే, అధిక వేగం నుంచి పూర్తిగా ఆగిపోవడంలోనూ స్లావియా ముందుంది.

టెస్టింగ్‌ ప్రమాణాలు

ఈ టెస్టులన్నీ, కంపెనీ సూచనల ప్రకారం టైర్‌ ప్రెజర్‌, ఫుల్‌ ఫ్యూయల్‌ ట్యాంక్‌తో, ఇద్దరు వ్యక్తులతో, కంట్రోల్డ్‌ పరిస్థితుల్లో నిర్వహించారు. డేటా మొత్తం GPS ఆధారిత అత్యంత ఖచ్చితమైన పరికరాలతో సేకరించారు.

చివరిగా...

తక్కువ ధర, ఎక్కువ టార్క్‌ కావాలంటే Citroen Basalt Turbo AT సరైన ఎంపిక. స్పీడ్‌, హైవే యాక్సిలరేషన్‌, బ్రేకింగ్‌లో మెరుగైన పనితీరు కావాలంటే Skoda Slavia AT స్పష్టంగా ముందుంది. మీ డ్రైవింగ్‌ అవసరాలే మీకు ఏది సరిపోతుందో నిర్ణయిస్తాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.