Price Hike on Cars: BS6 ఫేజ్ 2 (కొత్త RDE నిబంధనలు) ఏప్రిల్ 1వ తేదీ నుంచి భారతదేశంలో ప్రారంభం కానుంది. సమాచారం ప్రకారం కొత్త RDE నిబంధనలను ప్రవేశపెట్టడంతో కార్ల తయారీదారులు తమ వాహనాల ధరలను రెండు నుంచి నాలుగు శాతం పెంచడానికి సిద్ధమవుతున్నారు. అంటే వివిధ వాహనాల తయారీ, మోడల్ ప్రకారం ఇది సుమారు రూ. 15 వేల నుంచి రూ. 25 వేల వరకు పెరగవచ్చు. మరోవైపు, మారుతీ, మహీంద్రా & మహీంద్రా, హోండా, ఎంజీ, కియా వంటి అన్ని ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాల పెరిగిన ధరలను త్వరలో ప్రకటించవచ్చు. అదే సమయంలో వాణిజ్య వాహన తయారీదారులు తమ వాహనాలపై ఐదు శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించడం ప్రారంభించారు.
కార్లు ధరలు పెరగడం మొదలైంది
వాహన తయారీదారులు తమ BS6 అప్‌డేటెడ్ వాహనాల ధరలను త్వరలో పెంచనున్నట్లు వార్తలు వస్తున్నాయి. టాటా, కియా వంటి సంస్థలు ఇప్పటికే దీన్ని ప్రారంభించినప్పటికీ కియా తన RDE నిబంధనలు, ఈ20 ఇంధన ఆధారిత వాహనాలపై 2.5 శాతం పెంపును ప్రకటించింది, ఇందులో కియా సెల్టోస్, సోనెట్, కారెన్స్ కార్లు ఉన్నాయి.
ఇతర కంపెనీలు కూడా ధరలను పెంచబోతున్నాయి
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మహీంద్రా అండ్ మహీంద్రా స్వయంగా తమ వాహనాల ధరలను రూ. 20,000 వరకు పెంచాలని సూచించింది. అదే సమయంలో మారుతి తన కొన్ని వాహనాలను కూడా అప్‌డేట్ చేసింది. ఇది కాకుండా హోండా ఇటీవల తన కొత్త హోండా సిటీని విడుదల చేసింది. ఏప్రిల్ నుండి ఇతర వాహనాలపై కూడా ధరల పెంపు ఉంటుంది.
టాటా కార్లు ఐదు శాతం
టాటా మోటార్స్ తన వాణిజ్య వాహనాల ధరలపై ఐదు శాతం వరకు పెంపును ప్రకటించింది. అయితే టాటా తన ప్యాసింజర్ వాహనాలను కొత్త RDE నిబంధనల ప్రకారం ఫిబ్రవరిలోనే అప్‌డేట్ చేసింది. వాహనాల అప్‌డేషన్‌లో మార్చిన భాగాల ప్రకారం కంపెనీ ఇప్పటికే 1.2 శాతం ధరలను ప్రకటించింది. దానిని మరింత సవరించే అవకాశం ఉంది.
అదే సమయంలో చాలా లగ్జరీ కార్లు ఇప్పటికే BS6 ఇంజిన్‌లతో వస్తున్నాయి. అయితే ఫారెక్స్, ఇన్‌పుట్ ఖర్చు కారణంగా, కంపెనీలు ధరలను కొద్దిగా పెంచవచ్చు. దీంతో మెర్సిడెస్ బెంజ్ తన వాహనాల ధరలను ఐదు శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. లెక్సస్ వంటి సంస్థలు పరిస్థితికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవడానికి వేచి ఉన్నాయి.
హోండా మోటార్స్ తన సిటీ, సిటీ హైబ్రిడ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ఈ నెలలోనే మన దేశంలో విడుదల చేసింది. ఎక్స్‌టీరియర్ లుక్‌లో కొన్ని మార్పులతో పాటు కొన్ని కొత్త ఫీచర్లను ఇందులో పొందుపరిచారు. ఇప్పుడు ఈ కారు ఏకైక 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 121 PS శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే దీని e:HEV వేరియంట్‌లో మునుపటి మాదిరిగానే అదే 1.5 లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజన్ లభిస్తుంది. ఈ కారు మారుతి సుజుకి సియాజ్, న్యూ జనరేషన్ హ్యుందాయ్ వెర్నాతో పోటీపడుతుంది.