Citreon Basalt SUV Coupe Launched: ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయిన్ భారత్‌లో సరికొత్త బసాల్ట్ SUV కూపే ను నేడు మార్కెట్‌లోకి అధికారికంగా విడుదల చేసింది. కేవలం రూ. 7.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో దీనిని తీసుకువచ్చి ఆశ్యర్యానికి గురిచేసింది. ICE వెర్షన్‌లో రాబోతున్న తొలి SUV కూపే ఇదే కావడం గమనార్హం. ఇదే నెల ఆగస్టు 7న టాటా మోటార్స్ నుంచి లాంచ్ అయిన కర్వ్ ఎలక్ట్రిక్ కూపే స్టైల్ డిజైన్‌తో వచ్చిన తొలి కారుగా నిలిచింది. అయితే టాటా కర్వ్ ICE వెర్షన్ సెప్టెంబర్ 2, 2024న మార్కెట్‌లో అడుగుపెట్టనుంది.
2021లో భారత మార్కెట్లోకి ప్రవేశించినప్పటి నుంచి సిట్రోయిన్ ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సారి ఎలాగైనా భారతీయ మార్కెట్‌లో నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో సిట్రోయిన్ తన ఐదవ ఉత్పత్తిని మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఈ కంపెనీ నుంచి ప్రస్తుతం, C5 Aircross, C3, EC3, C3 Aircross మోడల్స్ భారతదేశంలో కొనుగోలుకి అందుబాటులో ఉన్నాయి.
ఇంజిన్ ఆప్షన్స్:
సిట్రోయిన్ బసాల్ట్ రెండు ఇంజిన్ ఆప్షన్స్‌తో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇందులోని 1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఒకటి 80 bhp , 115 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మరో 1.2-లీటర్ మూడు-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 109 bhp పవర్‌తో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 190 Nm , ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 205 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. నేచ్‌రల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్ 18 kmpl మైలేజీని అందిస్తుంది. టర్బో పెట్రోల్ మాన్యువల్ 19.5 kmpl, , ఆటోమేటిక్ వెర్షన్ 18.7 kmplని అందిస్తుంది.
ఫీచర్లు & భద్రత
కొత్త బసాల్ట్‌లో LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, ర్యాప్-అరౌండ్ టెయిల్‌లైట్లు, వెనుక AC వెంట్‌లు , వెనుక ప్రయాణీకులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు సర్దుబాటు చేయగల (3 స్టెప్ థై సపోర్ట్) ఆప్షన్ ఉంది. ఇది ఎత్తుగా ఉండే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తుంది. ఇక ఫీచర్లు విషయానికి వస్తే ఇది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌తో పాటు వైర్‌లెస్ Apple CarPlay , Android Autoతో కూడిన 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది.
సేఫ్టీ కోసం కూపే SUVలో ఆరు స్టాండర్డ్ ఎయిర్‌బ్యాగ్‌లు, ESP, సెన్సార్‌లతో కూడిన బ్యాక్ పార్కింగ్ కెమెరా , టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) ఉన్నాయి. ఇది ఏడు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. అవి పోలార్ వైట్, స్టీల్ గ్రే, ప్లాటినం గ్రే, కాస్మో బ్లూ, గార్నెట్ రెడ్ మోనోటోన్ కలర్స్.. గ్రే రూఫ్ పోలార్ వైట్ , బ్లాక్ రూఫ్ గార్నెట్ రెడ్ రెండు డ్యూయల్-టోన్ ఆప్షన్స్‌తో అందుబాటులో ఉంటుంది.
మార్కెట్‌లో పోటీ
హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా అలాగే ఫోక్స్‌వ్యాగన్ టైగూన్, హోండా ఎలివేట్ , స్కోడా కుషాక్ వంటి కాంపాక్ట్ SUVలకు సిట్రోయిన్ బసాల్ట్ గట్టి పోటీని ఇస్తుంది. అంతే కాకుండు త్వరలోనే విడుదల కానున్న టాటా కర్వ్ ఐసీఈ వెర్షన్‌తో నేరుగా టాటా కర్వ్ మోడల్‌తో పోటీపడుతుంది. ఈ కొత్త మోడల్ ఎయిర్‌క్రాస్ సిరీస్‌లో ఉండే కొన్ని ఫీచర్లను పంచుకుంటుంది. ఇందులో ఆకట్టుకునే ఇంటీరియర్ థీమ్, TFT డిస్ప్లే థీమ్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, బ్యాక్‌లో సిట్రోయెన్ బ్యాడ్జ్‌లు సరికొత్తగా ఉన్నాయి. ఆహ్లాదకరమైన డ్రైవింగ్ అనుభవంతో పాటు మంచి పనితీరును కోరుకునే కొనుగోలుదారులకు సిట్రోయిన్ బసాల్ట్ అనువైనదిగా ఉంటుంది.