Cars Under Rs 5 Lakh After GST 2025: భారతదేశంలో ప్రతి ఒక్కరూ సొంత కారు కొనాలని కలలు కంటారు. కానీ, చాలా మంది విషయంలో ఈ కల నిజం కాకుండా అధిక ధరలు అడ్డుపడుతుంటాయి. అదృష్టవశాత్తూ, ఇప్పుడు చిన్న కార్ల మీద GST రేటు తగ్గింది, చాలా కార్లు కామన్ మ్యాన్‌కు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఆఫీసుకు వెళ్లడం నుంచి దూర ప్రయాణాల వరకు ప్రతి అవసరానికీ సరిపోయే బడ్జెట్-ఫ్రెండ్లీ కార్లు ఇప్పుడు మన మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి, ఇప్పుడు వాటి ధరలు కూడా 5 లక్షల రూపాయల కంటే తక్కువే ఉన్నాయి.
1. Maruti Suzuki S-Presso మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ దేశంలోనే అత్యంత తక్కువ దర కార్లలో ఒకటి. దీని ప్రారంభ ధర కేవలం ₹3,49,900 (ఎక్స్-షోరూమ్). ఇది 66.1 bhp & 89 Nm టార్క్ ఉత్పత్తి చేసే 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో శక్తినిస్తుంది. ఇది మాన్యువల్ & AMT గేర్‌బాక్స్ ఆప్షన్లలోనూ లభిస్తుంది. డిజైన్ పరంగా... ఈ కారుకు 180mm గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంది, దీనివల్ల నగరాల బయట & కఠినమైన రోడ్లపైన ప్రయాణించడానికి సులభంగా ఉంటుంది. 7-అంగుళాల టచ్‌స్క్రీన్, రెండు ఎయిర్ బ్యాగులు, EBDతో ABS & వెనుక పార్కింగ్ సెన్సార్లు వంటి ఫీచర్లు ఉన్నాయి.
2. Maruti Suzuki Alto K10మారుతి ఆల్టో K10 ఎప్పుడూ మధ్య తరగతి ప్రజలకు ఇష్టమైన కారు. దీని ప్రారంభ ధర కేవలం ₹3,69,900. ఇది 65.7 bhp & 89 Nm టార్క్ ఉత్పత్తి చేసే 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పని చేస్తుంది. దీనిలో మాన్యువల్ & AMT ఎంపికలు రెండూ అందుబాటులో ఉన్నాయి. కంపెనీ ప్రకారం, ఆల్టో K10 లీటరుకు 33.85 కిమీ/లీ ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంది. హైలైట్ ఏంటంటే, ఈ కారు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తుంది. దీని కాంపాక్ట్ డిజైన్ సిటీ డ్రైవింగ్‌కు సరైన ఆప్షన్ అవుతుంది.
3. Renault Kwidస్టైల్ & బడ్జెట్ రెండింటినీ కోరుకునే వారి కోసం పర్‌ఫెక్ట్ మ్యాచ్ రెనాల్ట్ క్విడ్. దీని ధర ₹4,29,900 నుంచి ప్రారంభమవుతుంది. ఇది 67 bhp & 91 Nm టార్క్ ఉత్పత్తి చేసే 1.0-లీటర్ SCe పెట్రోల్ ఇంజిన్‌తో పరుగులు తీస్తుంది. SUV లాంటి రూపం & 184 mm గ్రౌండ్ క్లియరెన్స్ దీనిని ప్రత్యేకంగా చూపిస్తాయి. 8-అంగుళాల టచ్‌స్క్రీన్, రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD & ట్రాక్షన్ కంట్రోల్ వంటి లక్షణాలు ఈ కారు సొంతం. దీని మైలేజ్ 22 కి.మీ./లీ వరకు ఉంటుంది.
4. Tata Tiagoమీరు భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటే, టాటా టియాగో ఒక ఉత్తమ ఎంపిక. దీని ప్రారంభ ధర ₹4,57,490 & దీనికి 4-స్టార్ GNCAP భద్రతా రేటింగ్ ఉంది. ఇది 84.8 bhp & 113 Nm టార్క్ ఉత్పత్తి చేసే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో శక్తినిస్తుంది. CNG వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. టియాగోలో ప్రీమియం ఇంటీరియర్, 7-అంగుళాల టచ్‌స్క్రీన్ వంటివి కనిపిస్తాయి. ఎక్కువ స్పేస్ కూడా అందిస్తుంది, ఇది ఫ్యామిలీకి సరైన కారు.
5. Maruti Suzuki Celerio మారుతి సుజుకి సెలెరియో ప్రారంభ ధర ₹4,69,900. ఇది 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది, 66.1 bhp & 89 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని AMT వేరియంట్ లీటరుకు 26.68 km ఇస్తుంది, డబ్బు ఆదా చేస్తుంది. సెలెరియో CNG వేరియంట్ 34.43 km/kg ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. సెలెరియోలో 7-అంగుళాల టచ్‌స్క్రీన్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు & EBDతో కూడిన ABS ఉన్నాయి. దీని కాంపాక్ట్ డిజైన్ సిటీ & గ్రామీణ ప్రాంతాలలోనూ ఉపయోగపడుతుంది.
ఈ ధరలన్నీ ఎక్స్-షోరూమ్ రేట్లు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు, బీమా, ఇతర అవసరమైన ఖర్చులు కలుపుకుంటే ఆన్-రోడ్ ధర వస్తుంది.