Cars available for lowest EMI Diwali 2025: ఈ దీపావళి సీజన్‌ అంటే కేవలం బాణసంచా, దీపాలు, కొత్త బట్టలు, స్వీట్లు మాత్రమే కాదు - ఇప్పుడు కొత్త కారు కూడా!. అవును, మారుతి సుజుకి ఈ దీపావళి సీజన్‌లో యూత్‌కి, ఫ్యామిలీలకి పక్కా సర్‌ప్రైజ్‌ (Diwali 2025 Maruti Car Offers) ఇచ్చేసింది. కేవలం రూ. 1,999 EMI తో కొత్త కారు మీ గేటు దగ్గర నిలబడుతుంది అని చెబుతోంది.

పండుగ సీజన్‌లో రికార్డు డెలివరీలుజీఎస్టీ తగ్గింపు ‍‌(GST 2025) తర్వాత, మారుతి సుజుకి అమ్మకాలు బూమ్‌ బూమ్‌ అంటూ పెరిగాయి. కేవలం మొదటి ఎనిమిది రోజుల్లోనే ఈ కంపెనీ 1.65 లక్షల వాహనాలను డెలివరీ చేసింది. దసరా నాటికి ఈ సంఖ్య 2 లక్షలు దాటింది. అంతేకాదు, ఇంకా 2.5 లక్షల బుకింగ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. అంటే, మారుతి కార్ల డిమాండ్‌ ఎక్కడికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క మారుతీనే కాదు.. హ్యుందాయ్‌, టాటా, మహీంద్ర, కియా, స్కోడా, వోక్స్‌వ్యాగన్‌ కార్లది కూడా ఇదే పరిస్థితి.

రూ.1,999 EMI ప్లాన్‌ - ఎవరి కోసం?మొదటిసారి కారు కొనాలనుకునే వాళ్ల కోసం ప్రత్యేకంగా రూ.1,999 పథకం తీసుకొచ్చారు. ముఖ్యంగా, ప్రస్తుతం ద్విచక్ర వాహనం నడిపుతూ, చిన్న కారు దిశగా అప్‌గ్రేడ్‌ అవ్వాలని బలంగా కోరుకునే వాళ్లకు ఇది గోల్డెన్‌ ఛాన్స్‌. Maruti Suzuki Alto K10, Maruti Suzuki Wagon R, Maruti Suzuki Celerio వంటి ఎంట్రీ లెవల్‌ మోడళ్లకే ఈ రూ.1,999 EMI పథకం వర్తిస్తుంది. దీని అర్ధం, మీ మొదటి కారు మారుతి సుజుకి నుంచి రావడం ఖాయం!. 

కంపెనీ ఇంకా EMI డీటెయిల్స్‌, బ్యాంక్‌ పేర్లు వెల్లడించకపోయినా, త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వనుంది. కానీ రూ. 1,999 EMI అనే విషయం ప్రజల్లో హైప్‌ క్రియేట్‌ చేసింది.

GST తగ్గింపుతో ఈ కార్లు చాలా చవక

కొత్త GST 2.0 అమల్లోకి వచ్చిన తర్వాత మారుతి సుజుకి తన కార్ల ధరలను గణనీయంగా తగ్గించేసింది.

Maruti Suzuki Wagon R LXI వేరియంట్‌ ఇప్పుడు రూ. 4.99 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌), ఇది ₹79,600 తగ్గింపు.

Maruti Suzuki Alto K10 STD (O) వేరియంట్‌ ధర రూ. 4.23 లక్షల నుంచి రూ. 3.69 లక్షలకు తగ్గింది - సుమారు ₹53,100 సేవ్‌.

Maruti Suzuki Celerio LXI వేరియంట్‌ ధర రూ. 5.64 లక్షల నుంచి రూ. 4.69 లక్షలకు తగ్గడం వల్ల రూ. 94,100 వరకు లాభం.

GST తగ్గింపుతో కారు కొనుగోలు ఇప్పుడు చాలా అందుబాటులోకి వచ్చిందని ఈ నంబర్లు చూస్తే అర్థమవుతుంది.

ఎవరు ఎక్కువగా లాభం పొందుతారు?విద్యార్థులు, కొత్తగా ఉద్యోగం మొదలుపెట్టిన యూత్‌, స్మాల్‌ ఫ్యామిలీ కస్టమర్లు రూ.1,999 EMI ఆఫర్‌తో ఎక్కువగా లాభపడతారు. ఎందుకంటే, EMI తక్కువగా ఉండడం వల్ల నెలవారీ ఆర్థిక భారం తగ్గుతుంది.

దీపావళి అంటే వెలుగుల పండుగ, ఈసారి మారుతి సుజుకి అదే వెలుగును మీ గ్యారేజీకి తీసుకువస్తుంది. ₹1,999 EMIతో కారు సొంతం చేసుకోవడం ఇప్పటి వరకు కల లాంటిది. ఆ కల నిజమయ్యే తరుణం వచ్చింది. షోరూమ్‌కి వెళ్లి ఒక టెస్ట్‌ డ్రైవ్‌ కొట్టి, ఈ పండుగ సీజన్‌లో మీ డ్రీమ్‌ కార్‌ని ఇంటికి తీసుకురండి!.