Maruti Suzuki Ertiga CNG Loan And EMI Details: ఒకేసారి పెద్ద మొత్తాన్ని ఖర్చు చేయకూడదనుకున్నా లేదా మీ చేతిలో ఎక్కువ డబ్బు లేకున్నా పర్లేదు.. మారుతి సుజుకీ ఎర్టిగా CNG బేస్ వేరియంట్ VXi (O) ను సులభంగా కొనవచ్చు. కేవలం రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించి ఈ కారుకు ఫైనాన్స్ తీసుకోవచ్చు & మిగిలిన మొత్తాన్ని మీకు సులభంగా అనిపించే EMIలలో చెల్లించవచ్చు.
న్యూదిల్లీలో మారుతి ఎర్టిగా CNG VXi (O) వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర (Maruti Ertiga CNG VXi (O) Ex-showroom Price) దాదాపు రూ. 11 లక్షలు. రిజిస్ట్రేషన్ కోసం RTI ఛార్జీలు, బీమా & ఇతర ఛార్జీలు కలిపితే ఆన్-రోడ్ ధర (Maruti Ertiga CNG VXi (O) On-road Price) దాదాపు రూ. 12.90 లక్షలు పలుకుతుంది.
లోన్ తీసుకుంటే నెలకు ఎంత EMI కట్టాలి?ఒకవేళ, మీరు, మారుతి ఎర్టిగా CNG VXi (O) వేరియంట్ కోసం రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చేస్తే, మిగిలిన రూ. 10.90 లక్షలను (రూ.12.90 లక్షలు - రూ.2 లక్షలు) కారు లోన్ కింద తీసుకోవచ్చు. బ్యాంక్ మీకు 9 శాతం వడ్డీ రేటుతో ఈ లోన్ మంజూరు చేసిందని భావిద్దాం. కార్ లోన్ తిరిగి తీర్చడానికి మీరు 5 సంవత్సరాల కాల పరిమితిని ఎంచుకుంటే, 9% వడ్డీ రేటు ఆధారంగా, మీ నెలవారీ EMI రూ. 22,627 అవుతుంది. 5 సంవత్సరాలలో మొత్తం రూ. 13,57,596 చెల్లించాలి, ఇందులో వడ్డీ రూ. 2,67,596 కలిసి ఉంటుంది. బ్యాంక్ వడ్డీ రేటు మీ క్రెడిట్ స్కోర్, బ్యాంక్ పాలసీపై ఆధారపడి ఉంటుంది.
ఆరేళ్ల కాలానికి 9 శాతం వడ్డీ రేటుతో లోన్ తీసుకుంటే, నెలకు రూ. 19,648 చెల్లించాలి. 6 సంవత్సరాలలో మొత్తం రూ. 14,14,644 కట్టాలి, ఇందులో వడ్డీ రూ. 3,24,644 ఉంటుంది.
ఏడేళ్ల టెన్యూర్‌తో 9 శాతం వడ్డీ రేటుకు లోన్ తీసుకుంటే, నెలనెలా రూ. 17,537 చెల్లించాలి. 7 సంవత్సరాలలో మొత్తం రూ. 14,73,116 కట్టాలి, ఇందులో వడ్డీ రూ. 3,83,116 ఉంటుంది.
మారుతి సుజుకి సీఎన్‌జీ ఎర్టిగా మైలేజ్ (Maruti Suzuki CNG Ertiga Mileage)మారుతి ఎర్టిగా CNG 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తోనూ నడుస్తుంది. CNG మోడ్‌లో గరిష్టంగా 86.63 bhp పవర్‌ను & 121.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. CNG మోడ్‌లో ఈ కారు కిలోగ్రాముకు 26.11 కి.మీ. మైలేజీని ఇస్తుందని కంపెనీ ప్రకటించింది.
మారుతి సుజుకి సీఎన్‌జీ ఎర్టిగా ఫీచర్లు (Maruti Suzuki CNG Ertiga Features)ఈ 7-సీటర్ కారు మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లతో డిజైన్ అయింది. ఈ సెగ్మెంట్‌లో ఈ కారు రెనాల్ట్ ట్రైబర్ & కియా కారెన్స్‌తో పోటీ పడుతుంది. మారుతి సుజుకి ఎర్టిగా CNGని ఫైనాన్స్‌లో తీసుకునే ముందు మీ సమీపంలోని మారుతి డీలర్‌షిప్ నుంచి పూర్తి సమాచారం పొందండి.