మనలో చాలా మంది కారు డాష్‌బోర్డుపై పెర్ఫ్యూమ్, దేవుడి బొమ్మలు, టాయ్స్ లాంటివి పెడుతూ ఉంటాం. అవి చూడటానికి బానే ఉంటాయి కానీ కారుకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అవి మరింత ప్రమాదకరంగా మారతాయి. ఎందుకంటే ఎయిర్ బ్యాగ్ సుమారు గంటలకు 300 కిలోమీటర్ల వేగంతో డిప్లాయ్ అవుతుంది. దాని మీద ఉన్న వస్తువులు కూడా దాదాపు అదే వేగంతో ముఖం మీదకి వస్తాయి.


అలాగే కొంతమంది కారు డ్యాష్ బోర్డుపై కాళ్లు పెgట్టుకుంటారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్ బ్యాగ్స్ వేగంగా డిప్లాయ్ అయితే ఇంపాక్ట్ నేరుగా కాళ్ల మీద పడుతుంది. అప్పుడు జరిగింది పెద్ద ప్రమాదం కాకపోయినా కాళ్లు మాత్రం బాగా దెబ్బ తినే అవకాశం ఉంది.


డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా మంది సీటును ముందుకు జరుపుకుని చేతులకు బాగా దగ్గరగా పెట్టుకుంటారు. ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎయిర్ బ్యాగ్స్‌కు, మనకు మధ్య గ్యాప్ తక్కువగా ఉంటే ఎయిర్ బ్యాగ్స్ ప్రాణాలను కాపాడకపోగా, ప్రాణాపాయంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఎయిర్ బ్యాగ్స్ వల్ల కలిగే ఇంపాక్ట్ నేరుగా ముఖంపై పడుతుంది.


దీనికి సంబంధించిన డెమో వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షేర్ చేశారు. కారు ప్రయాణం చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించాల్సిందిగా సూచించారు. ముఖ్యంగా డ్యాష్‌బోర్డుపై కాళ్లు పెట్టకూడదని హెచ్చరించారు.