Continental Sound Technology: కారులో ఆడియో అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది డోర్లలో ఉన్న స్పీకర్లు, డ్యాష్‌బోర్డ్‌ మీద ట్వీటర్లు, వెనుక షెల్ఫ్‌లో ఉండే పెద్ద స్పీకర్‌ సెటప్‌. కానీ ఈ సంప్రదాయానికి పూర్తిగా భిన్నంగా, స్పీకర్‌ అవసరమే లేకుండా కార్‌ లోపలి ఫ్లాట్‌ భాగాల నుంచే సౌండ్‌ వినిపించే టెక్నాలజీని ప్రముఖ ఆటోమోటివ్‌ టెక్‌ సంస్థ 'కాంటినెంటల్‌' అభివృద్ధి చేసింది.

Continues below advertisement

ఇన్‌స్ట్రుమెంట్‌ డిస్‌ప్లేనే ఒక సౌండ్‌ చాంబర్‌ఈ కొత్త ఆలోచన ప్రకారం, కారులో ఉన్న ఇన్‌స్ట్రుమెంట్‌ డిస్‌ప్లేనే ఒక సౌండ్‌ చాంబర్‌గా పని చేస్తుంది. అంటే, డ్రైవర్‌ ముందు ఉండే డిజిటల్‌ డిస్‌ప్లే నుంచే మాటలు, అలర్ట్స్‌, ఆడియో శబ్దాలు స్పష్టంగా వినిపిస్తాయి. ప్రత్యేకంగా స్పీకర్లు అమర్చాల్సిన అవసరం ఉండదు.

ఈ డిస్‌ప్లే టెక్నాలజీకి ఆధారం Ac2ated Sound అనే ప్రత్యేక సిస్టమ్‌. కాంటినెంటల్‌ ఈ టెక్నాలజీని కొన్ని సంవత్సరాల క్రితమే ప్రపంచ ప్రఖ్యాత ఆడియో సంస్థ Sennheiserతో కలిసి అభివృద్ధి చేయడం ప్రారంభించింది. ఇది కేవలం ఆడియో సిస్టమ్‌లా మాత్రమే కాకుండా, మొత్తం వాహన డిజైన్‌లో భాగంగా పని చేసేలా రూపొందించారు.

Continues below advertisement

ఈ సిస్టమ్‌లో యాక్చ్యుయేటర్లు అనే చిన్న పరికరాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి డిస్‌ప్లే గ్లాస్‌లో స్వల్ప కంపనాలు సృష్టిస్తాయి. ఆ కంపనాల వల్ల డిస్‌ప్లే మొత్తం ఒక స్పీకర్‌లా మారి శబ్దాన్ని విడుదల చేస్తుంది. మాటలు, అలర్ట్‌ టోన్లు, ఇతర సౌండ్‌ ఎఫెక్ట్స్‌ అన్నీ కూడా అత్యంత స్పష్టమైన నాణ్యతతో వినిపిస్తాయని కాంటినెంటల్‌ చెబుతోంది.

డ్రైవింగ్‌ సమయంలో మరింత ఏకాగ్రతఈ టెక్నాలజీకి మరో పెద్ద ప్రయోజనం అకౌస్టిక్‌ లోకలైజేషన్‌. మనుషులు సహజంగా శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో గుర్తించి ఆ వైపు చూస్తారు. ఇప్పుడు డ్రైవర్‌కు సంబంధించిన అలర్ట్‌ లేదా సమాచారం డిస్‌ప్లే నుంచే సౌండ్‌గా వస్తే, డ్రైవర్‌ చూపు ఆటోమేటిక్‌గా ఆ డిస్‌ప్లే మీదే పడుతుంది. దీంతో డ్రైవింగ్‌ సమయంలో దృష్టి మరింత కేంద్రీకృతమవుతుంది.

ఈ ఆలోచన వెనుక వాహన అకౌస్టిక్స్‌, సైకోఅకౌస్టిక్స్‌ నిపుణుల బృందం పని చేసింది. సైకోఅకౌస్టిక్స్‌ అంటే మనుషులు శబ్దాన్ని ఎలా గ్రహిస్తారనే శాస్త్రం. అదే జ్ఞానాన్ని ఉపయోగించి ఈ సిస్టమ్‌ను డిజైన్‌ చేశారు.

స్టోరీ ఇంకా ఉంది!ఈ స్టోరీ ఇక్కడితోనే ముగియదు. కాంటినెంటల్‌ చెబుతున్నదేమిటంటే, ఈ యాక్చ్యుయేటర్‌ టెక్నాలజీని కేవలం డిస్‌ప్లేలోనే కాకుండా డోర్‌ ట్రిమ్స్‌, హెడ్‌రెస్ట్స్‌, A-పిల్లర్స్‌, రూఫ్‌ లైనింగ్‌ లాంటి ఏ ఫ్లాట్‌ ఉపరితలంలోనైనా అమర్చవచ్చు. అలా చేస్తే, భవిష్యత్తులో కారులో ఒక్క సంప్రదాయ స్పీకర్‌ కూడా అవసరం లేకపోవచ్చు.

దీని వల్ల పెద్ద ప్రయోజనం ఏమిటంటే, సుమారు 40 కిలోల బరువు తగ్గుతుంది, అలాగే 90 శాతం స్థలం ఆదా అవుతుంది. కొన్ని గల్జరీ కార్లలో ప్రస్తుతం 30కి పైగా స్పీకర్లు ఉంటాయి. అలాంటి కార్లలో ఈ టెక్నాలజీ వాడితే డిజైన్‌, స్పేస్‌, బరువు పరంగా భారీ మార్పు కనిపిస్తుంది.

2020లో CESలో కాంటినెంటల్‌ ఈ Ac2ated Sound సిస్టమ్‌ను తొలిసారి ప్రదర్శించినప్పుడు, దీన్ని Speakerless Immersive Sound System అని పిలిచారు. అప్పుడు ఇది డిస్‌ప్లే కంటే ఆడియోపై ఎక్కువగా దృష్టి పెట్టింది. వయోలిన్‌ లాంటి వాయిద్యాల చెక్క శరీరం ఎలా శబ్దాన్ని ప్రతిధ్వనింపజేస్తుందో, అలాగే కార్‌ లోపలి ఉపరితలాలు శబ్దాన్ని ప్రసారం చేస్తాయన్నదే ఈ ఆలోచన సారాంశం.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.