KTPO (కర్ణాటక ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్) ఆధ్వర్యంలో కర్నాటకలో ఆసియాలోనే అతిపెద్ద ఆటో ఎక్స్ పో నిర్వహించబోతోంది. కనెక్టెడ్, అటానమస్, ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన CAEV EXPO 2023 పేరుతో ఆటో షో ఏర్పాటుకాబోతోంది. బెంగళూరు వేదికగా ఏప్రిల్ 13, 14 తేదీల్లో ఈ ఎక్స్ పో జరగనుంది. ఈ షోలో 5,000 మంది ఆయా కంపెనీల ప్రతినిధులు, 150 మంది ఎగ్జిబిటర్లు, 60 మంది వక్తలు పాల్గొనబోతున్నారు.  ఇందులో తొమ్మిది సెషన్‌లు ఉంటాయి. పలు కీలకాంశాలు, లీడ్ టాక్‌లు, ప్యానల్ డిస్కషన్‌లు నిర్వహించనున్నారు. కనెక్ట్డ్,  అటానమస్, షేర్డ్, ఎలక్ట్రిక్, స్మార్ట్ మొబిలిటీకి సంబంధించిన ఉత్పత్తులను ఇందులో ప్రదర్శించనున్నారు. 


CAEV EXPO 2023లో కీలక అంశాలపై చర్చ   


CAEV EXPO 2023లో కాన్ఫరెన్స్‌ లో పలు కీలక అంశాల గురించి చర్చించే అవకాశం ఉంది. కనెక్టెడ్ వెహికల్స్, అటానమస్ వెహికల్స్,  స్మార్ట్ & షేర్డ్ మొబిలిటీ, ఎలక్ట్రిక్ వాహనాలు, ఆటోమోటివ్ సైబర్‌ సెక్యూరిటీ, వెహికల్ డేటా మేనేజ్‌మెంట్, ఆటోమోటివ్ కోసం ఇంటెలిజెంట్ క్లౌడ్, మ్యాప్‌లు, నావిగేషన్, వాహనం ఇన్ఫోటైన్‌మెంట్, ADAS, ఫ్లీట్ టెలిమాటిక్స్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఆటోమోటివ్ M2M & IoT సొల్యూషన్స్, కనెక్టెడ్ ఇన్సూరెన్స్, ఆటోమోటివ్ సిమ్యులేషన్ & టెస్టింగ్, సస్టైనబుల్ మొబిలిటీపై చర్చలు నిర్వహించనున్నారు.


ఈ ఆటో షోకు సంబంధించి టయోటా కనెక్టెడ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ GK సెంథిల్ కీలక విషయాలు వెల్లడించారు. “మేము కనెక్టెడ్ మొబిలిటీ కేవలం లగ్జరీ కోసం మాత్రమే కాకుండా సమర్థవంతమైన రవాణా,  వినియోగదారులు కోరుకునే ఎక్స్ పీరియెన్స్ కు జోడించాలి అనుకుంటున్నాం. CAEV  ఎక్స్‌పో కనెక్టెడ్ మొబిలిటీ స్పేస్‌ లో భారతీయ పర్యావరణ వ్యవస్థను కనెక్ట్ చేయడానికి గొప్ప వేదిక కాబోతోంది. సమర్థవంతమైన, పర్యావరణ అనుకూలమైన, సందర్భోచిత సేవలను అందించే ప్రిడిక్టివ్ & AI/ML-ఆధారిత సాంకేతికతల గురించి ఈ షోలో ఎక్కువగా తెలుసుకోవాలి అనుకుంటున్నాను” అన్నారు. 


ఆటోమోటివ్ పరిశ్రమకు సవాళ్లు, పరివర్తనకు సంబంధించిన వివరాలు CAEV EXPO 2023లో కనిపించే అవకాశం ఉందని అశోక్ లేలాండ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కనకసబాపతి సుబ్రమణియన్ తెలిపారు. సస్టైనబుల్ మొబిలిటీ, కనెక్టెడ్ వాహనాలతో పాటు మరెన్నో అంశాల గురించి ఈ షోలో తెలుసుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు.  అశోక్ లేలాండ్ క్లీన్, సేఫ్టీ, స్మార్ట్ వాణిజ్య వాహనాలను అందించే మంచి పొజిషన్ లో ఉందన్నారు. టెక్నాలజీ విషయంలో సరికొత్త ముందగుడులు వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 


వాహన టెలిమాటిక్స్ తప్పనిసరి


అటు అన్ని వాణిజ్య, ప్రజా రవాణా వాహనాలు తప్పనిసరిగా వాహన టెలిమాటిక్స్ కలిగి ఉండాలని భారత ప్రభుత్వం ఆదేశించింది. ఇది కనెక్టెడ్ వాహనాల వినియోగాన్ని మరింత ముందుకు తీసుకువెళుతుంది. భారత ప్రభుత్వం అన్ని కొత్త వాహనాలలో ADAS సిస్టమ్‌లను చేర్చడాన్ని తప్పనిసరి చేస్తోంది. ప్రభుత్వం నేషనల్ ఎలక్ట్రిక్ వెహికల్ మిషన్ 2030తో 2030 నాటికి భారతదేశం 100 శాతం EV దేశంగా మారాలని భావిస్తోంది. భారతదేశంలో 5G సేవలు అందుబాటులోకి వచ్చాయి. 5G కార్లు ఒకదానితో ఒకటి కమ్యూనికేట్, మౌలిక సదుపాయాలతో కమ్యూనికేట్ చేయడానికి వీలు కల్పిస్తుంది. మరింత సురక్షితమైన డ్రైవింగ్ కు దోహదపడనుంది.


ఎలక్ట్రిక్ వాహనాల్లో క్లీన్ ఎనర్జీని విస్తృతి పెంచాలి  


క్లీన్ మొబిలిటీపై దృష్టి సారించాల్సిన అవసరం చాలా ఉందని వోల్వో ఐషర్ కమర్షియల్ వెహికల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సచిన్ అగర్వాల్ వెల్లడించారు. క్లీన్ ఎనర్జీ టెక్నాలజీని  ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనాలను విస్తృత పర్చడానికి ఉపయోగించేలా చూస్తే బాగుంటుందన్నారు. CAEV EXPO ఆటో పరిశ్రమతో పాటు వినియోగదారులకు కనెక్టెడ్, స్వయంప్రతిపత్తమైన,  ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన చాలా విషయాలను ఇందులో తెలుసుకునే అవకాశం ఉందన్నారు. 


 Read Also: సామాన్యుల కోసం ‘బజాజ్ క్యూట్’ - మారుతీ ఆల్టోకు గట్టిపోటీ, ధర ఎంతంటే..