Cheapest Automatic Car: భారత్‌లో అన్ని నగరాల్లోనూ రోజురోజుకూ ట్రాఫిక్ పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తరచుగా జర్నీలో గేర్లు మార్చడం అందరికీ కష్టంగా ఉంటుంది. అందుకే ఆటోమేటిక్ కార్లు ఇప్పుడు లగ్జరీ కాకుండా అవసరంగా భావిస్తున్నారు. మార్కెట్లో అనేక బడ్జెట్ ఆటోమేటిక్ కార్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో మారుతి Maruti S-Presso, మారుతి ఆల్టో కే10 (Maruti Alto K10), Tata Punch అత్యంత ప్రజాదరణ పొందాయి. ఈ కార్లు మైలేజ్, ఫీచర్లు, ధర విషయానికి వస్తే చాలా మెరుగ్గా ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

Continues below advertisement

మారుతి సుజుకీ - Maruti Suzuki S-Presso

Maruti S-Presso భారతదేశంలో అత్యంత చవకైన ఆటోమేటిక్ కార్లలో ఒకటి. దీని AGS (AMT) వేరియంట్ కేవలం 4.75 లక్షల రూపాయలకు లభిస్తుంది. ఈ కారులో 998cc పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 68 bhp పవర్, 91.1 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది ARAI మైలేజ్ 25.3 kmpl ఇస్తుంది. చాలా పొదుపుగా ఉంటుంది. 7 అంగుళాల టచ్‌స్క్రీన్, Android Auto, Apple CarPlay, కీలెస్ ఎంట్రీ, పవర్ విండోస్, రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రయాణికుల సేఫ్టీ కోసం ABS, EBD, ESP, హిల్-హోల్డ్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి.

మారుతి ఆల్టో కే10 (Maruti Alto K10)

Alto K10 ని AMTతో కొనుగోలు చేయాలనుకుంటే మీరు 5.71 లక్షల రూపాయల నుంచి 6 లక్షల మధ్య ఎంచుకోవచ్చు. 998cc 3-సిలిండర్ ఇంజిన్ 65.7 bhp పవర్, 89 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. మారుతి ఆల్టో కే10 మైలేజ్ కూడా 24.9 kmpl వరకు ఉంటుంది. ఇది ఇంధన సామర్థ్యాన్ని పెంచుతుంది. ఫీచర్లలో ఫ్రంట్ పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, AC, టచ్‌స్క్రీన్ ఉన్నాయి. కొత్త అప్‌డేట్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ఇవి ప్యాసింజర్స్ సేఫ్టీని మెరుగుపరుస్తాయి. Alto K10 కాంపాక్ట్ సైజ్ సిటీలోని ఇరుకైన రోడ్లపై నడపడానికి సరైన ఛాయిస్.

Continues below advertisement

టాటా పంచ్ (Tata Punch)

Tata Punch మూడు కార్లలో అత్యంత దృఢమైనది. ఇది ఫీచర్-రిచ్ కారు. టాటా పంచ్ ఆటోమేటిక్ వేరియంట్ రూ.7.11 లక్షల నుండి ప్రారంభమవుతుంది. టాటా Punch లో 1199cc Revotron ఇంజిన్ ఇచ్చారు. ఇది 86 bhp, 113 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఆటోమేటెడ్ కారు మైలేజ్ 18.8 నుంచి 20.09 kmpl వరకు ఇస్తుంది. ఫీచర్ల విషయానికి వస్తే 7-అంగుళాల టచ్‌స్క్రీన్, Harman సౌండ్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, ఆటో క్లైమేట్ కంట్రోల్, పుష్-బటన్ స్టార్ట్, రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు ఉన్నాయి. టాప్ వేరియంట్‌లో సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్ (Wireless Charger), 360° కెమెరా కూడా లభిస్తాయి. భద్రత విషయానికి వస్తే, Punch గ్లోబల్ NCAP నుంచి 5 స్టార్ రేటింగ్ పొందింది. కనుక ఇది అత్యంత సురక్షితమైన కారుగా పరిగణిస్తారు.

మీ బడ్జెట్ తక్కువగా ఉంటే Maruti S-Presso మీకు మంచి ఛాయిస్. చౌకైన ఆటోమేటిక్ కారు. మీరు బాగా నమ్మదగిన కారును కోరుకుంటే Alto K10 మీకు సరైనది. ప్రీమియం ఫీచర్లు, భద్రత, SUV లాంటి రూపాన్ని కోరుకుంటే మీకు Tata Punch బెస్ట్ ఛాయిస్.