వర్ష కాలంలో పలు నగరాల్లో నీరు నిలిచిపోవడం తరచూ చూస్తుంటాం. దీనివల్ల రోడ్డుపై కారు నడపడం మీకు కష్టంగా మారుతుంది. కొన్ని చోట్ల ఎంతలా వర్షం పడుతుందంటే, ఆ ప్రాంతం మొత్తం వరద లాంటి పరిస్థితులు నెలకొంటాయి. దీని కారణంగా చాలా మందికి వాహనాన్ని పార్క్ చేయడంలో ఇబ్బంది సడతానే. కొన్నిసార్లు పార్క్ చేసిన వాహనమే నీటిలో మునిగిపోయే పరిస్థితులు సైతం ఉంటాయి.
దీనివల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఒకవేళ మీ వాహనం వర్షపు నీటిలో మునిగిపోతే, కంపెనీ నుండి మీకు ఇన్సూరెన్స్ లభిస్తుందా లేదా అనేది తెలుసుకుందాం. అయితే, ఈ సమయంలో మీరు కూడా కొన్ని విషయాలను మీరు గుర్తుంచుకోవాలి, లేదంటే మీ ఇన్సూరెన్స్ రిజెక్ట్ కావచ్చు.
పొరపాటున కూడా కారు ఇంజిన్ స్టార్ట్ చేయవద్దు
వరద లేదా వర్షపు నీటిలో మునిగిన కారును చూడగానే చాలా మంది మొదటగా బండి ఆన్ చేసి ఇంజిన్ స్టార్ట్ చేస్తారు. కానీ కారు వెంటనే స్టార్ట్ అవ్వదు. అయినా ప్రజలు కారును స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. కారు నీటిలో మునిగి ఉన్నప్పుడు ఇంజిన్ స్టార్ట్ చేస్తే, నీరు నేరుగా సిలిండర్ లోపలికి వెళ్లిపోతుందని తెలుసుకోండి.
Also Read: ఇప్పటివరకు భారత్ NCAP క్రాష్ టెస్ట్‌కు వెళ్లిన 31 కార్లు - ఏవి 5 స్టార్, ఏవి 4 స్టార్ సాధించాయి?
దీనివల్ల ఇంజిన్ హైడ్రోస్టాటిక్ లాక్ (Hydrostatic lock) పడుతుంది. ఇన్సూరెన్స్ కంపెనీలు దీనిని డ్రైవర్ నిర్లక్ష్యంగా భావిస్తాయి. దీనివల్ల జరిగే భారీ నష్టానికి సంబంధించిన క్లెయిమ్‌ను వెంటనే రిజెక్ట్ చేస్తాయి. అందువల్ల ఎల్లప్పుడూ కారును నీటి నుండి బయటకు నెట్టడం ద్వారా లేదా టో (Tow) చేయడం ద్వారా మాత్రమే బయటకు తీయాలి.
వెంటనే కారు ఫోటో తీయండి
నీరు తగ్గగానే, మొదటగా మొబైల్‌తో కారు కండీషన్ స్పష్టంగా చూపించే ఫోటోలు, వీడియోలు తీసుకోండి. నష్టం ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిందనడానికి ఇది మీ వద్ద ఉన్న బలమైన సాక్ష్యం.
ఆ తర్వాత వెంటనే మీ ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం అందించాలి. ఆ కంపెనీ సర్వేయర్ వచ్చి వాహనాన్ని పరిశీలించే వరకు కారును ఏదైనా లోకల్ గ్యారేజ్‌లో విప్పి రిపేర్ చేయించడం లాంటి తప్పు మాత్రం చేయకండి. అధికారిక అనుమతి లేకుండా మీ అంతట మీరే పని ప్రారంభించడం వల్ల కంపెనీ మీ కారు ఇన్సూరెన్స్ క్లెయిమ్ పాస్‌ను రిజెక్ట్ చేయవచ్చు.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో టాటా సియెర్రా EV ఫైనల్‌గా ఎంతకు వస్తుంది? ఆన్‌రోడ్ ధరలు, EMI వివరాలు ఇవిగో
