Second Hand Car Buying Tips: సెకండ్ హ్యాండ్ కారును కొనేటప్పడు ఆ కారు గతంలో ఏదైనా పెద్ద ప్రమాదానికి గురైందా అని అందరిలోనూ డౌట్ ఉంటుంది. చాలా మంది కారు ఓనర్లు కారు అసలు కండీషన్‌ను దాచిపెట్టి విక్రయిస్తుంటారు. అలాంటి సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండి, సరిగ్గా చెక్ చేయడం ద్వారా మీరు భవిష్యత్తులో ఇబ్బందుల నుండి తప్పించుకోవచ్చు. కొన్ని విషయాలపై ఫోకస్ చేయడం ద్వారా ఆ కారు గతంలో ఏమైనా ప్రమాదానికి గురైందో లేదో తెలుసుకోవచ్చు. ఇవి తెలుసుకుంటే మీకు పూర్తి అవగాహన వస్తుంది. 

Continues below advertisement

బాడీ గ్యాప్స్‌ను చెక్ చేయండికంపెనీ నుంచి వచ్చిన కొత్త కారులో బోనెట్, డోర్స్, డిక్కీ మధ్య గ్యాప్ (ఖాళీ) అన్ని చోట్లా సమానంగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా భాగంలో గ్యాప్ ఎక్కువ లేదా తక్కువగా కనిపిస్తే అనుమానించాలి. లేదా తలుపు సరిగ్గా మూతపడకపోతే, ఆ భాగానికి రిపేర్లు చేశారని గ్రహించాలి. చాలా సార్లు ప్రమాదం జరిగిన తర్వాత బాడీ పార్ట్స్ మారుస్తుంటారు. దీనివల్ల ఫిట్టింగ్ గతంలోలాగ ఉండదు.

పెయింట్ చెక్ చేయాలి

Continues below advertisement

కారు పెయింట్‌ను జాగ్రత్తగా గమనిస్తే చాలా విషయాలు తెలుస్తాయి. కారులోని ఏదైనా భాగం రంగు లేదా షైనింగ్ మిగిలిన బాడీ కంటే భిన్నంగా కనిపిస్తే, ఆ భాగానికి మళ్లీ పెయింట్ వేశారని గ్రహించాలి. రబ్బరు లైనింగ్ లేదా అంచులపై పెయింట్ మరకలు కనిపించడం రిపేర్లకు సంకేతం కావచ్చు. కంపెనీ ఒరిజినల్ పెయింట్ సాధారణంగా స్మూత్‌గా ఉంటుంది. కానీ తర్వాత వేసిన పెయింట్ కొంచెం గరుకుగా అనిపిస్తుంది. 

బోనెట్, లోపలి భాగాలను చూడండిబోనెట్ తెరిచి బోల్టులు, Hinges జాగ్రత్తగా గమనించండి. వాటిపై పనిముట్ల గుర్తులు ఉన్నా లేదా పెయింట్ ఊడిపోయి ఉన్నా, ఆ భాగాన్ని విప్పి రిపేర్ చేశారని గ్రహించాలి. ఇంజన్ చుట్టుపక్కల, డిక్కీ లోపల వెల్డింగ్ గుర్తులు లేదా వంగిన ఐరన్ కనిపిస్తే, కారు ప్రమాదానికి గురై ఉండవచ్చు. తక్కువ ధరకు వస్తుందని ఆశపడితే అది మనకు ఆర్థిక నష్టంతో పాటు కేసుల్లో ఇరుక్కునే అవకాశాలు లేకపోలేదు.

టెస్ట్ డ్రైవ్ చేయడం మర్చిపోవద్దుకారు కొనే ముందు తప్పనిసరిగా టెస్ట్ డ్రైవ్ చేయాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు ఇంజన్ శబ్దం, వైబ్రేషన్, స్టీరింగ్ పనితీరుపై దృష్టి పెట్టాలి. వేగంగా వెళ్తున్నప్పుడు కారు అసాధారణ శబ్దాలు చేసినా లేదా ఒక వైపుకు లాగుతున్నట్లు అనిపించినా, ఆ కారులో సమస్య ఉందని తెలిసిపోతుంది. 

అద్దాలు, రికార్డులను కూడా చెక్ చేయండికారులోని అన్ని అద్దాలపై తయారీ తేదీ రాసి ఉంటుంది. ఏదైనా ఒక అద్దంపై తేదీ భిన్నంగా ఉంటే, ఆ అద్దాన్ని మార్చారని తేలిపోతుంది. అదేవిధంగా కొత్త హెడ్‌లైట్లు కూడా యాక్సిడెంట్‌కు సంకేతం కావచ్చు. వీటితో పాటు సర్వీస్ రికార్డులు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ వివరాలను తప్పకుండా చెక్ చేయాలి. అప్పుడే ఆ కారు ఏ ప్రమాదానికి గురైందో లేదో తెలుస్తుంది. అప్పుడు కారు కొనాలా వద్దా మీరు డిసైడ్ అవ్వొచ్చు. 

ఆటో సెక్షన్ సంబంధించి మరిన్ని ఆసక్తికర వార్తల కోసం క్లిక్ చేయండి